Salman Khan Death Threat Explained: లారెన్స్ బీష్ణోయ్ సల్మాన్ నీ ఎందుకు చంపాలి అనుకుంటున్నాడు?

Author: Sekhar, NewsOrbit

పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు లారెన్స్ బీష్ణోయ్. ఇప్పుడు ఇతడే ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నీ చంపేస్తాం అని లెటర్ రాసినట్లు పోలీసు విచారణలో బయట పడింది

Police Say Death threat for Salman Khan from last 4 years is very serious.

లారెన్స్ బీష్ణోయ్ 2018వ సంవత్సరంలో కోర్టు బయట " జోధాపూర్ లో సల్మాన్ ఖాన్ నీ చంపేస్తామని బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నీ హత్య చేయాలని ముంబైలో రెక్కీ కూడా నిర్వహించడం జరిగింది.1

లారెన్స్ బీష్ణోయ్ కమ్యూనిటీ జంతువులను పవిత్ర జీవులుగా ఆరాధిస్తూ ఉంటారు. దీంతో కృష్ణజింకల వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ హస్తం ఉన్నట్లు వార్తలు ఎప్పటినుండో ఉండటంతో.. ఆయనపై కక్ష పెట్టుకోవడం జరిగింది.

అయితే ఆ తర్వాత మరొక హత్య కేసులో 2020లో లారెన్స్ బీష్ణోయ్ గ్యాంగ్ లో కీలక అనుచరుడు సన్నీ పోలీసులకు పట్టుబడిన సమయంలో సల్మాన్ ఖాన్ నీ విడిచి పెట్టే ప్రసక్తే లేదని విచారణలో తెలపడం జరిగింది.

అయితే ఇప్పుడు సింగర్ సిద్దు హత్య జరగటంతో పోలీసులు సల్మాన్ కి భద్రత పెంచారు. ఇటువంటి తరుణంలో.. సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్.. జాగింగ్ చేస్తున్న సమయంలో.. సల్మాన్ నీ త్వరలో చంపేస్తామని లెటర్ రాయటం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఇదిలా ఉంటే లారెన్స్ బీష్ణోయ్.. గ్యాంగ్ ఆల్రెడీ గత ఏడాదిలో రాజస్థాన్ కి చెందిన గ్యాంగ్ స్టార్ సంపత్ నెహ్రూ.. ద్వారా.. సల్మాన్ నీ హత్య చేయటానికి బాంద్రాలో..కూడా రెక్కీ నిర్వహించడం జరిగిందట.

అయితే ఆ సమయంలో సల్మాన్ ని చంపేయడానికి అంతా రెడీ అయి పిస్టల్ దగ్గర ఉండగా.. గన్ టార్గెట్ చేరుకునే సామర్థ్యం లేకపోవడంతో.. చివరి నిమిషంలో ఆ ప్రయత్నం ఫెయిల్ అయిందట.

దీంతో మరింత టెక్నాలజీ.. ఎక్కువ దూరం టార్గెట్ లని చేరుకునే రైఫిల్ కోసం లారెన్స్ బీష్ణోయ్ తన సహచరుడు అనిల్ పాండ్యాకు దాదాపు నాలుగు లక్షలు చెల్లించి  కొనుగోలు చేసినట్లు  విచారణలో బయట పడింది.

Lawrence Bishnoi order long range rifle worth 400000 rupees to kill Salman Khan: Police Confirms.

మొత్తంమీద చూసుకుంటే దాదాపు నాలుగు సంవత్సరాల నుండి లారెన్స్ బీష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ నీ హతమార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా పోలీస్ విచారణలో బయట పడింది. దీంతో ముంబై పోలీసులు నటుడు సల్మాన్ ఖాన్ కి అతని తండ్రి సలీం ఖాన్ కి ప్రత్యేకమైన భద్రత కేటాయించడం జరిగింది.