అక్టోబర్ 25 – ఆశ్వీయుజమాసం – మంగళవారం - రోజు వారి రాశి ఫలాలు

Check Your Today's Horoscope- October 25 2022 Rasi Phalalu Astrology Today

నేటి జాతక వెబ్ స్టోరీ: సోమరాజు శర్మ రచించారు మరియు దీపక్ రాజుల రూపొందించారు

సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. పాత రుణాలు నుండి విముక్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు లభిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆప్తుల నుండి అవసరానికి ధన సహకారం అందుతుంది.

మేషం

ముఖ్యమైన పనులలో ఆత్మ విశ్వాసంతో పని చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. చుట్టుపక్కల వారితో ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

వృషభం

మిధునం సంతాన విద్యా విషయంలో ఊహించని విషయాలు తెలుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో ఆప్తులతో పాల్గొంటారు. స్థిరాస్తి ఒప్పందాలు అతికష్టం మీద పూర్తవుతాయి. ఋణ ఒత్తిడి అధికమై మానసిక శిరో భాధలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి

కర్కాటకం ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. ఉద్యోగాల్లో సహోద్యోగులతో సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. మిత్రులకు మీ అభిప్రాయాలు నచ్చవు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి.

సింహం వాహన యోగం ఉన్నది. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్ధిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహారిస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

కన్య వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

తుల కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ముఖ్యమైన విషయాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగమున విలువైన పత్రములు విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి.

వృశ్చికం వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనస్సు ఇతరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు.

మకరం ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి. చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ఉద్యోగమున పనిఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

కుంభం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం ధన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు తప్పవు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఇంటా బయట ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.

తెలుగు మరియు జ్యోతిషశాస్త్రంలో రోజువారీ జాతకంపై మరిన్ని వెబ్ కథనాలు