NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema June 06 Episode 643:అను పద్దు ల మధ్య గొడవ పెట్టాలనుకున్న దివ్య.. అను రిక్వెస్ట్.. విక్కీ పద్మావతిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న మూర్తి..

Nuvvu Nenu Prema Today Episode June 6 2024 Episode 643 highlights

Nuvvu Nenu Prema: పద్మావతి ఆఫీస్ కి వెళ్తూ ఉంటే దివ్య తనకి పది వేలు కావాలని అడుగుతుంది. తన ఫ్రెండ్స్ అందరితో కలిసి బయటికి వెళ్లాలని అందుకు తన దగ్గర డబ్బులు లేవని పద్మావతిని అడుగుతుంది. పద్మావతి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో నీకు అంత డబ్బు ఇవ్వలేనని అంటుంది. అయినా అంత డబ్బు పెట్టి నువ్వు ఇప్పుడు బయటికి వెళ్లకపోతే ఏమైంది? ఇప్పుడు నేను అంత డబ్బు అడిగితే ఎక్కడ నుంచి తీసుకొస్తాను అని అంటుంది.నువ్వు కొంత ఇవ్వు నేను కొంత అడ్జస్ట్ చేసుకుంటాను అని అడుగుతుంది దివ్య అది కూడా పద్మావతి కుదరదు అని చెప్తుంది అప్పుడే అక్కడికి అనుకూడా వస్తుంది. అను వచ్చిన విషయం పద్మావతి గమనించదు. దివ్య ఈ సిచువేషన్ ని నాకు అనుకూలంగా వాడుకుంటాను చూడు అని అనుకుంటుంది. కావాలని అయితే డబ్బులు లేవంటావా వదిన అని అంటుంది. లేవనే కదా దివ్య చెప్తుంది ఇప్పుడు మన ఇంట్లో పాప కూడా వచ్చింది పాప కూడా ఎంత ఖర్చు ఉంటుందో నీకు తెలుసు కదా అలాంటప్పుడు మనమే ఖర్చులు తగ్గించుకోవాలి అని అంటుంది సరే వదిన అయితే అని అంటుంది. పద్మావతి వెళ్ళిపోతుంది. దివ్య అను దగ్గరికి వెళ్లి ఇదేంటి పెద్ద వదినకి మీరు పాపం తెచ్చుకోవడం ఇష్టం లేనట్టుంది కదా పైకేమో బాగా ఇష్టం ఉన్నట్లు నటిస్తోంది డబ్బులు అడిగితే పాప ఉందని అడ్డం చెప్పి నాకు డబ్బులు కూడా ఇవ్వట్లేదు. పాపకి ఎంత ఖర్చవుతుంది అన్నది నీకు నాకు తెలియదా వదినా పద్మావతి వదిన కావాలనే పాప ఖర్చు గురించి చెప్తుంది ఏంటో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు నీవు ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. అక్క చెల్లెల మధ్య పాపని అడ్డుపెట్టి గొడవ సృష్టించాలని దివ్య అనుకుంటుంది. దివ్య ప్లాన్ సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది అను ఆలోచనలో పడుతుంది.

Nuvvu Nenu Prema Today Episode June 6 2024  Episode 643 highlights
Nuvvu Nenu Prema Today Episode June 6 2024 Episode 643 highlights

ఇక మరోవైపు పద్మావతి బయటికి వచ్చి గరుడా మనం తొందరగా ఆఫీసుకు వెళ్ళాలి అని బండితో మాట్లాడుతుంది గరుడ సరే అమ్మి నువ్వు తొందరగా ఎక్కితే మనం వెళ్దాము అని అంటాడు. ఇప్పుడు నీకు అంతా తగ్గిపోయింది కదా అని అంటుంది పూర్తిగా తగ్గిపోయింది నువ్వు ఎక్కువ నేను తీసుకెళ్తాను కదా అని అంటాడు. బండి మీద ఎక్కి కొంచెం దూరం వెళ్లేసరికి అవి కి బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న వ్యక్తిని బస్సు ఇంకా రాలేదేంటి అని అడిగితే ఈరోజు స్ట్రైక్ ఆటోలు బస్సులు రావు అని అంటాడు ఆ వ్యక్తి దాంతో ఏం చేయాలో అర్థం కాక విక్కి అటు ఇటు చూస్తూ ఉంటాడు అప్పుడే పద్మావతి వాళ్ళు వెళ్లడం చూసి పద్మావతిని లిఫ్ట్ అడుగుతాడు. గరుడ వద్ద మీ మనం వెళ్ళిపోదాము ఆ టెంపర్ అడుగు నా బండి ఎక్కడో నాకు ఇష్టం లేదు ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తాడు అని అంటాడు. మరేం పర్లేదు గరుడా నేనున్నాను కదా అని అంటుంది పద్మావతి విక్కీ ఈ బండిమీద మనిద్దరం వెళ్లాలా అని అంటాడు. మీకు ఇష్టమైతే రండి లేకపోతే లేదు ఆటోలో అవి రావు ఆఫీస్ కి వెళ్ళాలి కదా లేట్ అవుతుంది ఇప్పటికే మీకు అసలే మీటింగ్ కూడా ఉంది ఆలోచించుకోండి అని అంటుంది. సరే తప్పేదేముంది పదా అని అంటాడు విక్కీ పద్మావతి నేను నడుపుతాను బండి అంటుంది అవసరం లేదు నువ్వే వెనక కూర్చొఅని విక్కీ బండి నడుపుతాడు. బండి ఫాస్ట్ గా నడపడంతో గరుడ ఒకసారిగా ఆగిపోతాడు ఇదేంటి ఈ బండి ఆగిపోయింది అంటే మీరు దిగండి అని అంటుంది పద్దు. గరుడ ఇలా బండి నడిపితే నా వల్ల కాదు అమ్మి అని అంటాడు సరే నేనే నడుపుతాను అని అంటుంది పద్దు విక్కీని వెనక కూర్చోమంటుంది నేను వెనక కూర్చోను అని అంటాడు సారీ మీకు ఆఫీస్కి వెళ్ళడం ఇంపార్టెంట్ అయితే కూర్చోండి అని అంటుంది చేసేదేం లేక విక్కీ కావాలని పద్మావతి బండిమీద వెనక్కి తిరిగి కూర్చుంటాడు. పద్మావతి బండి నడుపుతూ ఉంటుంది కొంత దూరం వెళ్లేసరికి ఎక్కడో బజ్జీలు వాసన వస్తుంది గరుడ అని అంటుంది. ఇప్పుడు ఎక్కడ బజ్జీలు అని అంటాడు గరుడ ఇవ్వలేదు బజ్జీలు వాసన వస్తుంది అని బజ్జీలు అమ్మే చోటుకి తీసుకువెళ్తుంది విక్కీ కోప్పడతాడు ఇప్పుడు నేను ఆఫీస్ కి వెళ్ళాలంటే నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అంటే విక్కి చెప్పేదేమీ వినిపించుకోకుండా పద్మావతి బజ్జీలు ఆర్డర్ చేస్తుంది. బజ్జీలు తింటూ ఆహా ఎంత బాగున్నాయో మిర్చి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అంటుంది గుంటూరు నుంచి అని చెప్తాడు గుంటూరు మిర్చి అందుకే ఇంత ఘాటుగా ఉన్నాయి అని అంటూ ఆస్వాదిస్తూ వాటిని తింటూ ఉంటుంది విక్కీకి చాలా కోపం వస్తుంది. నిన్ను ఇప్పుడు కాదు నా టైం వచ్చినప్పుడు చెప్తాను అని అనుకుంటాడు విక్కి. ఆ మీ టెంపర్ వాడికి మండుతున్నట్టు ఉంది అని గరుడ అంటాడు. మీరు కూడా తింటారా అని అంటుంది పద్దు. నువ్వు తిను నాకు అవసరం లేదు అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode June 6 2024  Episode 643 highlights
Nuvvu Nenu Prema Today Episode June 6 2024 Episode 643 highlights

ఇక మరోవైపు పద్మావతి నిజంగానే పాప గురించి మాట్లాడిందని అనుకుంటుంది ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆర్య అక్కడికి వస్తాడు. ఏంటి అను ఆలోచిస్తున్నావ్ అంటే పాపకి బారసాల వద్దులేండి అని అంటుంది. నువ్వే కదా బారసాల చేద్దాం అన్నావు నేను అమ్మతో నాన్నతో గొడవ కూడా పడి బారసాల చేద్దామంటే, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు అనిఅంటాడు.మళ్లీ అమ్మ ఏమన్నా అన్నదా అని అడుగుతాడు లేదు మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కదా ఇప్పుడు 20,000 అయినా అవుతాయి బారసాలకి మన దగ్గర డబ్బులు లేకుండా ఎందుకండీ అని అంటుంది. బారసాల మర్చిపోదామండి కావాలంటే అన్నప్రాసన చేసుకుందాం లేండి అప్పటికి మీకు ఏదో ఒక ఉద్యోగం వస్తుంది లెండి అని అంటుంది. అను ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు. చూడను బారసాల చేద్దాం ఉన్నంతలోనే చేద్దాం అని అంటాడు ఆర్య. పాపకి సంబంధించిన ప్రతి చిన్న ఫంక్షన్ మనమే చేసుకుందాము అని అంటాడు. నువ్వు ఇంకేం చెప్పకు అని అంటాడు. పాప ఫంక్షన్ మీ కష్టార్జితంతోనే జరగాలి అని అంటుంది అను. ఎందుకు అలా అంటున్నావు అని అంటాడు ఆర్య. నాకెందుకు అలా అని అనిపిస్తుంది మీ కష్టార్జితంతోనే మన పాప ఫంక్షన్ చేద్దాము అని అంటే సరే అంటాడు ఆర్యా. ఇదంతా దివ్య కూడా వింటుంది దివ్య నీ ప్లాన్ చాలా సక్సెస్ అయింది ఇప్పుడు నువ్వు మనసులో పడిన ఈ అనుమానం రేపు పెద్దదయ్యి ఈ ఇంటిని తగలబెట్టేస్తుంది అని అనుకుంటుంది. ఇంట్లో ఎవరినీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది నాకు కావాల్సిన అదే కదా అని అనుకుంటుంది దివ్య. ఏంటండీ నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పరా అని అంటే నీకు నచ్చినట్టే చేద్దాము నియానందమే నా ఆనందం పాప కోసం ఏదైనా చేస్తాను అని అంటాడు ఆర్య. అను సంతోషపడుతుంది.

Nuvvu Nenu Prema Today Episode June 6 2024  Episode 643 highlights
Nuvvu Nenu Prema Today Episode June 6 2024 Episode 643 highlights

ఇక విక్కీ పద్దు ఇద్దరు బండిమీద వెళ్తూ మిర్చి తిని నోరు బాగా మండినట్టుంది అందుకే ఐస్ తింటున్నాడు అని అనుకుంటుంది. గరుడ ఏంటి విక్కీ చిన్నపిల్లడా ఏంటి దానికి ఊరుకో గరుడ నా మొహం చూసి వదిలేసేయ్ అని అంటుంది పద్దు మీ గొడవ ఏంటి ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉంటారా అలాగా నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది అని అంటాడు విక్కీ. ఒక మిర్చి బజ్జి తిని ఎందుకు అంతలాగా కారం ఉందని అంటున్నారు అని అంటుంది దాన్ని ఎవరైనా మిర్చి అంటారా ఎంత కారంగా ఉందో తెలుసా అని, నేను వద్దంటున్నా బలవంతంగా పెట్టించావు ఇప్పుడు చూడు నా పరిస్థితి ఎలా ఉందో, విక్కీ. అదే మై రాయలసీమలో అయితే గొడ్డుకారం వేసుకొని కూడా తింటారు తెలుసా, అలా తిని కూడా బతుకుతున్నారంటే మీరందరూ దైవాంశ సంభూతులు అని అంటాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ బండి మీద వస్తుంటే ఆఫీసులో పనిచేసే మూర్తి వేరే వాళ్ళతో మాట్లాడుతూ అదే దారిలో ఉంటాడు. పదవికి ఇద్దర్ని చూస్తాడు వీళ్లిద్దరూ కలిసి ఒకే బండి మీద వెళ్తున్నారు ఏంటి అని అనుకుంటాడు. కొంచెం దూరం వాళ్ళనే ఫాలో అవుతూ వెళ్తాడు వాళ్ళు ఒక చోట బండి ఆపి ఇక నువ్వు వెళ్లి పద్మావతి నేను నడిచి వస్తాను అని అంటాడు. దేనికి అని అడుగుతుంది పద్మావతి ఇంకొంచెం దూరంలో ఆఫీసు ఉంది ఎవరైనా చూస్తే మనిద్దరం మీద అనుమానం వస్తుంది అని అంటాడు విక్కీ అప్పుడే మూర్తి వాళ్ళని చూసి ఏంటి వీళ్లిద్దరూ ఇక్కడిదాకా బండి మీద వచ్చి ఇక్కడ దిగి మళ్ళీ గొడవ పడుతున్నారు అని అనుకుంటాడు. దగ్గరికి వెళ్లి కనుక్కుందాం అసలు ఏంటో విషయం తెలుస్తుంది అని మూర్తి విక్కీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే పద్మావతి ఏం కాదులే సారు మీరు ఎక్కండి ఎవరూ చూడరు అని అంటుంది అప్పుడే మూర్తి వచ్చి హలో అని అంటాడు సార్ మీరు అని అంటాడు విక్కి. నా ఎంట్రీ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా అని అంటాడు మూర్తి. చెప్పండి అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య నాకు ఇప్పుడే తెలియాలి అని అంటాడు మూర్తి.

Nuvvu Nenu Prema Today Episode June 6 2024  Episode 643 highlights
Nuvvu Nenu Prema Today Episode June 6 2024 Episode 643 highlights

పద్మావతి వికీ ఇద్దరు కంగారు పడతారు ఏం చెప్పాలో అర్థం కాక, మా ఇద్దరి మధ్యలో ఏముంటుంది సారు బూడిద అని అంటాడు విక్కి. మీరు ఈ అమ్మాయి బండి మీద ఎందుకు వచ్చారు ఏదో గొడవ పడిన లవర్స్ లాగా భార్యాభర్తలాగా వెనక్కి తిరిగి కూర్చున్నావు నాకు ఏదో డౌట్ కొడుతుంది అని అంటాడు మూర్తి. సార్ నేను ఆఫీస్ కి వస్తుంటే బస్సు ఆటోలు లేవని నాకు లిఫ్ట్ ఇచ్చారు అని అంటాడు విక్కి. మరి వెనక్కి తిరిగి ఎందుకు కూర్చున్నావు అంటే నాకు ఆడవాళ్ళు అంటే అసయం, అందుకే వెనక్కి తిరిగి కూర్చున్నాను అని అంటాడు విక్కీ. అంతా ఆశయం ఎందుకో అని అంటాడు మూర్తి. ఆడవాళ్ళ ప్రేమ వాళ్ళ పిచ్చి పట్టిన మగవాళ్ళు ఉంటారు కానీ మగవాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన వాళ్ళు ఎవరు ఉండరు కదా అని అంటాడు విక్కి. మగవాళ్ళ వల్ల సన్యాసులైన ఆడవాళ్లను ఎక్కడైనా చూశారా అని అంటే లేదు అని అంటాడు మూర్తి. కదా అదే సార్ నేను చెప్పేది ఆడవాళ్ళ ప్రేమ కోసం మన మగవాడైన షాజహాన్, తాజ్ మహల్ కట్టాడు. మరి ఆడవాళ్లు ఎప్పుడైనా ఒక గుడిసె అయినా కట్టారా అని అంటే లేదు అని అంటాడు. మనం మగవాళ్ళు చాలా మంచి వాళ్ళు ఈ ఆడవాళ్లు చాలా డేంజర్ అని అంటాడు విక్కీ. నాకు అందుకే ఆడవాళ్లు అంటే అసహ్యం అని అంటాడు. వెంటనే పద్మావతి కాలు తొక్కుతుంది. ఎందుకమ్మా విక్కీ కాల్ తోక్కావు అని అంటాడు మూర్తి. మరి మా అమ్మాయి ల గురించి అలా మాట్లాడుతుంటే నాకు కోపం రాదా సార్ అని అంటుంది పద్దు. మీ ఇద్దరిని చూస్తుంటే నాకెందుకో ఇంకా అనుమానంగానే ఉంది అని అంటాడు మూర్తి. మరి మీరిద్దరూ చెప్పింది నిజమే అయితే నువ్వు ఇక్కడే ఎందుకు దిగుతున్నావు ఆఫీస్ దగ్గర దిగొచ్చు కదా అని అంటాడు. మన ఆఫీస్ రూల్స్ ఏంటి అమ్మాయి అబ్బాయి కలిసి క్లోజ్ గా ఉండకూడదు కదా, మీరంటే మంచోళ్ళు కాబట్టి మా ఇద్దరినీ ఇలా చూసినా అర్థం చేసుకున్నారు అదే ఆఫీసులో ఎవరైనా అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకుంటారు అని ఇక్కడే దిగిపోతున్నాను అని అంటాడు విక్కీ. నేను మంచోడిని కాదు నాకు మీ ఇద్దరి మీద అనుమానం గా ఉంది. నేను బాస్ దగ్గరికి వెళ్లి నాకు తోచింది చెప్తాను మీరిద్దరూ రండి వెనకాల ఆఫీస్ కి అని వెళ్ళిపోతాడు మూర్తి. పద్మావతి నువ్వు వెళ్లి ఆఫీస్ కి ముందు నేను తర్వాత వస్తాను అని అంటాడు విక్కీ. శ్రీనివాస నువ్వే కాపాడాలప్ప అని అనుకుంటుంది పద్దు.

Nuvvu Nenu Prema Today Episode June 6 2024  Episode 643 highlights
Nuvvu Nenu Prema Today Episode June 6 2024 Episode 643 highlights

ఇద్దరు ఆఫీసులో వర్క్ చేసుకుంటూ ఉంటారు. మూర్తి వచ్చి పద్మావతి ని అర్జెంటుగా బాస్ రమ్మంటున్నాడు రా అని అంటాడు దేనికి అని అంటుంది. ఏంటి మూర్తి గారు కోపంగా ఉన్నారు అని అంటే, నేనే కాదు బాస్ కూడా కోపంగా ఉన్నాడు అని అంటాడు మూర్తి. గాయత్రి బాస్ ఎందుకు రమ్మన్నాడు అని అడుగుతుంది పద్దు ఏమో నాకేం తెలుసు వెళ్ళు అని అంటుంది పద్దు విక్కీ కూడా ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటాడు. పద్మావతి యశోదర్ దగ్గరికి వెళుతుంది. సార్ రమ్మన్నారంట అని అంటుంది నేను మనిషిని ఈజీగా నమ్మేస్తాను పద్మావతి అని అంటాడు. అలాంటి నా నమ్మకాన్ని ఎవరైనా అలుసుగా తీసుకొని మోసం చేస్తే మాత్రం, నేను తట్టుకోలేను భరించలేను అని అంటాడు. ఈయన దేని గురించి మాట్లాడుతున్నాడు నేను విక్రమాదిత్య గారు పెళ్లి కాలేదని ఆయన అబద్ధం గురించి ఏమన్నా మాట్లాడుతున్నాడా అని మనసులో అనుకుంటుంది. చెప్పు పద్మావతి నువ్వు ఎందుకు అబద్దం ఆడావు అని అంటే పద్మావతి కన్ఫామ్ గా పెళ్లి గురించి అంటుంది అని అనుకుంటుంది. నీ నోటితో నువ్వు అబద్దాన్ని ఒప్పుకుంటే నేను నిన్ను క్షమించేస్తాను ఇప్పుడు కూడా నువ్వు నాతో అబద్ధం చెప్తే నేను భరించలేను అని అంటాడు. మేమిద్దరం భార్యాభర్తల అని చెప్పేస్తే అర్థం చేసుకునేలా ఉన్నాడు చెప్పేద్దామా అని అనుకుంటుంది పద్దు. సార్ అది నేను అని అంటూ ఉంటుంది. ఎలా చెప్పాలా అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో యశోదర్, చూసిన ప్రతి ఒక్కరు ఎవరి మోడల్ అని నాకు కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు నువ్వే మన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తాడు. అలాగే ఈ బ్లాంక్ చెక్ నీ దగ్గర ఉంచు నీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ రాసుకో అని అంటాడు. తర్వాత విక్కీ, పద్దు ఇద్దరు కాఫీ తాగుతూ ఉంటారు. ఆఫీసులో బాస్ ఏమన్నాడో ముందు అది చెప్పు అని అంటాడు విక్కీ. ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా నన్ను ఉండమంటున్నారు అని అంటుంది పద్దు. బ్లాంక్ చెక్కు ఆఫర్ చేశాడు అని అంటుంది. నువ్వేమన్నావు మరి అని అడుగుతాడు విక్కి పద్మావతి ఏమీ మాట్లాడదు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella