NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

PM Modi: గతంలో బీఆర్ఎస్ ఎలా అవినీతికి పాల్పడి తెలంగాణను దోచుకుందో .. ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తొందని ప్రధాని మోడీ విమర్శించారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో మెదక్ జిల్లా అల్లాదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో.. పదేళ్లలో దేశం ఎంతగా అభివృద్ధి చెందిందో అందరూ చూశారన్నారు.

కాంగ్రెస్ ఎప్పుడూ అబద్దాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు, అవినీతి చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట పంచ సూత్రాలతో పాలన చేస్తుందని, ఆ పంచ సూత్రాలు.. అవినీతి, అబద్దాలు, మాఫియా, కుటుంబ పాలన, ఓటు బ్యాంకు రాజకీయాలు అని వివరించారు. దేశంలో మళ్లీ పాత రోజులు తీసుకురావాలని ఆ పార్టీ చూస్తొందన్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి మీ అందరికీ తెలుసునని, ఈ రోజు తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందన్నారు. వ్యాపారులు, గుత్తేదార్లు దొడ్డి దారిలో ఈ ట్యాక్స్ కడుతున్నారని అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల ప్రపంచమంతా గర్వపడితే.. డబుల్ ఆర్ ట్యాక్స్ తో దేశం సిగ్గుపడుతోందని అన్నారు. పారిశ్రామిక వేత్తల నుండి వసూలు చేస్తున్న ఆర్ఆర్ ట్యాక్స్ తో ఢిల్లీకి కప్పం కడుతున్నారని విమర్శించారు. అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు.

పొరపాటున కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన వారసత్వ సంపద నుంచి కొత్త ట్యాక్స్ వసూలు చేస్తామంటున్నారని అన్నారు. తల్లిదండ్రులు సంపాదించిన దాంట్లో నుండి 55 శాతం ఆస్తి మన పిల్లలకు దక్కకుండా కాజేసేందుకు కుట్రలు పన్నుతోందన్నారు. ఇలాంటి భయానక నిర్ణయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

కాళేశ్వరం అతి పెద్ద కుంభకోణమని, ఆ ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ దోచుకుందని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఆరోపించి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీని కాపాడేందుకు ప్రయత్నిస్తొందని అన్నారు. అవినీతిలో ఈ రెండు పార్టీలు ఒక్కటేనని మోడీ విమర్శించారు.

తెలంగాణలో వంద రోజుల్లో రుణ మాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ రైతులను మోసం చేందన్నారు. వరికి క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తామన్న ఆ పార్టీ హామీ నెరవేరలేదన్నారు. పేదలు ఎప్పటికీ పేదలుగానే ఉండాలని కాంగ్రెస్ చూస్తొందన్నారు. హైదరాబాద్ లో పండుగలు జరుపుకోవాలంటే ఎన్నో ఆంక్షలు పెడతారన్నారు. ఓ వర్గం వారి ఓట్ల కోసం మిగతావారిని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.

తెలంగాణను మొన్నటి వరకూ బీఆర్ఎస్ దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని విమర్శించారు. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు తావులేదని అన్నారు. 26 బీసీ కులాలను కేంద్ర జాబితాలో చేర్చకుండా రాత్రికి రాత్రి ముస్లింలను ఓబీసీ జాబితాలో కాంగ్రెస్ చేర్చిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు తాను అనుకూలమని స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు పాటు పడింది బీజేపీయేనని మోడీ అన్నారు.

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

Related posts

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N