NewsOrbit
Entertainment News Telugu TV Serials న్యూస్

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

Brahmamudi May 08 Episode 404

BrahmaMudi:కావ్య రాజ్ బిడ్డ రహస్యం తెలుసుకొని, ఆ నిజాన్ని ఇంట్లో చెప్పాలనుకుంటుంది కానీ ఆ నిజం తెలిసిన తర్వాత ఎవరికీ చెప్పాలో తెలియక సతమతమవుతుంది.రాజ్ దగ్గర పెరుగుతున్న బిడ్డ, రాజ్ సొంత బిడ్డ కాదని తెలుసుకొని, తన మామగారు తప్పు చేశారని తెలుసుకొని, దేవుని ఎదుట వచ్చి బాధపడుతుంది. ఇప్పుడు మా ఆయన మీద నేను పెట్టుకున్న నమ్మకం గెలిచిందని సంతోషపడాలా ఈ ఇంటి వ్యక్తి తప్పు చేశాడని బాధపడాలి ఈ నిజం నాకు తెలిసి కూడా బయట పెట్టలేని పరిస్థితి నాకు కల్పించావు కృష్ణ అని దేవుని ఎదుట వచ్చి బాధపడుతుంది. ఈ నిజాన్ని నాలోనే దాచుకునే పరిస్థితి వచ్చింది. నిజం చెప్పి మా అత్తయ్య గారు మనసు బాధ పెట్టలేదు ఆవిడ నిజం ఎప్పటికీ నాలోనే ఉంచుకోలేను రేపటితో మా ఆయనకు ఇచ్చిన గడువు తీరిపోతుంది ఏదో ఒక పరిష్కారం నువ్వే చూపాలి ఈ సమస్య నువ్వే తీర్చేలా ఒక సహాయం చెయ్యి అని వేడుకుంటుంది.

Brahmamudi May 08 Episode 404
Brahmamudi May 08 Episode 404

కావ్య,అప్పుతో మాట్లాడుతూ ఉంటుంది. అక్క ఇప్పుడు నిజం తెలిసి కూడా సైలెంట్ గా ఉంటే ఎలాగు బావ గారు తప్పు చేయకుండా అంత పెద్ద నింద మోస్తుంటే మీ మామగారు తప్పు చేశారని తెలిసి కూడా నువ్వు బయట పెట్టకపోతే ఎలాగో అని అంటుంది అప్పు. నిజం చెప్పి మా అత్తగారిని బాధ పెట్టమని చెప్తున్నావా అని అంటుంది నిజాన్ని ఎన్ని రోజులు దాచిపెడతావు అని అంటుంది.అప్పుడు కోపంతో మాట్లాడుతుంటే కావ్య మాత్రం నీకు మీ బావ నీ బయట పెట్టాలని ఆలోచిస్తున్నావు కానీ నేను మా ఇంటి పరువుని రోడ్డు మీదకు రాకుండా మా అత్తగారి బాధ లేకుండా చూడాలనుకుంటున్నాను అని అంటుంది. ఇది నిజం బయటపడితే మా అత్తగారు ప్రాణాలతో ఉండలేదు అని చెప్తుంది నిజం తెలిసి కూడా మా ఆయన మౌనంగా ఉన్నాడంటే నేను అర్థం చేసుకోవాలి కదా అని అంటుంది కొన్ని తప్పుడు ఎప్పటికీ సరి చేయలేము అని అంటుంది జీవితాంతం వాటిని మోస్తావా అని అంటుంది మొయ్యాల్సిందే అని అంటుంది కావ్య. నీకు అవకాశం వచ్చినా కూడా నిజం చెప్పకపోతే రేపు ఆ బిడ్డ తల్లి వచ్చి నిజం చెప్పదని ఎలా అనుకుంటున్నావు అక్క అని అడుగుతుంది. ఆ బిడ్డ తల్లి నిజం చెప్పకుండా నేనే రేపొద్దున ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను అని అంటుంది. ఆ నిర్ణయం ఏంటో నాకు చెప్పు అక్క అని అంటుంది అదేంటో చెప్తే నువ్వు గొడవ చేస్తావు ఇప్పుడు చెప్పను అని అంటుంది. నువ్వు తప్పు చేసిన నీకు నేను తోడుగానే ఉంటాను అక్క అని మాట ఇస్తుంది. ఈ పెన్ డ్రైవ్ నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు అని అంటుంది ఎప్పటికైనా ఈ పెన్ డ్రైవ్ ఉంటే మనం సాక్షాన్ని అందరికీ చూపించొచ్చు అని అంటుంది కానీ మాత్రం ఆలోచించి ఈ సాక్ష్యం ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అని రాయితో సాక్షాన్ని పెన్ డ్రైవ్ పగలగొడుతుంది. అది చూసి అప్పు అదేంటక్క ఉన్న ఒక్క సాక్షాన్ని ఇలా చేస్తే ఎలాగో అని అంటుంది. ఒక మనిషికి ద్రోహం చేసి మరోమనిషి ప్రాణం తీసే సాక్ష్యం నాకు అవసరం లేదు అప్పు అని అంటుంది కావ్య.

Brahmamudi May 08 Episode 404
Brahmamudi May 08 Episode 404

ఇక మరోవైపు అపర్ణ ఆలోచిస్తూ ఉంటుంది తెల్లవారితే రాజ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి. ఏం చేయాలో అర్థం కాక బాగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే రాహుల్ రుద్రణి ఇద్దరు అపర్ణని పైనుంచి చూస్తారు. ఏంటి మమ్మీ అత్త అంత బాగా ఆలోచిస్తుంది రాజ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి కదా దాని గురించి ఆలోచిస్తుంది అని అంటుంది రుద్రాణి. ఒకవేళ రాజు నిజం చెప్తాడు ఏమో అని అంటాడు రాహుల్. రాజ్ నిజం చెప్పేవాడు అయితే ఎప్పుడో చెప్పేవాడు అని అంటుంది రుద్రాణి అయితే కొడుకు కోసం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందేమో అపర్ణ అని అంటాడు. అలా చేస్తే మనం ఉన్నాం కదా ఎలాగైనా రాజుని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను అని అంటుంది. నేను ఒక్కదాని కోసం ఆలోచిస్తే విలన్ అవుతాను ఇంట్లో వాళ్ళందరి కోసం ఆలోచిస్తే వాళ్ళ దృష్టిలో నేను విలన్ కాదులే అని అంటుంది.ఇక మరోవైపు ప్రకాశం ఆఫీస్ కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు ధాన్య లక్ష్మీ వచ్చి ఎందుకు ఆఫీసుకు వెళ్లలేదు అంటే ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే ఆఫీస్ కి ఎలా వెళ్తాను అంటే ఎప్పుడు ఉండే పరిస్థితులే కదా అని అంటుంది అంటే రాజ్ ఇంట్లో నుంచి రేపు వెళ్ళిపోవాలిసిన అది కూడా నీకు చాలా తేలిగ్గా ఉందా అని అంటాడు అవును తప్పు చేశాడు కాబట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడు అని అంటుంది దానికి ప్రకాశం ధాన్యం మీద కోప్పడతాడు మీకు అంతగా ఆవేశం ఉంటే వెళ్లి మీ వదిన దగ్గర రాజ్ ఇంట్లో నుంచి బయటికి పంపించద్దని చెప్పండి లేదంటే రాజు దగ్గరికి వెళ్లి నిజం చెప్పమని అడగండి. అంతేకానీ ఆఫీస్ కి వెళ్ళకుండా ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏమి కాదు అని అంటుంది రేపు నీ కొడుకు కూడా తప్పు చేస్తే ఇలానే మాట్లాడతావా అని అంటుంది నా కొడుకు ఇలాంటి తప్పు ఏం చేయదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది

Brahmamudi May 08 Episode 404
Brahmamudi May 08 Episode 404

ఇక మరోవైపు, సేటు రుద్రానికి ఫోన్ చేస్తాడు ఈ సైట్ కి ఏమి పని ఉండదు ఫోన్ చేస్తూనే ఉంటాడు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుందినా డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారు అని అడుగుతాడు డబ్బులు ఉంటే కదా ఇవ్వడానికి అని అంటుంది ఇదేంటి కొత్తగా డ్రామాలు మొదలు పెడుతున్నారు డబ్బు ఉంచుకొని కూడా లేదని అబద్ధం చెప్తున్నారా నేనే కదా మీకుఇచ్చింది ఇప్పుడు అవి లేవంటే ఎలా కుదురుతుంది నా డబ్బులు నాకు రెండు రోజులు ఇవ్వకపోతే మీ అబ్బాయి వచ్చి నాకు ఆస్తి పేపర్లు ఇచ్చారు అన్న విషయాన్ని ఇంట్లో అందరి ముందు చెప్తానని బెదిరిస్తాడు సేటు దాంతో రుద్రాణి నాకు కొంచెం టైం కావాలి అని అంటుంది. మీ డబ్బులు మీకు ఇస్తాను అని అంటుంది అదంతా స్వప్న కూడా వింటుంది. కోటి రూపాయలు అంటే సామాన్యం కాదు తీసుకురావాలి కదా అని అంటుంది. మీరేం చేస్తారో నాకు తెలియదు నా డబ్బులు నాకు ఇవ్వండి అని సేటు ఫోన్ పెట్టేస్తాడు. అదంతా విన్న స్వప్న ఏంట అత్తయ్య కోటి రూపాయలు డబ్బులు పోయావా ఈ విషయం ఇంట్లో చెబుదాం పదండి వాళ్లే ఏదో ఒక పరిష్కారం చెప్తారు అని అంటుంది ఒకవేళ లేదంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇద్దాము అని అంటుంది ఏం అవసరం లేదు అని అంటుంది రుద్రాణి. కోటి రూపాయలు నువ్వే కాల్ చేసి ఇవాళ నా ముందుకు వచ్చి నాటకాలు ఆడుతున్నావా అని మనసులో అనుకుంటుంది రుద్రాణి. ఆడపిల్లగా నేనే సర్దుబాటు చేసుకుంటాను లే అని అంటుంది దాని గురించి ఇంట్లో ఎవరికైనా చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది రుద్రాణి. డబ్బు గురించి మీరు వదిలేసిన నేను వదలను కదా అని అంటుంది స్వప్న.

Brahmamudi May 08 Episode 404
Brahmamudi May 08 Episode 404

ఇక మరోవైపు రాజ్ బిడ్డని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాడు. అప్పుడే కావ్య లోపలికి వచ్చి రాజ్ ని చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావ్ అని అడుగుతాడు. నేను చూస్తుంది మా అయన నే కదా ఏమైంది ఇప్పుడు అని అంటుంది. రాజ్ గతంలో ఆఫీస్ నుంచి దూరం అవడం, తండ్రికి ఇచ్చిన మాట కోసం రాజ్ అవమానాలు భరించడం గుర్తుకు వచ్చి, తన భర్తను చూసుకొని మురిసిపోతుంది కావ్య. ఏంటి మళ్లీ అలానే చూస్తున్నావ్ అని అడుగుతాడు ఏం లేదు నాకు ఒక డౌట్ అని అడుగుతుంది ఏంటో చెప్పు అంటాడు. నీకంటే మీ అమ్మ పోలికలు మరి అబ్బాయికి ఏంటి మీ నాన్న పోలికలు వచ్చాయి అని అంటుంది. దాంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతాడు. అదేనండి తాతగారి పోలికలు వచ్చాయి అని అంటుంది. అయినా నాకు మిమ్మల్ని చూస్తుంటే భలే ఆశ్చర్యంగా ఉంటుందండి. ఆ బిడ్డ తల్లికి ఏమని మాటిచ్చారో కానీ ఇంట్లో ఇన్ని గొడవలు అవుతున్న మీరు మాత్రం మాట మీద నిలబడుతున్న తీరు చూస్తుంటే నాకు భలే ముచ్చటేస్తుంది అని అంటుంది. నాక్కూడా అలానే ఉంది నీ ప్లేస్ లో అనామిక కానీ, స్వప్న గాని ఉన్నట్టయితే పోలీస్ స్టేషన్లో మా అందరిని కూర్చోబెట్టేవాళ్ళు కానీ నువ్వు మాత్రం సైలెంట్ గా ఉన్నావు ఎందుకు అర్థం కావట్లేదు అని అంటాడు నేను నా మనస్సాక్షి నమ్ముతాను అని అంటుంది. మీరు మాత్రం రేపు ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని తెలిసినా ఇంత నిర్భయంగా అలా తిరుగుతున్నారో అర్థం కావట్లేదు నాకు రేపు ఉదయం ఏం జరుగుతుందో అని టెన్షన్ గా ఉంది అని అంటుంది. జరగాల్సిందే జరుగుతుంది అని అంటాడు రాజ్ కాసేపు నేను బాబును తీసుకుంటావా అని అంటాడు. బాబుని చూసుకోమంటున్నారా పెంచుకోమంటున్నారా అని అడుగుతుంది అదేంటి అని అంటారు ఏం లేదులెండి బాబుని ఇచ్చి మీరు వెళ్ళండి అని అంటుంది. రాజ్ బాబును కావ్యకి ఇచ్చి బయటికి వెళ్తాడు.

Brahmamudi May 08 Episode 404
Brahmamudi May 08 Episode 404

ఇక మరోవైపు అపర్ణ రాజ్ బయటకు వెళ్తుంటే ఆపుతుంది ఇంటికి వస్తావా అటు నుంచి అటే వెళ్తావా అని అంటుంది. అదేంటి ఎలా మాట్లాడుతావు అని ఇందిరా దేవి అంటుంది అవును అత్తయ్య రేపటితో వాడికి ఇచ్చిన గడువు తీరిపోతుంది రేపు సమాధానం చెప్పలేక ఈరోజు వెళ్ళిపోతున్నాడేమోనని అంటుంది. నువ్వు ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉన్నాను మమ్మీ అని అంటాడు. అలాంటప్పుడు నిజం చెప్పొచ్చు కదా నేను అడుగుతున్న నిజం మాత్రం చెప్పవు. ఆ బిడ్డ గురించి నిజం చెప్తే ఎవరికి ఏ సమస్య ఉండదు కదా అని అంటుంది కానీ రాజ్ సైలెంట్ గా ఉంటాడు. ఇక ఇందిరా దేవి నువ్వు నిర్ణయాన్ని మార్చుకోవా అని అంటుంది వాడు నిర్ణయం మార్చుకున్నప్పుడు నేను ఎందుకు మార్చుకోవాలి అత్తయ్య నేను నా నిర్ణయాన్ని మార్చుకోవట్లేదు అని అంటుంది. నిజం చెప్పురా నువ్వు ఏ బలహీన క్షణాల్లో తప్పు చేశావుఇటువంటి బలమైన పరిస్థితి నిన్ను ఆపుతుందో నిజం చెప్పు అని రుద్రాణి అంటుంది. ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Brahmamudi May 08 Episode 404
Brahmamudi May 08 Episode 404

రేపటి ఎపిసోడ్ లో, సుభాష్ అపర్ణని నీ నిర్ణయం మార్చుకోవచ్చు కదా అని అడుగుతాడు. దానికి అపర్ణ వాడు రేపు ఉదయం లోగా ఏం జరిగిందో ఏం జరగాల్సి వచ్చిందో నిజాన్ని బయట పెట్టాలి ఒకవేళ బిడ్డ విషయంలో రాజ్ నిజం బయట పెట్టకపోతే నేనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని అపర్ణ అంటుంది ఆ మాటకి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. రేపు ఉదయం కల్లా వాడు నిజం బయట పెడితే సరే లేదంటే తెల్లవారేసరికి నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఇదే నా నిర్ణయం అని అంటుంది. అపర్ణ మాటలకు కావ్య ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతుంది

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N