NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

Nuvvu Nenu Prema June 22 Episode 657

Nuvvu Nenu Prema:యశోదర్ ఆఫీస్ కి వచ్చిన మోడల్ చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది. తను పద్మావతిని ఇన్సల్ట్ చేస్తుంది అయినా విక్కీ మొదట మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు తర్వాత మోడలింగ్ కి సారీ కట్టుకొని రమ్మని చెప్తారు ఆ సారీ ని పద్మావతి ఇవ్వడంతో ఆమెకి పద్మావతికి మధ్య చిన్న గొడవ జరుగుతుంది. తరువాత అక్కడ పని చేసె వారితో కూడ గొడవపడుతుంది మోడల్ కసి చివరికి మోడల్ కసి చీర కట్టుకొని వస్తుంది ఇక ఫోటోషూట్ కి విక్కీ రెడీ అవుతాడు ఇక ఆమెని ఫొటోస్ తీసే బాధ్యత విక్కీ మీద ఉంటుంది. ఆమె చీర కట్టుకొని రాగానే చాలా బాగుంది కదా అని అంటాడుదామోదర్, ఆవిడ ఎక్కడ బాగుంది సార్ ఆవిడ కట్టుకున్న చీర బాగుంది కానీ ఆవిడ ఏమైనా బాగుందా అని అంటాడు విక్కీ నువ్వు ఇదే తగ్గించుకోవయ్యా మోడల్స్ ని పొగడాలి అంతేకానీ బాగా లేదంటే ఎలాగో అని అంటాడు ఇక ఫొటోస్ తీయడం మొదలు పెట్టు మళ్ళీ ఆవిడ కోపం వస్తుంది అని అంటాడు. విక్కీ మేడం స్టార్ట్ చేయమంటారా అని అంటాడు ఓకే అంటుంది మోడల్ కసి, అక్కడే ఉన్న పద్మావతి, గాయత్రి ఇక్కడ ఏ గొడవ జరగకుండా ఫోటో షూట్ అయిపోవాలి అని అనుకుంటారు.

Nuvvu Nenu Prema June 22 Episode 657
Nuvvu Nenu Prema June 22 Episode 657

ఇక మరోవైపు సుగుణ తన కొడుకు రూమ్ సర్దుతూ ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా వీడు మాత్రం రూమ్ నీటుగా పెట్టుకోడు. రేపు వచ్చే కోడలు ఎలా ఉంటుందో ఏంటో వీటితో అని అనుకుంటూ రూమ్ ని నీట్ గా చేస్తూ ఉంటుంది అప్పుడే సుగుణకి అసలు పద్మావతికి వీడు థాంక్స్ చెప్పాడా లేదా అని అనుమానం వస్తుంది. పద్మావతి నాకు చాలా హెల్ప్ చేసింది తన వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను అలాంటిది తనకి థాంక్స్ చెప్పాడో లేదో కనుక్కోవాలి అని అనుకుంటుంది. తన కొడుకు యశోదర్ కి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా ఫోన్ చేశావు అని అడుగుతాడు ఇంతకీ నువ్వు టిఫిన్ తిని టాబ్లెట్స్ వేసుకున్నావా లేదా అని అంటాడు టిఫిన్ అయితే తిన్నాను టాబ్లెట్స్ వేసుకోలేదు అని అంటుంది సుగుణ టిఫిన్ తినగానే వేసుకోమని చెప్పాను కదా అమ్మ అని అంటాడు. నాకు వయసు మీద పడి మతిమరుపు వచ్చింది నీకేమో వయసు అయిపోతుంది అదే కదా నా బాధ ఈ లోపు కోడలు పిల్లల్ని ఇంటికి తీసుకురావాలి కదా అని అంటుంది. మళ్లీ మొదలు పెట్టావా అని అంటాడు యశోదర్ ఇంకొకసారి ఈ మాట అన్నావంటే అక్కడికి వచ్చి కొడతాను అని అంటుంది సుగుణ. ఇంతకీ పద్మావతికి థాంక్స్ చెప్పావా అని అంటుంది ఆ మాటకి ఒకసారిగా యశోదర్ షాక్ అవుతాడు. నేను ప్రేమిస్తుంది పద్మావతి అనే విషయం ఎవరికీ తెలియదు కదా అమ్మకు ఎలా తెలిసింది అని అనుకుంటాడు. నేను కనీసం దామోదర్ దగ్గర కూడా అనలేదు కదా అని అనుకుంటాడు. నిన్నేరా అడుగుతుంది పద్మావతికి థాంక్స్ చెప్పావా అని అంటుంది అమ్మ అది మరీ అని అంటూ ఉంటే అదే రా నన్ను కాపాడింది కదా అందుకు తనకి థాంక్స్ చెప్పావా ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే ప్రాణాలతో అది పద్మావతి పెట్టిన బిక్షేరా అని అంటుంది.

Nuvvu Nenu Prema June 22 Episode 657
Nuvvu Nenu Prema June 22 Episode 657

ఇక సుగుణ అన్న మాటలకి యశోదరికి తను ప్రేమిస్తున్నది పద్మావతిని అన్న విషయం అమ్మకు తెలియలేదు తనని కాపాడింది కాబట్టి థాంక్స్ చెప్పమంటుంది అని అనుకుంటాడు. థాంక్స్ చెప్పానమ్మా అని అంటాడు నమ్మమంటావా అని అంటుంది. నన్ను నమ్మవా అమ్మ అని అంటాడు. సరే రా థాంక్స్ చెప్పావు కదా ఒకసారి పద్మావతిని మనింటికి తీసుకొని రా తననిమన ఇంటికి నువ్వు తీసుకొని వస్తే నేను తనకి బట్టలు పెట్టినాకు తను చేసిన హెల్ప్ కి నేను ఏదో ఒకటి చేస్తాను అని అంటుంది. సరే అమ్మ అడుగుతాను అని అంటాడు అడగడం కాదు పద్మావతిని ఇంటికి తీసుకురావాలి అని అంటుంది అది నా కోరిక అని అంటుంది సరే అంటాడు యశోదర్.మరోవైపు ఫొటోస్ తీసుకుంటే విక్కీ మోడల్ సహకరించుడు నేను ఇలానే ఫొటోస్ తీయించుకుంటాను నువ్వు ఇలానే తీయాలి అని అంటుంది దానికి విక్కీకి కోపం వస్తుంది ఒకసారిగా కోపంగా పిఏ వైపు చూస్తాడు. చూడు దుమ్ము కాస్త కోపం తగ్గించుకోవాలి ఈ ఫొటోస్ షూట్ మన కంపెనీకి ఎంత ఇంపార్టెంట్ తెలుసు కదా అప్పుడు చెప్పినట్టు తీయచ్చు కదా అని అంటాడు. అలా ఎలా తీస్తానండి ఇదేమైనా పర్సనల్ ఫోటో చూద్దాం కంపెనీ కోసం తీసేది అని అంటాడు. ప్లీజ్ విక్కీ అని పి ఏ బతిమిలాడతాడు. మోడల్ కూడా పీఏ నేను అసలు చెప్పి ఫొటోస్షూట్ ని ఆగిపోకుండా చేస్తాడు.మోడల్ నడుం మీదటాటో విక్కీ ఫొటోస్ తీసేటప్పుడు కనిపిస్తుంది అలా కనిపించడం బాగోదని పద్మావతిని పిలిచి తన చీర సరి చేయమని చెప్తాడు విక్కీ.పద్మావతి మోడల్ దగ్గరికి వెళ్లి చీర సరిచేస్తుంది దానికి మోడల్ క సి కి కోపం వస్తుంది. చెప్తా నీ సంగతిఅని కావాలని పద్మావతి ఎదురుగా తన చెప్పు వ్యతిరేకి ఆ చెప్పు ని తీసుకొచ్చి తన కాలికి తొడగమని చెప్తుంది.వెంటనే విక్కీకి చాలా కోపం వస్తుంది.

Nuvvu Nenu Prema June 22 Episode 657
Nuvvu Nenu Prema June 22 Episode 657

పద్మావతికి విక్కీ ఎక్కడ కనక గొడవపడతాడు అని భయపడుతుంది అప్పటికే పద్మావతినిరిక్వెస్ట్ చేసి ఉంటాడు ఈ ఫోటో షూట్ ఎలా జరుగుతుందో అని నాకు భయంగా ఉంది పద్మావతి అని అంటే అదేం లేదు సార్ మీకు ఎందుకు నేనున్నాను కదా ఈ ఫోటో షూట్ ఎలాగైనా ఆగకుండా చేస్తానని పద్మావతి మాట ఇస్తుంది అది గుర్తు చేసుకొని ఎలాగైనా వ్యక్తికి కోపం రాకుండా చేయాలి అని మోడల్ కికాలికి చెప్పు తొడగడానికి సిద్ధపడుతుంది పద్మావతి.విక్కీ ఒకసారిగా పద్మావతి అని అరుస్తాడు దానికి పద్మావతి ఆగిపోతుంది.నువ్వేం చేస్తున్నావ్ అర్థం అవుతుందా అని అంటాడు. పద్మావతి సైలెంట్ గా పక్కకు వెళుతుంది. విక్కీ మోడల్ దగ్గరికి వెళ్లి నువ్వు చేస్తున్న పని గురించి ఎన్నికైన తెలుస్తుందా ఒక ఆడపిల్లని అవమానిస్తావా అని అంటాడు. అవును నా చీర సరి చేసినప్పుడు నా చెప్పు కూడా తనే సరి చేయాలి కదా అని అంటుంది మోడల్ చాలా పొగరుగా, ఆ మాటలకి విక్కీ కోపంతో ఆమె చంప మీద కొడతాడు అక్కడితో గొడవ పెద్దదవుతుంది ఏమో అని కంగారు పడుతూ ఉంటాడు పిఏ దామోదర్. అప్పుడే మోడల్ యశోదర్ అని పిలుస్తుంది. యశోద బయటికి వచ్చి చూసి ఏం జరిగింది అని అడుగుతాడు. ఇలాంటి వాళ్ళను నువ్వు పనిలో పెట్టుకున్నావా నన్ను ఈ విక్కీ కొట్టాడు అని అంటుంది. విక్కీ ఈ ఫోటో షూట్ ఎంత ఇంపార్టెంట్ నీకు తెలియదా అని అంటాడు యశోదర్. తెలుసు సార్ అయినా ఈవిడ చేసే పని నాకు నచ్చలేదు పద్మావతిని అవమానించింది అని అంటాడు విక్కీ వెంటనే పీఏ పద్మావతిని అవమానిస్తే నీకేమైంది ఇక్కడున్న మేము అందరికీ కోపం రాలేదు కదా నీకు మాత్రమే ఎందుకు కోపం వచ్చింది అని అంటాడు. ఆ మాటలకి పద్మావతి నా భార్య తనని ఎవరైనా అంటే నాకే కోపం వస్తుంది తనని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే వాళ్ళని కొట్టాలని నాకే అనిపిస్తుంది అని అంటాడు విక్కీ ఆ మాటలకు యశోదర్ ఆశ్చర్యపోతాడు. నా ఆఫీస్ లో మీరిద్దరూ నన్ను మోసం మోసం చేశారు గెటవుట్ అని యశోదర్ అరుస్తాడు. ఇద్దరినీ ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు.

Nuvvu Nenu Prema June 22 Episode 657
Nuvvu Nenu Prema June 22 Episode 657

ఇక ఒకసారి గా విక్కీ తన కలలో నుంచి బయటికి వస్తాడు. యశోదర్ తో తను చెప్పిన మాటలన్నీ విక్కీ కలగంటాడు. అప్పుడే యశోద అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు. విక్కీ సార్ ఈమె పద్మావతిని బాధ పెట్టింది పద్మావతి కూడా ఒక ఆడపిల్లే కదా అలాంటిది ఈమె మోడల్ అన్న పొగరుతో పద్మావతిని ఇన్సల్ట్ చేసింది నాకు నచ్చలేదు కొట్టాను అని అంటాడు. ఈమె ఇక్కడ ఇలా బిహేవ్ చేస్తే రేపొద్దున ఇంకొక చోటికి వెళ్లి అక్కడ కూడా ఇలానే ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతుంది కదా అది తలుచుకునే కొట్టాను అని అంటాడు విక్కీ ఈ ఫోటో షూట్ ఎంత ఇంపార్టెంట్ నాకు తెలుసు సార్ కానీ తప్పలేదు, మనం సారీస్ ని డిజైన్ చేసేది ఒక ఆడపిల్లల కోసం అలాంటిది ఆడపిల్లలకి ఇక్కడ అవమానం జరుగుతుంటే నేను చూస్తూ భరించలేకపోయాను నన్ను క్షమించండి దీనికి మీరు ఏ యాక్షన్ తీసుకున్నా నేను సిద్ధంగా ఉన్నాను అని వీక్లీ పక్కకు వెళ్ళిపోతాడు. యశోదర్ కి కూడా పద్మావతిని ఇన్సల్ట్ చేసింది కాబట్టి విక్కీ కొట్టాడు అని అర్థమవుతుంది.

Nuvvu Nenu Prema June 22 Episode 657
Nuvvu Nenu Prema June 22 Episode 657

ఇక మరోవైపు కుచల నారాయణ తో వ్రతం చేస్తాను అని చెప్పి మధ్యాహ్నం పూట నారాయణ నిద్రపోతూ ఉంటే కుచల మంచం చుట్టూ తిరుగుతూ ఉంటుంది నారాయణకి మెలకువ వచ్చి ఏం చేస్తున్నావే అని అంటే ఇదే నారు వ్రతం అంటే అని అంటుంది ఇలా మధ్యాహ్నం పూట మంచం చుట్టూ తిరగడం ఏంటే అని అంటాడు నారాయణ అలా అనకూడదు మన ఆస్తి మనకు రావాలంటే నేను ఈ వ్రతం చేసి మన ఆస్తి మొత్తం మనకి వడ్డీతో సహా తీసుకొస్తాను అని అంటుంది.ఆ మాటలకి నారాయణ వద్దే ఆస్తి పోతే పోయింది మనుషులు ప్రాణాలతో ఉన్నాం అంత బడికి చాలు నువ్వు ఇప్పుడు ఈ వ్రతాలు చేసి నా ప్రాణం తీయద్దు అని అంటాడు. అవే మాటలునారు నేను శుభమా అని వ్రతం మొదలు పెడితే నువ్వు అలా మాట్లాడతావు అని అంటుంది కుచుల. ఈ వ్రతాలు అవి నీకు సెట్ కావు వదిలేసేయ్ అని అంటాడు నారాయణ లేదు నేను పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఎలాగైనా మన ఆస్తి వచ్చేవరకు 11 రోజులు ఈ వ్రతం చేసి తీరతాను అని శపధం చేస్తుంది. ఇప్పుడు హారతి తీసుకో నారు అని ఇస్తుంది. ఆ హారతికి నారాయణ ఫేస్ అంతా నల్లగా మసిపడుతుంది ఏం చేసావే నన్ను అని అంటాడు ఇప్పుడే నీ ఫేస్ నీ తెల్లగా మార్చేస్తాను అని తన దగ్గర ఉన్నవిభూతిని నారాయణ ముఖం మీద రాస్తుంది దాంతో నారాయణ ఏం చేశావు అని అంటే నీకు విభూతి ప్యాక్ వేశాను అని అంటుంది. ఇకనుంచి అర్జెంట్గా వెళ్ళిపో అని అరుస్తాడు నారాయణ. కుచల వెళ్లిపోయిన తర్వాత నారాయణ ఫేస్ చూసుకొని అమ్మో అని భయపడతాడు.పద్మావతి ఆఫీస్ లో విక్కీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే గాయత్రీ కూడా విక్కీ ని పొగుడుతుంది.పద్మావతి గాయత్రీ ని కోపంగా చూస్తుంది ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్తుంది అప్పటికే సుగుణ భరతనాట్యం చేస్తూ ఉంటుంది. పద్మావతి కూడా ఆ మ్యూజిక్ కి తను కూడా సుగుణతో పాటు డాన్స్ చేయాలి అనిపిస్తుంది. వెంటనే సుగుణతో చేరి తను భరతనాట్యం చేస్తూ ఉంటుంది అదంతా పైనుంచి యశోదర్ చూస్తూ ఉంటాడు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella

Krishna Mukunda Murari June 06 Episode 489: శ్రీనివాస్ ని కలిసిన కృష్ణ.. మురారిని దాచింది ముకుంద అన్న నిజం కృష్ణకి తెలియనుందా? రేపటి ట్విస్ట్ ..

bharani jella