MP Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోలపై తీవ్ర దుమారం రేగడంతో ..ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పై వేటు పడింది. హాసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో జేడీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ప్రజ్వల్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
అలాగే ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో బీజేపీతో జేడీఎస్ పోత్తులో ఉండటంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తొంది. ఇదిలా ఉంటే ఈ పరిణామానికి ప్రజ్వల్ బాబాయ్, మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ వివాదం వెనుక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హస్తం ఉందని అరోపించారు. వెంటనే ఆయన్ను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఆ వీడియోల్లో ప్రజ్వల్ ముఖం కనిపిస్తొందా.. అవి అతడివేనన్న ఆధారం ఏమిటి అంటూ ప్రశ్నిస్తూనే .. అయినా సరే నైతికత ఆధారంగా చర్యలు ఉంటాయని అన్నారు. ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేస్తొందని అన్నారు కుమార స్వామి. వీడియో క్లిప్పులు ఉన్న పెన్ డ్రైవ్ లు ఎక్కడి నుండి వచ్చాయి. ఎవరు పంపిణీ చేశారనే విషయాలపైనా దర్యాప్తు సాగాలని అన్నారు.
అసలు ఈ వీడియోల వెనక ఉన్నది ఎవరు.. వారు స్త్రీల పరిరక్షకులా అని ప్రశ్నించారు. ప్రజ్వల్ పై అభియోగాలు వాస్తవమని తేలితే చట్టప్రకారం శిక్ష తప్పదని గతంలో వెల్లడించారు. కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ప్రస్తావించిన ఆయన ..బీజేపీకి, ప్రధాని మోడీకి ఈ కేసుతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇక దేవగౌడకు, తనకూ ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని అన్నారు.
PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ