పంచభూతాల సాక్షిగా ఒక్కటైన రిషిధార..!

గుప్పెడంత మనసు ఎపిసోడ్ 539

Author: Suma K

గత ఎపిసోడ్ లో వసు తన ప్రేమ విషయం రిషికి చెప్పాలి అని నాకు మీరు కావాలి మీ ప్రేమ కావాలి.. మీతో కలిసి జీవితాంతం ప్రయాణం చెయ్యాలి.

గుప్పెడంత మనసు August 26 ఎపిసోడ్ 539: వసుకు డబ్బు సహాయం చేసిన రిషి 

రిషి లేకుండా ఈ వసు పూర్తి కాదు.. మీరు లేకుండా.. ఈ వసుధార లేదు అంటుంది  వసు.నన్ను క్షమించండి.. నా ప్రేమని అంగీకరించండి.. ఐ లవ్యూ’ అంటూ రిషికి  వసు తన చేతిలోని గిఫ్ట్‌ని అందిస్తూ రిషికి లవ్ ప్రపోజ్ చేస్తుంది వసు.

ఇక ఈరోజు ఎపిసోడ్ లో కూడా అదే సీన్ కంటిన్యూ అవుతుంది.నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను..ఈ మాట ఇప్పుడు చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేనేమో భయం వేస్తుంది సార్ అంటూ తన చేతిలో ఉన్న గిఫ్ట్ రిషికీ ఇస్తుంది.

రిషి ఆ గిఫ్ట్ ను చూస్తూ రిషి సంతోషంతో ఇప్పటినుంచి ఈ బొమ్మని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది వసుధార అని అంటాడు. దాంతో వసుధార ఎంతో సంతోష పడుతూ ఉంటుంది.

గుప్పెడంత మనసు August 26 ఎపిసోడ్ 539

పంచభూతాల సాక్షిగా ఒక్కటైన రిషిధార..!

మరొకవైపు మహేంద్ర జగతి ఇద్దరూ రిషి, వసు గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. వసు ఈరోజు తన మనసులోని మాట రిషి కి చెప్పకపోతే జీవితాంతం ఇంకా చెప్పలేదు అంటుంది జగతి.

కొడుకు జీవితం గురించి ఆలోచనలో పడ్డ జగతి :

ఒకవేళ వసు తన మనసులో మాట చెప్పకపోతే పరీక్షల తర్వాత వీళ్లు ఇంకా కలవడానికి అవకాశం ఉండదు అని అంటుంది జగతి. అలా వారిద్దరూ కాసేపు రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

వర్షం సాక్షిగా ఒక్కటి అయిన రిషిదార  : మరొకవైపు రిషి,వసుధార ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు.అప్పుడు రిషి ఎప్పటికీ మనిద్దరం ఇలాగే కలిసి ఉండాలి. జీవితాంతం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి ఉండాలి అని అనటంతో వసు సరే అని అంటుంది. 

అప్పుడు రిషి ఆరోజు నువ్వు నన్ను కాదన్నావు నిన్ను ఎవరు బెదిరించారు అని వసును అడగగా సాక్షి అని చెప్పడంతో రిషి షాక్ అవుతాడు. ఉంటుంది. ఆ తర్వాత రిషి మన ప్రేమ కొనసాగాలి వసు అలాగే నువ్వు నీ ప్రేమను కూడా త్యాగం చేయాలి అనడంతో పసుధార షాక్ అవుతుంది.