2022 ఆసియా కప్‌కు ముందు పాకిస్థాన్ ఆటగాళ్లతో భారత ఆటగాళ్లు, యుద్ధానికి సిద్ధం కమ్మని సలహా!

Author: Suma K, Sports reporter at NewsOrbit

2022 Asia Cup

క్రికెట్ అభిమానులకు పండగ రాబోతోంది. ఈ ఆదివారం ఆసియా కప్‌లో క్రికెట్ మహాసంగ్రామం జరగబోతుంది. అది ఎవరెవరి మధ్య జరగబోతుందో చెప్పాల్సిన పనిలేదు.

అవును.. మీరు ఊహించింది నిజమే.... ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా జరగబోతోంది. ఈ క్రమంలో ఆసియాకప్ టోర్నీ కోసం జట్లన్నీ దుబాయ్ చేరుకున్నాయి.

దుబాయ్‌లోని ICC అకాడమీలో శిక్షణ సెషన్‌లలో భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లు ఒకరినొకరు కలుసుకుని ఆప్యాయంగా శుభాకాంక్షలు చెప్పుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక టీమిండియా ఆసియాకప్‌లో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుండడం ఓ వైపు ఇండియా క్రికెట్ అభిమానులకు, మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ అభిమానులకు ఓ పండగలాగ ఉంది.

భారత్ Vs పాకిస్థాన్ 2022 ఆసియా కప్ మ్యాచ్‌కు ముందు రిషబ్ పంత్ పాకిస్థానీ ఆటగాళ్లతో

భారత్ వర్సెస్ పాకిస్థాన్ 2022 ఆసియా కప్ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ ఆటగాళ్లతో కేఎల్ రాహుల్

భారత వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను కూడా అఫ్రిది కలిశాడు. ఈ నెల ప్రారంభంలో జింబాబ్వేలో జరిగిన 3మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రాహుల్ భారత్‌కు నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే.

దాంతో ఆ బాధ్యత భారత్ తరఫున భువీ లీడ్ చేయనుండగా.. పాక్ బౌలింగ్ ఎటాక్‌ను హరీస్ రౌఫ్ లీడ్ చేయనున్నాడు.

గాయంతో ఆసియాకప్ టోర్నీకి దూరమైన అఫ్రిది.. ట్రైనింగ్ సెషన్ వద్ద జట్టుతో పాటే ఉన్నాడు. అతను గాయంతో మోకాలి బ్రేస్ ధరించి కనిపించాడు. స్పీడీ రికవరీ కోసం అతనికి భారత స్టార్లు పరామర్శలు తెలిపారు.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఈ వీడియో షేర్ చేసింది. షాహీన్ అఫ్రిదిని కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్‌ పరామర్శించారు. సంభాషణ ముగింపులో పాకిస్థాన్ పేసర్ త్వరగా కోలుకోవాలని కోహ్లీ విష్ చేశాడు.

2022 ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌ల షెడ్యూల్

2022 ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌ల షెడ్యూల్