33.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Share

Amaravati Clarity: ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశం ఇంకా ఎటూ తేలలేదు. తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. మంత్రులు అదే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. మేము రాజధాని కోసం భూములను త్యాగం చేశాము. అమరావతిలోనే రాజధాని ఉండాలని రైతులు అంటున్నారు. ఏపికి రాజధాని ఒకటే ఉండాలి. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాజధాని అభివృద్ధి పనులు చేయాలని హైకోర్టు ఇంతకు ముందే చెప్పింది. కానీ ప్రభుత్వం మాత్రం రేపటి నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు పెట్టి తీరతామని చెబుతోంది. మంత్రులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కోర్టు మాట ప్రభుత్వం వినడం లేదు. దీంతో ప్రజల్లో ఒక గందరగోళం, కన్ఫ్యూజన్ నెలకొంది. ప్రభుత్వం చేస్తున్నది కోర్టు దిక్కర అవుతుందా లేదా సందేహం సామాన్యుల్లో కలుగుతోంది. ఈ ఏడాది మార్చి 4న హైకోర్టు అమరావతికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా రైతులు మహాపాదయాత్ర ఎందుకు చేస్తున్నారు.. కోర్టు చెప్పిన తర్వాత కూడా అమరావతి రైతులు ఉద్యమాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని హైకోర్టు చెప్పినా ప్రభుత్వం మూడు రాజధానుల పాట ఎందుకు పాడుతోంది..కోర్టు చెప్పిన మాట ఎందుకు ప్రభుత్వం వినడం లేదు అన్న అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయి.

Amaravati Capital

Amaravati Clarity: మార్చి 4న ఏపి హైకోర్టు ఏమి చెప్పింది అంటే ..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాజధాని మార్చే అధికారం లేదు. ఆరు నెలల్లో అమరావతిలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. రాష్ట్ర అసెంబ్లీకి హైకోర్టును విభజించే అధికారం లేదని స్పష్టం చేసింది. రాజధానుల మార్పు విషయంలో అధికారం కేంద్రానికి ఉంటుందని, ఒక వేళ మార్పులు చేయాలని భావిస్తే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్ల పై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పును ఇచ్చింది. అయితే ఇంత స్పష్టంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు కొనసాగించడం, పాదయాత్రలు చేయడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని తీర్పు ఇచ్చిందే కానీ రైతులు ఆందోళన చేయవద్దు అని గానీ, పాదయాత్రలు చేయవద్దని కానీ తీర్పులో పేర్కొనలేదు. హైకోర్టు చెప్పినా కూడా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని ప్రభుత్వం చెబుతుండటంతో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. పాదయాత్ర చేస్తున్నారు. అమరావతికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన హైకోర్టే .. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పాదయాత్రకు ఎలా అనుమతి ఇస్తుంది. ఈ పిటిషన్ వేసిన సమయంలోనే తాము అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశించాము కదా ఇక పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించవచ్చు కదా అన్న లాజికల్ డౌట్ కూడా కొందరిలో ఉంది. అయితే రాజధాని పిటిషన్ వేరు. రైతులు దాఖలు చేసిన పిటిషన్ వేరు. పిటిషన్ల అధారంగానే ఇరుపక్షాల వాదోపవాదాలు విని హైకోర్టు ఆదేశాలు ఇస్తుంటుంది. ఆ నేపథ్యంలోనే రైతులు పాదయాత్ర కోసం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపి అనుమతి ఉత్తర్వులు ఇచ్చింది. అమరావతి రైతులు దాఖలు చేసిన రెండు పిటిషన్ లు లీగల్ (న్యాయపరం) గా సంబంధం లేదు కానీ లాజికల్ గా సంబంధం ఉంది.

AP CM YS Jagan

దిక్కరణ ఊసు రాకుండా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి..

అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. ఆరు నెలల్లో అమరావతిలో అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద నిధులు, వనరులు లేవనీ, అభివృద్ధి చేయడానికి రెండు మూడేళ్లు పడుతుందని ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇలా పలు మార్లు అఫిడవిట్ దాఖలు చేయడం వల్ల కోర్టు దిక్కరణ చర్యల నుండి తప్పుకుంటోంది ప్రభుత్వం. మూడు రాజధానులు చేస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలియజేయలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మరో సారి మూడు రాజధానుల బిల్లు ఎందుకు తీసుకువస్తుంది అంటే .. గతంలో 2019 లో శాసనసభలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లుకు శాసనసమండలిలో ఆమోదం పొందలేదు. శాసనసమండలి ఆ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపింది. ఆ తర్వాత ప్రభుత్వం 2020 మార్చి నెలలో మరో సారి అసెంబ్లీ లో వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తేలిపి శాసనసమండలితో సంబంధం లేకుండా గవర్నర్ కు పంపి ఆమోదంతో చట్టం చేసింది. అయితే మండలితో సంబంధం లేకుండా నేరుగా గవర్నర్ ద్వారా ఆమోదం పొందటం చట్టం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. దీంతో హైకోర్టులో దీనిపై వ్యతిరేక తీర్పు వస్తుందన్న భావనతో ముందుగానే ఆ బిల్లును ఉపసంహరించుకుంది. సీఆర్డీఏను కొనసాగిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఆ బిల్లు ఉపసంహరించుకుంటున్న సందర్భంలోనే న్యాయపరమైన చిక్కులు రాకుండా పకడ్బంది (చట్టబద్దంగా) మూడు రాజధానుల బిల్లు తీసుకువస్తామని తెలిపింది. గతంలో తీసుకువచ్చిన బిల్లుకు చట్టబద్దత లేదు కాబట్టి ఇప్పుడు తాజాగా చట్టబద్దంగా తీసుకురావాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పుడు శాసనమండలిలోనూ వైసీపీకి బలం ఉంది కాబట్టి ఉభయ సభల్లో వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదింపజేసుకుని చట్టం చేస్తుంది. ఇలా ప్రొసీజర్ ప్రకారం బిల్లు ఆమోదించి ప్రభుత్వం చట్టం చేస్తే కోర్టులు కూడా వాటిపై జోక్యం చేసుకునే అవకాశం ఉండదు.

Read More: రాష్ట్ర విభజన సమస్యలపై 27న కీలక భేటీ .. కేంద్ర హోంశాఖ రూపొందిన అజండా ఇది.. ట్విస్ట్ ఏమిటంటే..?

Amaravati Farmers Maha Padayatra

 


Share

Related posts

టీ కాంగ్రెస్ నేతల భేటీలో షర్మిల పార్టీపై చర్చ.. ఎందుకంటే..?

somaraju sharma

Theepeti Ganeshan : ప్రముఖ కమెడియన్ మృతి..

bharani jella

Madhya Pradesh: వరద బాధితులను కాపాడేందుకు వెళ్లి..

somaraju sharma