పాపులర్ వెబ్ సిరీస్ నటి అహ్సాస్ చన్నా సక్సెస్ స్టోరీ

Special Story: Ahsaas Channa

Images Credit: Instagram/ Ahsaas Channa

బాలీవుడ్ నటి ఆహ్సస్ చన్న హిందీలో బాగా పాపులర్ నటి.  21 సంవత్సరాలు వయసు కలిగిన ఈమె ప్రస్తుతం సినిమాలలో అదేవిధంగా వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.

అతి చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మంచి క్రేజ్ తో దూసుకుపోతుంది. ఆహ్సస్ చన్న ఆగస్టు 5వ తారీఖు 1999 వ సంవత్సరంలో ముంబైలో జన్మించడం జరిగింది.

ఆహ్సస్ చన్న తండ్రి ఇక్బాల్ సింగ్ చన్న, తల్లి కుల్బిర్ కౌర్ ఇద్దరూ కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే. తల్లి టెలివిజన్ నటి. తండ్రి పంజాబీ ఫిలిం ప్రొడ్యూసర్.

దీంతో ఆహ్సస్ చన్న అతి చిన్న వయసులోనే ఐదవ సంవత్సరంలోనే "వాస్తు శాస్త్ర" సినిమాతో స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

ఆహ్సస్ చన్న ప్రైమరీ మరియు సెకండరీ భారతీయ విద్యా భవన్ ముంబై హైస్కూల్ లో కంప్లీట్ చేసింది. ఇంకా ముంబాయిలో పలు  యూనివర్సిటీలలో కూడా చదవటం జరిగింది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన "వాస్తు శాస్త్ర"  హర్రర్ సినిమాలో.. సుస్మితాసేన్ కొడుకుగా ఆహ్సస్ చన్న నటించింది.

సినిమా కెరియర్ ప్రారంభంలో చాలావరకు మగపిల్లాడి పాత్రలు చేయటంతో..ఆహ్సస్ చన్న నీ అందరూ అబ్బాయిని భావించారు. తర్వాత అమ్మాయి అని తెలియటంతో మధ్యలో ఆమె ఆపరేషన్ చేయించుకుందని రూమర్లు వచ్చాయి. అయితే వాటిలో వాస్తవం లేదని ఆహ్సస్ చన్న తెలియజేయడం జరిగింది.

ఆహ్సస్ చన్న తన కెరియర్ లో మొత్తం మూడు భాషలలో హిందీ అదేవిధంగా తెలుగు మరియు తమిళ్ సినిమాలలో అవకాశం అందుకుంది. టీనేజ్ వయసులోనే ఆహ్సస్ చన్న చాలా టెలివిజన్ షోలలో పలు టీవీ సీరియల్స్ లో నటించింది.

ఆహ్సస్ చన్న నటించిన వెబ్ సిరీస్ లిస్ట్.. గర్ల్స్ హాస్టల్, కోట ఫ్యాక్టరీ, హాస్టల్ డాజీ, థీ ఇంటేర్న్స్, గర్ల్స్ హాస్టల్ 2.0, థీ ఇంటేర్న్స్ 2, క్లచ్, కోటా ఫ్యాక్టరీ 2, జుగ్గడిస్తాన్, మోడరన్ లవ్ ముంబాయి వంటి వెబ్ సిరీస్ లలో నటించింది. ఆహ్సస్ చన్న నటించిన షార్ట్ ఫిలిం "ట్రాన్సిస్టర్". దీనిలో ఉమా అనే పాత్ర చేయడం జరిగింది.

ఆహ్సస్ చన్న అతి చిన్న వయసులోనే సినిమా రంగంలోకి రావడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా సినిమా రంగంలోనే ఉండటంతో ఆమెకు మంచి అవకాశాలు అందుకుంటూ.. తన టాలెంట్ నిరూపించుకుంది.

ఆహ్సస్ చన్న కి ఇష్టమైన హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ విషయానికొస్తే దివంగత అందాలనాటి శ్రీదేవి.