NewsOrbit
2022 Asia Cup Cricket

India vs Pakistan Asia Cup Prediction: ఆశలు వదులుకోవలసిందేనా? భారత్ vs పాకిస్థాన్… గెలవబోయేది ఎవరు?

India vs Pakistan Asia Cup 2022 Match Prediction in Telugu

Asia Cup 22 Match Prediction: భారత్ vs పాకిస్థాన్… గెలవబోయేది ఎవరు?

India vs Pakistan Asia Cup Prediction: ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2022 టీ20ఐ మ్యాచ్‌లు ఇవాళ్టితో మొదలయ్యాయి. ఈ టోర్నమెంట్‌లో భాగంగా ఆగస్టు 28న అంటే ఆదివారం నాడు దుబాయ్‌ వేదికగా భారత్, పాకిస్థాన్ పోటీ పడనున్నాయి. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్‌ అవుతున్నారు. అయితే గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ చేతిలో భారత జట్టు చిత్తుగా ఓడిపోయింది. దాంతో రేపు జరగనున్న మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందనేది మరింత సస్పెన్స్‌గా మారింది. కాగా ఆసియా కప్‌లో పాల్గొననున్న పాక్ టీమ్‌ను చూస్తుంటే భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువ అని తెలుస్తోంది.

భారత్ vs పాకిస్థాన్... గెలవబోయేది ఎవరు

పాక్ స్టార్ బౌలర్ మహ్మద్ వసీం జూనియర్‌కి పక్కటెముకల్లో గాయం కావడంతో ఆసియా కప్ 2022 టోర్నమెంట్‌కు దూరమయ్యాడు

cropped-Virat-Kohli-meets-Pakisthani-Virat Kohli meets Pakistan players ahead of India vs Pakistan Asia Cup 2022 matchplayers-ahead-of-2022-Asia-Cup-Cricket.png
Virat Kohli meets Pakistan players ahead of India vs Pakistan Asia Cup 2022 match

ఇటీవల పాక్ స్టార్ బౌలర్ మహ్మద్ వసీం జూనియర్‌కి పక్కటెముకల్లో గాయం కావడంతో ఆసియా కప్ 2022 టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. పాక్‌లో అత్యంత విలువైన ఫాస్ట్ బౌలర్ షహీన్ షా అఫ్రిది కూడా గాయం కారణంతో టోర్నమెంట్‌ నుంచి తప్పుకున్నాడు. వీరిద్దరూ తప్పుకోవడం వల్ల ఆ టీమ్ కాన్ఫిడెన్స్ చాలావరకు దెబ్బతింటుందని చెప్పవచ్చు. కాగా పాక్ టీమ్ మహ్మద్ వసీం స్థానంలో హసన్ అలీని తీసుకుంది. గతేడాది జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాప్‌ ఆర్డర్‌ను షహీన్ షా అఫ్రిది ఈజీగా బౌండరీ బాట పట్టించాడు. అలాంటి ప్లేయర్ ఇప్పుడు వైదొలగడం హిట్‌మ్యాన్‌ సేనకు కలిసొచ్చే అంశం.

శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఆసియా కప్‌లో ఆడడం లేదు

శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఆసియా కప్‌లో ఆడడం లేదు. ఇది కాస్త మైనస్సే అని చెప్పొచ్చు. విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఈసారి ఆడనున్నారు. వీరు పాక్ బౌలర్లను ఎదుర్కొంటే విజయం తథ్యమే!

టీమిండియా జట్టులో – రోహిత్ శర్మ (సి), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్.

Rishab Pant meets Pakistani Players ahead of India Vs Pakistan Match
Rishab Pant meets Pakistani Players ahead of India Vs Pakistan Match

ఆసియా కప్ మ్యాచ్‌లన్నీ దుబాయ్, షార్జాలో జరుగుతాయి. ఇప్పటివరకు టీ20ల్లో భారత్, పాకిస్థాన్ ఆడిన మ్యాచ్‌లు 9 కాగా భారత్ గెలిచింది 7

పాకిస్తాన్ జట్టులో – బాబర్ ఆజమ్ (కేప్టెన్), షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, ఫకర్ జమాన్, హైదర్ అలీ, హ్యారిస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, హసన్ అలీ, నసీమ్ షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్ ఉన్నారు.

ఆసియా కప్ మ్యాచ్‌లన్నీ దుబాయ్, షార్జాలో జరుగుతాయి. ఇప్పటివరకు టీ20ల్లో భారత్, పాకిస్థాన్ ఆడిన మ్యాచ్‌లు 9 కాగా భారత్ గెలిచింది, 7.. పాక్ నెగ్గింది కేవలం 02. ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ ఆడిన మ్యాచ్‌లు -14 అయితే 8 ఇండియా గెలిచింది, 5 పాక్ గెలిచింది

author avatar
Siva Prasad

Related posts

IND vs PAK: T20 వరల్డ్ కప్ టోర్నీలో నిన్న జరిగిన పాకిస్తాన్ -ఇండియా మ్యాచ్ సరికొత్త రికార్డు..!!

sekhar

T20 IND VS PAK: T20 వరల్డ్ కప్ టోర్నీలో ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ పై గెలిచిన భారత్, వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ..!!

sekhar

T20 World Cup: క్రికెట్ లవర్స్ కి అదిరిపోయే న్యూస్ సినిమా థియేటర్ లలో T20 వరల్డ్ కప్ మ్యాచ్ లు..!!

sekhar

దుబాయ్ లో జరిగిన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విజయ్ దేవరకొండ..!!

sekhar

Asia Cup 22 : షాహీన్ అఫ్రిదిని పరామర్శించిన కోహ్లీ, తొందరగా యుద్ధానికి సిద్ధం కమ్మని సలహా!

Deepak Rajula