NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

Telangana Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో అభ్యర్ధుల ఎంపికపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారాన్ని కైవశం చేసుకున్న కాంగ్రెస్ .. ఈ సారి ఎలాగైనా అత్యధిక లోక్ సభ స్థానాలూ కైవశం చేసుకుని తమ సత్తా నిరూపించుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం పూర్తి స్థాయి కసరత్తు చేస్తూ గెలుపు గుర్రాలను అభ్యర్ధులుగా ఎంపిక చేస్తొంది.

Gandhi Bhavan

మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గానూ ఇప్పటికే పలు విడతలుగా 14 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్.. మూడు స్థానాలను పెండింగ్ లో పెట్టింది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం ఎంపీ టికెట్ల విషయమై పార్టీ లో తీవ్ర పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఊపును కొనసాగించాలని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి ..చేరికలపై దృష్టి పెట్టారు. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీలోని పలువురు కీలక నేతలను పార్టీలోకి చేర్చుకుని లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులుగానూ ఎంపిక చేశారు.

Telangana Congress

పెండింగ్ లో ఉన్న మూడు లోక్ సభ స్థానాలకు అభ్యర్ధుల ఎంపికపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నారు. రేపు (శుక్రవారం) కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో లోక్ సభ అభ్యర్దులకు సంబంధించి ఎంపిక ప్రక్రియ ఉండనుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఎంపీ టికెట్ల పై చర్చించి ఖరారు చేయనున్నారు. ఈ వేళ సీఎం రేవంత్ రెడ్డి మరో మారు ఢిల్లీ వెళుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Revanth Reddy

ఇదిలా ఉండగా..అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ స్వీప్ చేసింది. ఒక్క భద్రచాలం అసెంబ్లీ స్థానం మినహా తొమ్మిది అసెంబ్లీ సిగ్మెంట్ లలో కాంగ్రెస్ అభ్యర్ధులే గెలిచారు. తాజాగా భద్రాచలం నుండి గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. ఖమ్మం లోక్ సభ స్థానం కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకోవడం ఖాయమన్న మాట స్పష్టంగా వినబడుతోంది. ఇక్కడ ముగ్గురు మంత్రుల తాలూకు కుటుంబ సభ్యులు అభ్యర్ధిత్వం కోసం పోటీ పడుతుండటంతో అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది.

ఖమ్మం ఎంపీ టిక్కెట్ ను డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ లు ఆశిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముగ్గురు మంత్రులలో టిక్కెట్ దక్కించుకునేది ఎవరు అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తొంది. మరో పక్క ముగ్గురు మంత్రుల కుటుంబాలను కాదని కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉందనే చర్చ కూడా నడుస్తొంది. మంత్రుల కుటుంబాలకు చెందిన వారు కాకుండా ఖమ్మం టిక్కెట్ రేసులో రాయల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, కుసుమ కుమార్ ఉన్నట్లుగా తెలుస్తొంది.

ఇక, కరీంనగర్ ఎంపీ టిక్కెట్ కోసం ప్రవీణ్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పొన్నం ప్రభాకర్ కోసం హుస్నాబాద్ టిక్కెట్ ను త్యాగం చేసిన సమయంలో పార్టీ హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో తనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరో పక్క కరీంనగర్ టిక్కెట్ రేసులో వెలిచాల రాజేంద్ర రావు, తీన్మార్ మల్లన్న కూడా ఉన్నారు. అయితే ఈ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో వెలమ సామాజిక వర్గానికి పట్టు ఉన్న కారణంగా ఈ సామాజికవర్గ నేతకు టిక్కెట్ ఖరారు చేయాలన్న డిమాండ్ ప్రముఖంగా వినబడుతోంది.

మరో వైపు హైదరాబాద్ ఎంపీ స్థానం విషయంలోనూ స్పష్టత రాలేదు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఎంపీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా సానియా మీర్జా పోటీ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ దీనిపై పార్టీ నేతలు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో ఇక్కడ కూడా ఎవరు బరిలో నిలుస్తారు అనేది వేచి చూడాలి.

Chandrababu: జగన్ అధికారాన్ని దించేందుకు మూడు పార్టీల కలయిక – చంద్రబాబు

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?