చిరంజీవి సినిమాల్లోకి వచ్చి 31 ఏళ్లు: నాటి చిరంజీవి మెగా హిట్ సినిమాలు..నేటి స్టార్ హీరోలు ఎవరికి ఏది సూట్ అవుతుందో తెలుసుకుందాం..!!

చిరంజీవి తన డాన్స్ మరియు ఫైట్స్ తో సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఎంతోమంది నటీనటులకు చిరంజీవి ఆదర్శంగా నిలిచారు. అయితే నాటి చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రస్తుత స్టార్ హీరోలకు ఎవరికి ఏది సూట్ అవుతుందో అనేది ఒకసారి చూద్దాం.

పసివాడి ప్రాణం: 1987వ సంవత్సరంలో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. అయితే ఈ సినిమాని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలలో.. అల్లు అర్జున్ ఇంకా చరణ్ కి బాగా సూట్ అయ్యే క్యారెక్టర్. బాగా కష్టపడే తత్వం కలిగిన హీరోయిజం ఈ సినిమాలో కనిపిస్తోంది.

ఖైదీ:- మెగాస్టార్ చిరంజీవికి మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా. ఇది కూడా కోదండరామిరెడ్డి దర్శకత్వంలోనే తెరకెక్కిన ఈ సినిమా 1983వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఖైదీలో చిరంజీవి యాక్షన్ అప్పటి మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. చాలా కోపంగా.. ఎంతో వైల్డ్ లుక్ లో చిరంజీవి కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈ సినిమాని ప్రస్తుతం ఉన్న హీరోలలో రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ కి కరెక్టుగా సూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

అభిలాష:- ఇది కూడా 1983 వ సంవత్సరంలోనే విడుదలైన సినిమా. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మ్యూజికల్ గా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో చిరంజీవి లాయర్ పాత్రలో కనిపిస్తారు. అయితే ఈ సినిమాని ప్రస్తుతం ఉన్న హీరోలలో రీమేడ్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లేదా రామ్ చరణ్ కి కరెక్టుగా సూట్ అయ్యే అవకాశాలు ఎక్కువ.

చాలెంజ్:- 1984వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో చిరంజీవి కష్టపడి కొన్ని లక్షలు సంపాదిస్తాడు. నిరుద్యోగిగా ఉండే చిరంజీవికి రావుగోపాలరావు విసిరే డబ్బు సంపాదించే సవాల్ ఆసక్తిగా ఉంటుంది. డబ్బు కోసం చిరు కష్టపడే విధానం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని ప్రస్తుతం ఉన్న హీరోలలో రీమేడ్ చేస్తే..రామ్, నితిన్ చక్కగా పోషించే కంటెంట్ కలిగిన స్టోరీ.

విజేత: కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1985 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా చిరంజీవి నటనలో మరో కోణాన్ని బయటపెట్టింది. ఫుట్ బాల్ ఆటగాడిగా చిరంజీవి ఈ సినిమాలో కనిపిస్తారు. అయితే ఫుట్ బాల్ లీగ్ రాణించాలని చిరంజీవి కష్టపడే విధానం.. కుటుంబం నుండి వచ్చే అవరోధాలను ఎదుర్కోవటంతో పాటు అవమానాలను తట్టుకుంటాడు. అయితే కుటుంబంలో కష్టాలు వాళ్ళ చివరకి..కిడ్నీలు డొనేట్ చేసి కుటుంబ కష్టాలను గట్టెకించి తండ్రి ప్రాణాలను కాపాడటంతో జీవితంలో నిజమైన విజేతగా నిలుచుతాడు.

యముడికి మొగుడు: 1988వ సంవత్సరంలో రవిరాజ పిన్ని శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషనల్ విజయం సాధించింది. ఈ సినిమాలో చిరంజీవి డబల్ రోల్ లో కనిపిస్తాడు. ఒకటి అమాయకమైంది, మరొకటి చాలా రఫ్ క్యారెక్టర్. కానీ హఠాత్తుగా చిరంజీవి చనిపోవడం యమలోకానికి వెళ్ళటం.. అక్కడి నుండి స్టోరీ వేరే లెవెల్ లో ఉంటుంది

ఏది ఏమైనా 2000 సంవత్సరానికి ముందు.. చిరంజీవి నటించిన చాలా సినిమాలు తెలుగు సినిమా రంగాన్ని మాత్రమే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసాయి. అప్పట్లో చిరంజీవి వేసిన స్టెప్పులు.. చేసిన ఫైట్లు.. సినిమా ఇండస్ట్రీలో కొత్త ఒరవడిని తీసుకొచ్చాయి. సినిమాలో పాట వచ్చిన సమయంలో డాన్స్ వేయాల్సిన హీరోకి బదులు కెమెరా ఊపోసే పరిస్థితులు ఉండే ఆ రోజులలో చిరంజీవి వేసిన స్టెప్పులు ట్రెండ్ సెట్ అయ్యాయి

దాంతో మిగతా హీరోలంతా డాన్స్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలు తమదైన శైలిలో డ్యాన్స్ వేస్తున్నారంటే దానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆది పురుషుడు చిరంజీవి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 60 సంవత్సరాలు దాటినా గాని ఇప్పటికీ కూడా చిరంజీవి తనలో ఉన్న రిథమ్ కెమెరా ముందు అద్భుతంగా ఆడిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తారు.