సాక్షికి కౌంటర్ ఇచ్చి రిషికి తన ప్రేమ విషయం చెప్పనున్న వసుధార

గుప్పెడంత మనసు ఎపిసోడ్ 535

Author: Suma K

వసు రిషి తెచ్చిన ఉంగరానికి తాడు కట్టి తన మెడలో వేసుకుని అది చూసి మురిసిపోతుంది. అప్పుడే రిషి రావటంతో ఏంటి సార్ ఇలా సడెన్ గా వచ్చారు అని ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తుంది. దాంతో రిషి వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. అదే క్రమంలో రిషి తన మెడలో ఉన్న గొలుసుని చూసి వెంటనే ఆ తాడు ఏంటి అని అడుగుతాడు

గుప్పెడంత మనసు August 10th ఎపిసోడ్ 535: వసుకు డబ్బు సహాయం చేసిన రిషి 

ఏమి లేదు సార్ అంటూ వసు కవర్ చేస్తుంది. సరే అని చెప్పి నేను కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు పెట్టిస్తున్నాను అవి ఈ రాత్రి వరకు చదివి రేపు అప్పజెప్పాలి అని చెప్పి తన చేతిలో కొన్ని డబ్బులు పెడతాడు. ఆ డబ్బులు చూసి ఈ డబ్బులు దేనికి అని వసు అడగటంతో ఏదో అవసరం ఉందని రెస్టారెంట్ యజమాని చెప్పాడులే.

సీన్ కట్ చేస్తే రిషికి వసు ఫోన్ చేయడంతో ఆ ఫోన్ లాక్కుని గౌతమ్ మాట్లాడుతుంటాడు. వసు ఇంటికి వచ్చాను అనటంతో వెంటనే రిషి హాల్ లోకి వెళ్తాడు.అయితే అప్పటికే ధరణి వసుకు కాఫీ తెస్తాను అని అనటంతో ధరణిపై దేవయాని కఅరిచి తనను అక్కడి నుంచి పంపిస్తుంది.

ఆ తర్వాత దేవయాని వసుతో ఎందుకు వచ్చావు అన్నట్లు మాట్లాడటంతో అప్పుడే రిషి వచ్చి నేనే రమ్మన్నాను పెద్దమ్మ అని చెప్పి నేను మాట్లాడి పంపిస్తా మీరు వెళ్ళండి అని అంటాడు.

గుప్పెడంత మనసు August 10th ఎపిసోడ్ 535

సాక్షికి మాటలకూ తిరిగి కౌంటర్ వేసిన వసు

ఇక వసు పని రిషి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్తుండగా తనకు దారిలో సాక్షి ఎదురుపడుతుంది. ఇక సాక్షి ఎప్పటిలాగానే వసుతో కాస్త వెటకారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. 

కానీ వసు మాత్రం తగ్గేదేలే అంటూ తన స్టైల్ లో సాక్షికి కౌంటర్ వేస్తుంది. ఇక వసు కాలేజ్ దగ్గరికి వెళ్లి అక్కడ రిషి గురించి తనతో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది.ఆ తర్వాత ఆ మాటలు విని రిషి ఆశ్చర్యపోతాడు.

వసు ప్రేమ విషయం రిషికి చెప్పనుందా..? సీన్ కట్ చేస్తే గౌతమ్ రిషి దగ్గరకు వచ్చి వసు ప్రేమ గురించి అడుగుతాడు. ఏది అయితే అది అయిద్ది అన్నట్టు రిషి సమాధానం చెప్పడంతో వసు విని షాక్ అవుతుంది.

ఇక వసు అమ్మవారి దగ్గరికి వెళ్లి ఎలాగైనా రిషికి తన ప్రేమ విషయం తెలియాలి అన్నట్టు దండం పెట్టుకోవడంతో తాను అమ్మవారితో మాట్లాడిన మాటలు ఎవరో విన్నట్లుగా రాబయే ఎపిసోడ్ లో చూపిస్తారు.