NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈ ఆరడుగుల అందాన్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఫరియా.. థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్‌ ప్రారంభించింది. 2021లో జాతి రత్నాలు మూవీతో హీరోయిన్ గా వెండితెరపై అడుగు పెట్టింది. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి కి జోడిగా చిట్టి పాత్రలో నటించి మెప్పించింది. తొలి సినిమాతోనే బిగ్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. కానీ ఫ‌రియా అబ్దుల్లాకు అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఇందుకు కారణం ఆమె హైటే. ఫరియా ఎత్తు ఆరడుగులు ఉండడం వల్ల టాలీవుడ్ హీరోలు ఆమెను మ్యాచ్ చేయలేకపోతున్నారు.

హైట్ కార‌ణంగా ఎంతో టాలెంట్ ఉన్నా కూడా ఫ‌రియాకు అడపా తడపా అవకాశాలే వస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఫ‌రియా అబ్దుల్లా నిరాశ చెంద‌కుండా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హాట్ ఫోటోషూట్స్‌, డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ భారీ క్రేజ్ సంపాదించుకుంటోంది. ఇటీవ‌ల బెల్లీ డ్యాన్స్ తో సోష‌ల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేసి ప‌డేసింది. ఇక‌పోతే చాలా రోజులకు ఫరియా ఆ ఒక్కటి అడక్కు మూవీ లో హీరోయిన్ గా సైన్ చేసింది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి మల్లి అంకం దర్శకత్వం వహించారు. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, జామీ లివర్, హర్ష చెముడు త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. గోపీ సుందర్ స్వ‌రాలు అందించాడు.

చిలక ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ పై రాజీవ్ చిలక నిర్మించిన ఆ ఒక్కటి అడక్కు సినిమా మే 3న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ ద్వారా సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ అంచ‌నాల‌ను మరింత పెంచేందుకు మ‌రియు సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫ‌రియా అబ్దుల్లా.. సినిమా గురించి అనేక విష‌యాలు పంచుకుంది. అలాగే ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి కూడా కొన్ని విశేషాలు పంచుకుంది.

పెళ్లి ప్ర‌స్తావ‌న రాగా.. ఫ‌రియా భ‌విష్య‌త్తులో తనకు ఎలాంటి వ్య‌క్తి భ‌ర్త‌గా రావాలో చెప్పేసింది. నాకు కాబోయే భర్త నాకంటే హైట్ తక్కువగా ఉన్నా పర్లేదు. కానీ అతడికి మంచి సెన్సాఫ్ హ్యుమర్ ఉండాల‌ని ఫ‌రియా అబ్దుల్లా తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు లైఫ్ లో ఎన్నో భాద‌లు అనుభ‌వించాను. కాబ‌ట్టి నాకు రాబోయే భ‌ర్త అయినా ఫ‌న్ గా ఉంటే నా లైఫ్ సంతోషంగా ఉంటుంది. అందుకే హాస్య చతురత ఎక్కువగా ఉండే అబ్బాయిని భ‌ర్త‌గా కోరుకుంటున్నాన‌ని ఫ‌రియా పేర్కొంది. దీంతో ఫ‌రియా అబ్దుల్లా కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి. నెటిజ‌న్లు ఫ‌రియా కామెంట్స్ పై ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.

కాగా, ఆ ఒక్క‌టి అడ‌క్కు సినిమాపై ఫ‌రియా ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. ఈ సినిమా మంచి విజ‌యం సాధిస్తే తెలుగులో మ‌రికొన్ని సినిమాలు వచ్చే అవ‌కాశాలు పెరుగుతాయి. ఈ కార‌ణంగానే ఆ ఒక్క‌టి అడ‌క్కు మూవీ మంచి విజ‌యం సాధించాల‌ని ఫ‌రియా ఆశ ప‌డుతోంది. మ‌రి ఆమె ఆశ నెర‌వేరుతుందా.. లేదా.. అన్న‌ది తెలియాలంటే మే 3 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

Related posts

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju