ఇండియన్‌ 2: కమలహాసన్ సినిమాలో యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్

Visual story on Kamal Haasan's Indian 2 Movie by Deepak Rajula

భారత్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అందరికీ సుపరిచితుడే. భారత జట్టులో ఆల్ రౌండర్ ప్రతిభతో యువరాజ్ అనేక మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించాడు. 

ఇండియన్‌ 2: కమలహాసన్ సినిమాలో యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్

క్రికెట్లో ఎంతో విజయవంతంగా రాణించిన యువరాజ్ సింగ్ ప్రస్తుతం అని క్రికెట్ ఫార్మెట్లకు రిటైర్డ్ ప్రకటించి రెస్ట్ తీసుకుంటున్నాడు.

యువీ తండ్రి కూడా క్రికెటర్ యే. కొడుకు యువీకి కోచ్ కూడా. ఈ క్రమంలో యూవి తండ్రి యోగరాజ్. కమలహాసన్ తో నటిస్తున్నారు.

మేటర్ లోకి వెళ్తే శంకర్ దర్శకత్వంలో కమల్ హీరోగా నటిస్తున్న “ఇండియన్ 2″లో నటిస్తున్నట్లు స్వయంగా యోగరాజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది.

తనకి మేకప్ వేస్తున్న ఫోటోను షేర్ చేసి “కెమెరా వెనక పనిచేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. నన్ను మరింత స్మార్ట్ గా తయారు చేస్తున్న మేకప్ మ్యాన్ కు థ్యాంక్స్”..”ఇండియన్ 2″ మూవీలో నటించడానికి పంజాబ్ సింహం సిద్ధంగా ఉందని” పేర్కొన్నారు. 

దీంతో యువరాజ్ తండ్రి పెట్టిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ కరోనా ముందు 2019 లోనే దాదాపు 80% వర్క్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత నిర్మాతలతో దర్శకుడు శంకర్ కి గొడవలు కావడంతో… సినిమా ఆగిపోయింది. ఈ క్రమంలో తాను నటించిన “విక్రమ్” సినిమా సూపర్ డూపర్ హిట్ కావటంతో.. కమల్ చొరవ తీసుకొని “ఇండియన్ 2” మళ్లీ సెట్స్ పైకి వెళ్లేలా చేశాడు.