NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

తెలుగుదేశం పార్టీలో ఆయన సీనియర్ లీడర్.. గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడిగా ఎదిగి మంత్రి అయిన ఆ నేత ఆ తర్వాత టిడిపిలో చేరి చంద్రబాబు దయతో మంత్రి అయినా చంద్రబాబు.. టిడిపిపై ఆయనకు అసలు ఏమాత్రం ప్రేమ ఉండదు. విచిత్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటినుంచి ఆ పార్టీలోనే ఉన్న వీరాభిమానులు.. పార్టీ నాయకులు ఎవరైనా ఆయన దగ్గరికి వెళితే ఏం చేస్తున్నాడు అయ్యా మీ చంద్రబాబు ? మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అని వెటకారంగా అడుగుతారట. ఇప్ప‌ట‌కీ ఇన్నేళ్లుగా టీడీపీలో ఉంటున్నా టీడీపీ కేడ‌ర్ ద‌గ్గ‌ర కూడా చంద్ర‌బాబును విమ‌ర్శిస్తూ రాజ‌శేఖ‌ర్‌రెడ్డితో పాటు జ‌గ‌న్‌ను సైతం కీర్తిస్తూ ఉంటార‌ట‌. ఈ విష‌యాన్ని టీడీపీ కేడ‌ర్ ప‌బ్లిక్‌గానే మాట్లాడుకుంటుంది.

ఇప్పుడు ఆయ‌న ఉన్న‌ది టీడీపీయే.. రేపు టీడీపీ గెలిస్తే మంత్రి ప‌ద‌వి కూడా కావాలి.. కానీ ఆయ‌న మాట్లాడే వెట‌కార‌పు మాట‌లు ఇలా ఉంటాయి. ఆ సీనియర్ నేత మాజీ మంత్రి ఎవరో కాదు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆచంట మాజీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ. పితాని సత్యనారాయణకు కాలం కలిసి వచ్చి టాప్ లీడర్ అయ్యారు. శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని అడ్డంపెట్టుకుని ఆయన రాజకీయంగా తనకు తానుగా పైకి ఎదిగారు. ఇప్పుడు తన వారసులను పైకి ఎదిగేలా చేస్తున్నారే తప్ప సొంత సామాజిక వర్గానికి ఆయన ఉపయోగపడింది ఎంత మాత్రం లేదని అంటారు. పితాని సత్యనారాయణ 2014 ఎన్నికల సమయంలో టిడిపిలోకి వచ్చి తర్వాత మూడేళ్లకు బాబు క్యాబినెట్లో మంత్రి అయ్యారు.

2014 ఎన్నిక‌ల‌కు ముందు కూడా మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్ రెడ్డి జై స‌మైక్యాంధ్ర పార్టీలోకి వెళ్లి.. ఆ పార్టీని, కిర‌ణ్‌కుమార్‌ను దెబ్బ‌కొట్టి టీడీపీలో చేరి టిక్కెట్ కొట్టేశారు. అప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ టీడీపీ కోసం క‌ష్ట‌ప‌డిన వాళ్ల‌ను గెలిచిన వెంట‌నే అణ‌గ‌దొక్క‌డం స్టార్ట్ చేశారు. కేవలం తన కులాన్ని అడ్డం పెట్టుకుని మాత్రమే పితాని మంత్రి అయ్యారు. వాస్తవంగా శెట్టిబలిజ సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీలో ఎప్పటినుంచో ఉన్న నేతలను కాదని సైతం చంద్రబాబు పితాని సత్యనారాయణకు మంత్రి పదవి కట్టబెట్టారు. అయినా పితానికి ఆ విశ్వాసం ఎంత మాత్రం ఉండదని.. తెలుగుదేశం పార్టీ శ్రేణుల చెవులు కోరుక్కుంటూ ఉంటాయి. అందుకే జిల్లా తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న కీలక నాయకులు ఎవరు పితానిని ఎంత మాత్రం ఇష్టపడరు.

విచిత్రం ఏంటంటే 2014, 2019 ఎన్నికల సమయంలో పితాని వైసిపిలోకి వెళ్లే ప్రయత్నాలు కూడా చేశారని అంటారు. ఒకవేళ నిజంగా పితాని వైసీపీలోకి వెళ్లి ఉంటే వేరే ఎవరో అక్కర్లేదు జగనే స్వయంగా పితానిని రాజకీయంగాను.. అటు తన సొంత సామాజిక వర్గంలోనూ కోరలు పీకి నేల మీద మూలన కూర్చో పెట్టేవాడని అన్నది జగమెరిగిన సత్యం. సామాజివర్గాలపరంగా.. బలమైన నేపథ్యం ఉండి కుటుంబ పరంగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వారిని జగన్ మూలన కూర్చో పెట్టేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం పితాని చాలా అదృష్టవంతుడు అనే చెప్పాలి. తాజాగా ఏపీలో ఎన్నికల వేడి మొదలవుతుండడంతో పితాని మళ్లీ పట్టు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఒకవేళ వైసీపీలోకి వెళ్లి ఉంటే పితాని అక్కడ గుంపులో గోవిందం అయిపోయేవారు. అయినా పితానిని నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం జగన్‌కు ఎంత మాత్రం లేదు. కౌరు శ్రీను లాంటి సాధారణ కార్యకర్తకు డిసిసిబి చైర్మన్, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ ఇలా ఎన్నో కీలక పదవులు కట్టబెట్టారు. ఏకంగా నరసాపురం, రాజమండ్రి రెండు పార్లమెంటు స్థానాలను శెట్టిబలిజ సామాజిక వర్గానికి కేటాయించారు. పితాని ఈ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వం వస్తే మళ్లీ మంత్రి పదవి టార్గెట్ గా రాజకీయం మొదలుపెట్టినా టిడిపిలో ఎప్పటినుంచమన్న శెట్టి బలిజల‌కో లేదా ఇతర బీసీ వర్గాలకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని.. ఈ సారి అయినా చంద్రబాబు పార్టీని నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేస్తారని పితాని లాంటి వాళ్లను అనవసరంగా అందలం ఎక్కించాల్సిన పనిలేదని కోరుతున్నాయి ఉమ్మ‌డి జిల్లా తెలుగుదేశం శ్రేణులు.

Related posts

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju