NewsOrbit
Cinema Entertainment News ట్రెండింగ్ న్యూస్ సినిమా

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

Mehreen Pirzada: పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదాను కొత్త‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అతి చిన్న వ‌య‌సులోనే మోడ‌లింగ్ లోకి ప్ర‌వేశించిన ఈ ముద్దుగుమ్మ పదేళ్ల వయసులో మొదటి ర్యాంప్ వాక్ చేసి కసౌలీ ప్రిన్సెస్ టైటిల్‌ను గెలుచుకుంది. 2016లో వ‌చ్చిన తెలుగు చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాధ తో మెహ్రీన్ త‌న న‌ట‌నా వృత్తిని ప్రారంభించింది. ఇందులో న్యాచుర‌ల్ స్టార్ నానికి జోడిగా న‌టించి మెప్పించింది. తొలి సినిమాతోనే యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

ఆ త‌ర్వాత తెలుగులో వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వంటి చిత్రాలు టాలీవుడ్ లో మెహ్రీన్ కు భారీ క్రేజ్ తెచ్చిపెట్టాయి. అలాగే హిందీ, త‌మిళ్‌, పంజాబ్ భాష‌ల్లో సైతం అడ‌పా త‌డ‌పా సినిమాల్లో యాక్ట్ చేసిన మెహ్రీన్‌.. 2021లో స‌డెన్ గా పెళ్లి క‌బురు చెప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. హిసార్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు, హర్యానా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ తో ఏడ‌డుగులు వేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించింది. 2021 మార్చిలో భవ్య బిష్ణోయ్, మెహ్రీన్ ల ఎంగేజ్మెంట్ కూడా జ‌రిగింది. కానీ పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే ఈ జంట విడిపోయారు. త‌మ నిశ్చితార్థాన్ని ర‌ద్దు చేసుకున్నారు. పెళ్లి క్యాన్సిల్ అయ్యాక మెహ్రీన్ కెరీర్ ప‌రంగా మునుప‌టి జోరును చూపించ‌లేక‌పోతోంది.

అడ‌పా త‌డ‌పా సినిమాలు చేస్తూ నెట్టుకొస్తోంది. ఇదిలా ఉంటే.. పెళ్లి కాకుండానే మెహ్రీన్ త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతోంది. అవును మీరు విన్న‌ది నిజ‌మే. పిల్ల‌ల కోసం మెహ్రీన్ ఎగ్ ఫ్రీజింగ్ ప‌ద్ధ‌తిని ఎంచుకుంది. స్త్రీ యొక్క ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరుచుకునే ప్రక్రియనే ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. గర్భధారణను వాయిదా వేయడానికి ఈ సాంకేతికత ఉపయోగించబడుతుంది. పిల్ల‌ల‌ను క‌నాలి అనుకున్న‌ప్పుడు భ‌ద్ర‌ప‌రిచిన ఎగ్స్ ను కరిగించి, ఫలదీకరణం చేసి, పిండాలుగా గర్భాశయానికి బదిలీ చేస్తారు. ఇటీవ‌ల కాలంలో చాలా మంది హీరోయిన్స్ ఎగ్ ఫ్రీజింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా ఈ జాబితాలో మెహ్రీన్ కూడా చేరింది. వివాహం కాకుండానే ఆమె త‌న ఎగ్స్ ను భ‌ద్ర‌ప‌రుచుకుంది. అంతేకాకుండా త‌న ఎగ్ ఫ్రీజింగ్ జ‌ర్నీని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మెహ్రీన్ పంచుకుంది. ఈ సంద‌ర్భంగా ఆమె కొన్ని ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేసింది.

`ఎగ్ ఫ్రీజింగ్ ప్ర‌క్రియ వైపు వెళ్ల‌డానికి దాదాపు 2 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నాను. ఫైన‌ల్ గా నేను ఇది చేశాను. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది నా వ్యక్తిగత విషయం.. అందరితో పంచుకోవాలా ?వద్దా? అని ఆలోచించాను. కానీ నాలాంటి చాలా మంది మహిళలు ఉన్నారు. వారు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి లేదా ఎప్పుడు బిడ్డను కనాలి అని ఇంకా నిర్ణయించుకోలేదు. అలాంటి వారి కోసం నేను ఈ విష‌యాన్ని పంచుకుంటున్నాను. తల్లి కావాలనేది నా కల. అయితే అందుకు కొన్ని సంవ‌త్స‌రాలు ఆలస్యం కావొచ్చు. అందుకే ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నా. భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యమ‌ని నేను భావిస్తున్నాను.

ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఎంతో స‌వాలుతో కూడుకున్నది. ముఖ్యంగా ఇన్‌జెక్ష‌న్స్‌, బ్ల‌డ్ మ‌రియు హాస్పిట‌ల్స్‌ ఫోబియా ఉన్న నాలాంటి వారికి ఇంకా క‌ష్టంగా ఉంటుంది. హార్మోన్ల ఇంజక్షన్స్ కారణంగా ఆసుపత్రికి వెళ్లిన ప్రతిసారీ నేను కళ్లు తిరిగి పడిపోయాను. కానీ ఎగ్ ఫ్రీజింగ్ ఎంతో విలువైన‌ది. అందరు స్త్రీలు దీన్ని చేయాలని నేను భావిస్తున్నాను. నా ఎగ్ ఫ్రీజింగ్ జ‌ర్నీలో తోడుగా గైనకాలజిస్ట్ డాక్టర్ రిమ్మీ మరియు నిరంతరం నా ప‌క్క‌నే ఉన్న అమ్మకు ధన్యవాదాలు` అంటూ మెహ్రీన్ త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో రాసుకొచ్చింది. దీంతో మెహ్రీన్ లేటెస్ట్ పోస్ట్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

https://www.instagram.com/reel/C6Xm-TwvinC/?utm_source=ig_web_copy_link

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N