NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ – షా టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో ఇటీవల భేటీ అయి రెండు రోజులు గడిచిపోయింది. అయినా సరే ఆ ఉత్కంఠ, వారి మధ్య జరిగిన అంతర్గత వ్యవహాారాలపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఎవరికి తోచినట్లు వారు చెబుతున్నారు. అమిత్ షా .. జూనియర్ ఎన్టీఆర్ ను ఎందుకు కలిశారు..? జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన ఎందుకు ఆహ్వానించారు..? ఆయనను కలవడానికి ముందే రామోజీ రావును ఎందుకు కలిశారు..? అసలు అమిత్ షా, బీజేపీ వ్యూహం ఏమిటి..? దీన్ని వైసీపీ వైపు నుండి ఒకలా.. విశ్లేషించుకుంటుంటే , టీడీపీ మరో లా విశ్లేషించుకుంటోంది. ఎవరికి తోచినట్లు వారు చెబుతున్నారు. ఏదైనా నాలుగు గోడల మధ్య ఇద్దరి మధ్య జరిగిన వ్యవహారం బయటి కాదు. అయితే చుట్టూ ఉన్న పరిణామాలు, పరిస్థితులు చూసుకుని ఎవరికి తోచినట్లు వారు చెప్పడమే. ఏయే కోణంలో చర్చ జరిగే అవకాశం ఉంది ..? అనేది ఇంతకు ముందే “న్యూస్ ఆర్బిట్” ఓ ప్రత్యేక కథనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా వస్తున్న వాదనలు ఏమిటంటే..?

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

తెర వెనుక జగన్ స్కెచ్..?

ఆయా పార్టీల కోణం నుండి ఆలోచిస్తే.. వైసీపీ నేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డే ఈ భేటీ ని ఏర్పాటు చేయించారు, దీని వెనుక జగన్ స్కెచ్ ఉందని  కొందరు చెబుతుంటే,  లేదు వేరే బిగ్ ప్లాన్ ఒకటి ఉందని, దీని వెనుక కమ్యునిటీ స్కెచ్ ఉందని మరి కొందరు అంటున్నారు. ఇందులో ఏది నిజం..? అసలు వారు ఎమి అనుకుంటున్నారు.. ? వారి ఊహాగానాలు ఏమిటి ..? అనేది పరిశీలిస్తే.. జగన్మోహనరెడ్డి ఈ భేటీని ఎందుకు ఏర్పాటు చేయించారు అంటే ..జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు అంటే గిట్టడం లేదు. టీడీపీ అంటే ఆయనకు అభిమానం ఉంది. టీడీపీ వాళ్లలో ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన అభిమానులు టీడీపీలో ఉన్నారు. ఆయనకు చంద్రబాబుకు, లోకేష్ కు మధ్య మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబును సీఎం చేస్తే మళ్లీ లోకేషే రాజకీయంగా వారసుడిగా పాతుకుపోతాడు కాబట్టి ఎన్టీఆర్ కు కీలకమైన పాత్ర కావాలంటే చంద్రబాబు హవా తగ్గాలి కాబట్టి జగన్మోహనరెడ్డి టీడీపీని మళ్లీ ఓడించడానికి బీజేపీతో చేతులు కలిపి జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీకి వ్యతిరేకంగా పని చేయమని అమిత్ షాను పంపించారు అన్నట్లుగా వైసీపీ వైపు నుండి ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నాని సన్నిహితం కావడంతో ఆయనతో చెప్పి పంపించారు అన్నట్లు గా వైసీపీలోని కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీకి దూరం అవుతున్నారు, టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుంది. ఇది బీజేపీకి ఇష్టం లేదు కాబట్టి ఎన్టీఆర్ ను టీడీపీకి దూరం చేసి అవసరమైతే పరోక్షంగా ఉపయోగించుకోవాలని బీజేపీ చూస్తుంది అని వైసీపీ వాళ్లు ప్రచారం చేస్తున్నారు. ఇది నమ్మశక్యంగా లేదు, వాస్తవం కాదు అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.

కమ్యూనిటీ కోణం ఎలా అంటే..?

కొంత మంది దీనిలో కమ్యూనిటీ కోణం ఉంది అని అంటున్నారు. ఏపిలో ఎక్కడా ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆ కమ్యూనిటీని దూషించడం ఎక్కువ అవుతోంది. మాట్లాడితే ఆ కమ్యూనిటీ మీద పడుతున్నారు. కాబట్టే సినీ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ (బీజేపీ రాజ్యసభ సభ్యుడు) ఈ భేటీ ఏర్పాటు చేశారు అనేది మరో వాదన. రామోజీరావు ఆ కమ్యూనిటీకి పెద్ద. ఎన్టీఆర్ ఆ కమ్యూనిటీకి ఐకాన్. సో.. బీజేపీ సహకారంతో మళ్లీ టీడీపీని ఏపి గద్దె నెక్కిస్తే ఆ కమ్యూనిటీ పెత్తనం ఉంటే ఈ అనవసరమైన కేసులు, ఇబ్బందులు రాకుండా ఉంటాయి అన్న అభిప్రాయం వారిలో ఉంది. బీజేపీ తెలంగాణలో టీడీపీ సపోర్టు తీసుకుని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీకి సపోర్టు ఇవ్వాలి, వైసీపీకి వ్యతిరేకంగా పని చేయాలని కమ్యూనిటీ పెద్దలు నిర్ణయించారని దానిలో భాగంగా అమిత్ షాను రామోజీరావు కలిసి ఈ అంశంపై చర్చించారనీ, అందుకే పని లో పని గా ఎన్టీఆర్ కు రాజకీయ భవిష్యత్తు ఉంది కాబట్టి, సౌత్ ఇండియాలో మంచి పేరు ఉంది కాబట్టి, మరో పక్క ఎన్టీఆర్ తల్లి బ్రాహ్మణ సామాజికవర్గం కు చెందిన మహిళ కాబట్టి బీజేపీకి ఎంతో కొంత దగ్గర అయితే ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలంగాణలో ఉపయోగపడుతుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఏమైనా ఉపయోగపడుతుందన్న భావనతో బీజేపీ ఎన్టీఆర్ ను వాడుకోవాలని చూస్తుందేమో అన్న చర్చ కూడా ఉంది. తాజాగా కమ్యూనిటీ యాంగిల్ కూడా బయటకు వచ్చింది. అయితే ఈ వాదనను, ప్రచారాన్ని కొట్టి పారేయడానికి వీలు లేదు. మరో పక్క దివంగత సీనియర్ ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వడానికి బీజేపీ రెడీ అవుతుంది తద్వారా ఎన్టీఆర్ ఫ్యామిలీని దగ్గర చేసుకుని తెరవెనుక కొన్ని ప్లాన్లు సిద్దం చేసుకుంది ద్వారా టీడీపీలో ఒక వర్గాన్ని బీజేపీకి దగ్గర చేసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ పాతుకుపోవచ్చు అని అనుకుంటుంది అని మరో ప్రచారం జరుగుతోంది. ఇలా జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా కలవడంలో ఇన్ని ప్లాన్స్ ఉన్నట్లుగా ఎవరికి తోచినట్లు వారు చెబుతున్నారు. ఈ ప్రచారాల్లో ఏది నిజం అనేది వారి ఇద్దరికే (అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్) తెలియాలి.

Related posts

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?