NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైస్ చిత్రం ఎలాంటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రంలో బాగా హైలెట్ అయిన పాత్రల్లో కేశవ క్యారెక్టర్ ఒకటి. పుష్ప స్నేహితుడు కేశవ పాత్రలో జగదీష్ ప్రతాప్ బండారి న‌టించాడు. చిత్తూరు యాసలో మాట్లాడుతూ జగదీష్ ప్రేక్షకులను అద్భుతంగా మెప్పించాడు. విమర్శకుల నుంచి సైతం ప్ర‌శంస‌లు అందుకున్నాడు. అయితే కేశవ క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ జగదీష్‌ కాదని తాజాగా సుకుమార్ టాప్ సీక్రెట్ ను బయటపెట్టారు.

మొదట ఆ పాత్ర కోసం టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరోను అనుకున్నామని సుకుమార్ స్వయంగా తెలిపారు. ఇంతకీ పుష్ప లో కేశవ క్యారెక్టర్ ని మిస్ చేసుకున్న ఆ యంగ్ హీరో మరెవరో కాదు సుహాస్. కమెడియన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుహాస్.. కలర్ ఫోటో మూవీతో హీరోగా టర్న్ అయ్యాడు. 2020లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కలర్ ఫోటో మూవీ సంచలన‌ విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత కథానాయకుడిగా రైటర్ పద్మభూషన్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు చిత్రాలతో మరో రెండు హిట్స్ ను ఖాతాలో వేసుకున్నాడు. పూర్తిస్థాయి హీరోగా నిలదొక్కుకున్నాడు.

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. త్వరలోనే సుహాస్‌ ప్రసన్నవదనం సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. అర్జున్ వైకే దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. ఈ చిత్రంలో సుహాస్ కు జోడీగా రాశి సింగ్ న‌టించింది.మ‌ణికంఠ‌, ప్ర‌సాద్ రెడ్డి నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించారు. ఈ మూవీలో ఫేస్ బ్లైండ్‌నెస్ వ్యాధితో బాధ‌ప‌డే యువ‌కుడిగా సుహాస్ క‌నిపిస్తాయి. స‌రికొత్త కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన ప్ర‌స‌న్న వ‌ద‌నం మూవీ మే 3న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా ప్ర‌స‌న్న వ‌ద‌నం ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా.. ప్ర‌క్ష‌కుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ట్రైల‌ర్ ద్వారా సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే.. ప్ర‌స‌న్న వ‌ద‌నం ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ కు స్పెష‌ల్ గెస్ట్ గా విచ్చేసిన డైరెక్ట‌ర్ సుకుమార్ హీరో సుహాస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. డిఫరెంట్ కథలు, ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న సుహాస్ పై సుకుమార్ ప్ర‌శంస‌లు కురిపంచారు.

అలాగే త‌న‌కు మ‌రియు అల్లు అర్జున్ కు సుహాస‌న్ అంటే ఎంతో ఇష్ట‌మ‌ని.. పుష్ప సినిమాతో కేశ‌వ క్యారెక్ట‌ర్ కు తాము మొద‌ట అనుకున్న‌ది సుహాస్‌నే అని సుకుమార్ వెల్ల‌డించారు. అయితే అప్ప‌టికే హీరోగా చేస్తుండ‌టంతో కేశ‌వ పాత్ర‌కు సుహాస్‌ను అడ‌గ‌టం క‌రెక్ట్ కాద‌ని భావించి వెన‌క్కి త‌గ్గామ‌ని సుకుమార్ తెలిపారు. అంతేకాకుండా సుహాస్‌ యాక్టింగ్ చాలా రియలేస్టేక్ గా ఉంటుంద‌ని.. అత‌ను ఎలాంటి పాత్ర‌లో అయినా ఇమిడిపోతాడ‌ని కొనియాడారు. భ‌విష్య‌త్తులో సుహాస్ పెద్ద స్టార్ అవ్వాల‌ని సుకుమార్ ఆకాంక్షించారు. ప్ర‌స్తుతం సుకుమార్ కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Related posts

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?