NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన తన అరెస్టును సవాల్ చేస్తూ గతంలోనే సుప్రీం కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Arvind Kejriwal

లోక్ సభ ఎన్నికల వేళ ఓ పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఒక వేళ బెయిల్ మంజూరు చేస్తే ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వర్తించొద్దని సూచించింది. ఇది అసాధారణ పరిస్థితి. అరవింద్ కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ఓ ముఖ్యమంత్రి. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదు. లోక్ సభ ఎన్నికలు అయిదేళ్లకు ఒకసారి వస్తాయి. పార్టీ అధినేతగా ఆయన ప్ర్రచారం చేయాల్సిన అవసరం ఉంది అని వ్యాఖ్యానించింది.

అయితే సుప్రీం అభిప్రాయాలను ఈడీ వ్యతిరేకించింది. సీఎం అయినంత మాత్రాన ఈ కేసులో ప్రత్యేకంగా పరిగణించకూడదని, కేసుల్లో రాజకీయ నాయకులకు మినహాయింపులు ఉండకూడదని ఈడీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. ఇక, ఈ కేసులో కేజ్రీవాల్ దర్యాప్తునకు సహకరించలేదని, తొమ్మిది సమన్లను పట్టించుకోలేదన్నారు. అందుకే అరెస్టు చేయాల్సి వచ్చిందని వివరించారు.

అనంతరం ధర్మాసనం స్పందిస్తూ .. ఒక వేళ ఈ కేసులో మీకు బెయిల్ మంజూరు చేస్తే అధికారిక విధులు నిర్వర్తించేందుకు మేం అనుమతించబోం అలా చేస్తే ప్రజా ప్రయోజనాలకు విరుద్దంగా ఉంటుంది. బెయిల్ పై విడుదలైతే ఫైళ్లపై సంతకాలు చేయొద్దు అని తెలిపింది. దీనిపై కేజ్రీవాల్ తరపు న్యాయవాది మాట్లాడుతూ .. సీఎం ఎలాంటి పత్రాలపై సంతకాలు చేయరని, అయితే ఆ కారణంతో లెఫ్టినెంట్ గవర్నర్ వాటిని తిరస్కరించకుండా చూడాలని కోరారు.

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం .. మధ్యంతర బెయిల్ పై తీర్పును రిజర్వు చేసింది. మరో వైపు ఈ కేసులో కేజ్రీవాల్ జ్యూడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మే 20వ తేదీ వరకూ పొడిగించింది.

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

Related posts

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

sharma somaraju

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N