Kajal Aggarwal: ఇటీవల కాలంలో ఎంతో మంది హీరోయిన్లు వివాహం అనంతరం కూడా సక్సెస్ ఫుల్ కెరీర్ ను రన్ చేస్తున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకటి. బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ తెలుగు సినిమాల ద్వారానే కాజల్ స్టార్డమ్ సంపాదించుకుంది. దాదాపుగా దశాబ్దన్నర కాలం నుంచి అగ్ర తారగా సత్తా చాటుతోంది. 2020లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ఏడడుగులు వేసింది. 2022లో ఈ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. పెళ్లై ఒక బిడ్డకు తల్లయిన తర్వాత కూడా కాజల్ హీరోయిన్ గా రాణిస్తోంది. గత ఏడాది భగవంత్ కేసరి చిత్రంతో క్రేజీ హిట్ అందుకున్న కాజల్ అగర్వాల్.. త్వరలో సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతోంది.
క్రైమ్ థ్రిల్లర్ గా సత్యభామ మూవీని తెరకెక్కించారు. ఔరం ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శశి కిరణ్ తిక్క, బాబీ తిక్క మరియు శ్రీనివాస్ రావు తక్కలపెల్లి నిర్మించిన ఈ సినిమాకు సుమన్ చిక్కాల రచన మరియు దర్శకత్వం వహించాడు. శ్రీచరణ్ పాకాల స్వరాలు అందించాడు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను కాజల్ అగర్వాల్ పోషించింది. నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు.
మే 31న సత్యభామ మూవీ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర టీమ్ ప్రమోషన్స్ ను షురూ చేసింది. సత్యభామ చిత్రాన్ని కాజల్ గట్టిగా ప్రమోట్ చేస్తోంది. వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ తనవంతు హైప్ క్రియేట్ చేస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా విశేషాలతో పాటు కొన్ని పర్సనల్ విషయాలను కూడా పంచుకుంది. ఇందులో భాగంగానే గతంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఇంటర్వ్యూలో `మీ అభిమానులు చేసిన క్రేజీయెస్ట్ పని ఏదైనా ఉంటే చెప్పగలరా..?` అంటూ యాంకర్ కాజల్ ప్రశ్నించింది.
అందుకు కాజల్ బదులిస్తూ.. `క్రేజీ కాదు ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ నన్ను చాలా భయపెట్టింది. గతంలో ఒక సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాను. అదే ఫస్ట్ డే. షార్ట్ కు రెడీ అయ్యి కారవాన్ లో ఉన్నాను. అయితే ఓ అసిస్టెంట్ డైరెక్టర్ సడన్ గా నా కారవాన్ లోకి వచ్చేసి షార్ట్ తీసేశాడు. అతని ప్రవర్తనకు చాలా భయపడ్డాను. అతను నాకు పెద్ద ఫ్యాన్ అని చెప్పి తన ఛాతి మీద వేయించుకున్న నా పేరు టాటూను చూపించాడు. ఎంత అభిమానం ఉన్నా సరే సడన్ గా వచ్చి అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. అదే విషయాన్ని అతనికి కూడా గట్టిగానే చెప్పాను. నా లైఫ్ లో అదొక మర్చిపోలేని ఇన్సిడెంట్` అంటూ కాజల్ చెప్పకొచ్చింది. దీంతో కాజల్ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. అయితే అంత ధైర్యం గా కారివాన్ లోకి వచ్చి షర్ట్ తీసేసి మరి టాటూ చూపించిన అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు అన్నది మాత్రం కాజల్ బయట పెట్టలేదు.