మహేంద్ర, జగతిలు ఎక్కడున్నారో రిషి తెలుసుకుంటాడా?

గుప్పెడంత మనసు ఎపిసోడ్ 590

Guppedantha Manasu Today Episode October 26 Author: Suma K

జు అక్టోబర్ 25వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.గత ఎపిసోడ్ లో మహేంద్ర, జగతి ఇద్దరు ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో రిషి చాలా బాధ పడుతూ ఉంటాడు.అదే సీన్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది.ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే వసు రిషితో, వాళ్ళిద్దరూ వెళ్లిపోవడానికి ఒక రకంగా మనిద్దరం కూడా కారణమే అయి ఉండొచ్చు కదా సార్ గురుదక్షిణ విషయంలో అని వసు అనగా, ఎందుకు వసుధార ప్రతిసారి తిరిగి అక్కడే వస్తావు.

గుప్పెడంత మనసు October 26 ఎపిసోడ్ 590: 

నేను అందర్నీ అర్థం చేసుకుంటే మరి నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు అని అంటాడు రిషి. దానికి వసు, నేనున్నాను కదా అని అంటుంది వసు.అప్పుడు రిషి, ఇంక పదా లోపలికి కి వెళ్దాము మీటింగ్ కి డాడ్ వాళ్ళని కూడా రమ్మని అఫీషియల్ గా మెయిల్ కూడా పెట్టాను కదా వాళ్ళు కచ్చితంగా వస్తారు అని అంటాడు. ఇక మీటింగ్ గది బయట రిషి, వసుధారలు చాలాసేపటి వరకు ఎదురు చూస్తూ ఉంటారు.

గుప్పెడంత మనసు October 26 ఎపిసోడ్ 590

వసుకు సారీ చెప్పిన రిషి :

మరోవైపు జగతి, మహీంద్ర లు గౌతమ్ తో మాట్లాడుతూ, రిషి మా గురించి బాధపడుతున్నాడని మాకు తెలుసు గౌతమ్ కానీ ఈ పరిస్థితుల్లో ఇదే చేయాలి లేకపోతే రిషి మమ్మల్ని అర్థం చేసుకోడు అని అంటారు. అదే సమయంలో వసు గౌతమ్ కి మెసేజ్ పంపిస్తుంది రిషి సార్ మహేంద్ర సార్ కోసం చాలా బాధపడుతున్నారు అని అంటుంది.

 అప్పుడు గౌతమ్, వసుధార మెసేజ్ పంపింది అంకుల్ రిషి మీకోసం బాధపడుతున్నాడట చాలా కంగారుగా ఉన్నాడట అని అనగా నాకు రిషి మనసు నాకు తెలుసు గౌతమ్.అఫీషియల్ గా మాకు మెయిల్ పెట్టాడు కదా వస్తాము అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు అని బాధపడతారు.

మరోవైపు దేవయాని ఎవరికో ఫోన్ చేసి హమ్మయ్య శుభవార్త చెప్పారు అయితే జగతి, మహేంద్రలు మీటింగ్ కి రాలేదన్న మాట అని ఫోన్ పెట్టేసిన తర్వాత ఎదురుగా ధరణి ఉంటుంది. ధరణి ని చూసిన దేవయాని ఉలిక్కిపడి ఎప్పుడు వచ్చావు ధరణి, ఈమధ్య నన్ను భయ  పెట్టేస్తున్నావు. 

Guppedantha Mansu Today Episode October 26 ఎపిసోడ్ 590

ఏమీ ఇవన్నీ విని ఎవరికైనా చాడీలు చెప్పి గూడచారం చేస్తున్నావా అని అనగా, నేనెందుకు అలా చేస్తాను అత్తయ్య గారు. మీరే నా దైవం కదా అని అంటుంది.నేను జీవితంలో ఎంతో మందిని చూశాను కాని నీ లాంటి వాళ్ళ గురించి మాత్రం ఎప్పటికీ ఒక అంచనా వేయలేకపోతున్నాను నువ్వు ఎప్పటికైనా ఒక వసుధార లాగా ఒక జగతి లాగా తయారవుతావేమో అని భయమేస్తుంది. 

నువ్వు ఎప్పటికీ దేవయాని కోడలువే అది గుర్తు పెట్టుకో అంటుంది దేవయాని. సరే అత్తయ్య గారు కాఫీ స్ట్రాంగ్ గా కావాలా లైట్ గా కావాలా అంటే ఏదోటి తగలెయ్యి అంటుంది దేవయాని..అప్పుడు ధరణి మనసులో నవ్వుకుంటు అక్కడ నుండి వెళ్తుంది.

Guppedantha Mansu Today Episode October 26  Episode 590

ఆ తర్వాత సీన్లో జగతి,మహేంద్రలు, గౌతమ్ కూర్చుని ఉండగా ఇంతలో రిషి ఆ ఇంటి  తలుపు కొట్టి గౌతమ్ అని అరుస్తాడు. ఆ గొంతు విని జగతి, మహేంద్రలు భయపడి  రిషి ఇక్కడికి ఎలా వచ్చాడు. తెలిసిపోయిందా? గౌతమ అసలు ఏం జరుగుతుంది అని  గౌతమ్ మీద అరుస్తారు. దానికి గౌతమ్, నేనే చెప్పాను అంకుల్.

గుప్పెడంత మనసు October 26 ఎపిసోడ్ 590:

సరే మేము వెళ్లి మేము పక్కన దాకుంటాము రిషికి కానీ మేము ఇక్కడ ఉన్నట్టు తెలిస్తే జీవితంలో నేను నీతో మాట్లాడను అని గౌతమ్ కు చెప్పి మహేంద్ర, జగతి గదిలో దాక్కుంటారు.ఇంతలో రిషి పదే పదే తలుపు కొడతాడు. అప్పుడు తలుపు తీసిన వెంటనే ఎందుకురా ఇంతసేపు అయింది తలుపు తీయడానికి.