Hypertension & Dash Diet : డాష్ డైట్ తొ కేవలం రెండు వారాలలో హైపర్‌టెన్షన్‌ తగ్గించుకోవొచ్చు, ఇది ఎలా సాధ్యం?

Author: Deepak Rajula

Title 1

డాష్ డైట్ అనే ఒక ఆహారం తీసుకునే విధానం, డాష్ డైట్ తొ కేవలం రెండు వారాలలో హైపర్‌టెన్షన్‌ తగ్గించుకోవొచ్చు. ఇది ఎలా సాధ్యపడుతుందో తెలుసుకుందాం

ప్రతి సంవత్సరం ఈ ఒత్తిడి లక్షల మంది ప్రాణం తీస్తుంది. కానీ రక్తపోటు విషయానికి వొస్తే మనం అనుకునేట్టు ఇది ఒత్తిడి (స్ట్రెస్) వలన కంటే తినే ఆహారం వలన ఎక్కువ మంది రక్తపోటు బాధితులు అవుతున్నారు. 

డాష్ డైట్:  హైపర్‌టెన్షన్‌ను ఆపడానికి ఆహార విధానాలు

డాష్ డైట్ లో ముఖ్యంగా పొటాషియం, మెగ్నీషియం మరియు కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తినవలిసి ఉంటుంది. వీటి తో పాటు సోడియం మరియు తీపి నియంత్రించడం చాలా కీలకం. 

డాష్ డైట్ ప్రయత్నిచిన చాలా మందికి హైపర్‌టెన్షన్‌ తగ్గటం-రక్తపోటు నుంచి ఉపశమనం దొరకడం లాంటి మార్పులు కేవలం రెండు నుంచి నాలుగు వారాలలో కనిపిస్తుంది. 

డాష్ డైట్ తో LDL చెడు కొలెస్ట్రాల్ నియంత్రించవొచ్చు. దీనికి మీరు సంతృప్త కొవ్వులు, మెడికల్ భాష లో సాటురేటడ్ ఫ్యాట్స్(saturated fats) మీరు తినే ఆహారం లో అసలు లేకుండా చూసుకోవాలి. 

డాష్ డైట్ అనేది ఆరోగ్యకరమైన ఆహారం తినడం అలవాటు చేసుకోవడం. ఇందు కోసం మీరు తృణధాన్యాలు, పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా అలవాటు చేసుకోవాలి. 

ఉదాహరణకు మీరు రోజు లో ఒక కప్ రైస్, 5 కప్స్ ఉడకపెట్టిన కూరగాయలు, 3 కప్స్ తాజా పండ్లు, 1 గ్లాస్ లౌఫ్యాట్ పాలు, ¼ కప్ నాన పెట్టిన నట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ తినొచ్చు.

వీటితో మీకు రోజుకు సరిపడా పొటాషియం, మెగ్నీషియం మరియు కాల్షియం ఉంటుంది. అంతే డాష్ డైట్ అంటే అంత సులువు మరి. గుర్తుంచుకోండి, వీటిలో ఎక్కడ కూడా ఉప్పు వాడకూడదు.