ఫోటో స్టోరీ: జయలలితకు కెరీర్ ఇచ్చింది మన తెలుగు జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ గారే. 

Date: 14-11-2022

Special Story on Super Star Krishna from NewsOrbit/Deepak Rajula

సూపర్ స్టార్ కృష్ణ గారు అనారోగ్యం తో హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. అక్కడి డాక్టర్లు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, కృష్ణ గారు కార్డియాక్ అరెస్ట్ వలన అడ్మిట్ అయినట్టు, పరిస్థితి క్రిటికల్ గానే ఉంది అని తెలిపారు.

ఘట్టమనేని కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ గారి రికార్డుల గురించి మనకు తెలిసిందే. తెలుగు జేమ్స్ బాండ్ గా ఆయనకున్న ఖ్యాతి ఊరకనే వొచ్చింది కాదు.

ఘట్టమనేని కృష్ణ

దక్షిణ భారత చెలన చిత్ర అభివృద్ధికి ఆయన చేసిన మేలు మనం ఎన్నటికీ మరువలేనిది

ఘట్టమనేని కృష్ణ

ఈ సందర్భం లో, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారికి కెరీర్ బ్రేక్ ఇచ్చింది సూపర్ స్టార్ కృష్ణ గారు అని

ఘట్టమనేని కృష్ణ

తెలుగులో మొదటి స్పై సినిమా గా పేరు తెచ్చుకున్న సినిమా గూఢచారి 116, ఇందులో నటీమణి అయిన జయలలిత గారికి అంతకముందు పెద్ద హిట్ సినిమా లేదు.

ఘట్టమనేని కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ గారి చొరువతో, జయలలితకు గూఢచారి 116 సినిమా లో నటించే అవకాశం దక్కింది. ఈ  సినిమా సక్సెస్ తరువాత తెలుగు లో ఇంకా తమిళ్ లో జయలలితకు చాలా ఆఫర్లు వొచ్చాయి.

గూఢచారి 116 సక్సెస్ తరువాత, సూపర్ స్టార్ కృష్ణ  గారు గూఢచారి 117, జేమ్స్ బాండ్ 777, రహస్య గూఢచారి లాంటి సీక్వెల్స్ కూడా తీసారు

ఇలాంటి సినిమాలతో మన అందరిని ఎంతగానో అలరించిన కృష్ణ గారు త్వరగా కోలుకోవాలని మనం కోరుకుందాం.

ఘట్టమనేని కృష్ణ