NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

Brahmamudi Today Episode June 6 2024 Episode 428 highlights

BrahmaMudi:కావ్య అప్పు ఇద్దరూ బస్తీలో వెతుకుతూ ఉంటే రాజ్ వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఉంటాడు ఇక కొంతసేపటికి కావ్య అప్పుతో మీ బావగారి ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు నువ్ వెళ్లి ఆ మాయ ఇంటిదగ్గర ఎదురుచూడు నేను కారులో అక్కడికి వస్తాను నువ్వు వెళ్ళు అని అంటుంది సరే అని అప్పు వెళ్ళిపోతుంది. కావ్య రాజ్ దగ్గరికి వెళ్తుంది. నేను ఇక్కడే కాకరకాయలు కొన్నానండి ఈరోజు కూడా ఇక్కడే కొందామని అప్పు అని పిలిచాను. మా అమ్మకి ఇక్కడ కాకరకాయలు చాలా ఇష్టమట అందుకని అప్పు ఇచ్చి పంపిద్దాం అనుకుంటే వాడు రేటు చాలా చెప్పాడు వద్దని చెప్పాను అప్పు వెళ్లిపోయింది అని అంటుంది. నువ్వు చెప్పేది అబద్ధం అని నాకు కూడా తెలిసే మూడు కిలోమీటర్లు తిప్పావు దాహం వేస్తే నీళ్లు తాగడానికి కూడా డబ్బులు లేక అల్లాడిపోయాను. అని అంటాడు రాజ్ మరలాంటప్పుడు మా వెనక ఎందుకు తిరిగారు అని అడుగుతుంది కావ్య. నువ్వేదో చేసేస్తాను పొడి చేస్తాను అని ఇంటి దగ్గర చెప్పొచ్చావు కదా ఇక్కడ ఏం తదినం చేస్తావు అని నిన్నే ఫాలో అవుతూ వచ్చాను అని అంటాడు రాజ్ అందుకేనండి ఇలా వీధి వీధి తిరుగుతున్నాను. కానీ నాకు ఏ ఆధారం దొరకలేదు గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తే మనకి అనుకున్నది జరుగుతుందిట నేను గుడి దగ్గరికి వెళ్తున్నాను మీరు రండి వెళ్దాము అని అంటుంది. అమ్మ తల్లి నువ్వు వెళ్ళు నేను సైలెంట్ గా ఇంటికి వెళ్లి వైలెంట్ గా ఏడుస్తాను అని అంటాడు. రాజ్ వెళ్లిపోతాడు ఇక కావ్య అప్పు దగ్గరికి వెళ్తుంది.

Brahmamudi Today Episode June 6 2024 Episode 428 highlights
Brahmamudi Today Episode June 6 2024 Episode 428 highlights

ఇక మరోవైపు అనామిక ఎవరికి తెలియకుండా కళ్యాణ్ చెక్కు దొంగతనం చేసి దానిమీద పది లక్షలు రాసుకొని వాళ్ళ నాన్న పేరు రాసి ఎవరికి తెలియకుండా డ్రైవర్ కి ఇచ్చి పంపించడానికి బయటికి వచ్చి ఉంటుంది. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఇంకా డ్రైవర్ రాలేదేంటి అని అడిగితే నువ్వు కంగారు పడకు డ్రైవర్ వచ్చేస్తున్నాడు ఇంకో పది నిమిషాల్లో నీ ముందు ఉంటాడు అని చెప్తుంది. నేను ఇక్కడ ఎంతసేపు ఉండాలి ఎవరైనా చూస్తారేమో అని నాకు భయంగా ఉంది అని అంటుంది అనామిక నువ్వేం భయపడకు వచ్చేసాడు అని పెట్టేస్తుంది అనామిక తల్లి. అనామిక ఫోన్ మాట్లాడి పక్కన తిరిగేసరికి స్వప్న ఉంటుంది. స్వప్నం చూసి అనామిక షాక్ అవుతుంది. స్వప్న అనామికతో ఎవరైనా చూస్తారేమోనని కంగారు పడుతున్నావా అని అంటుంది. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడిగితే నేను ఎక్కడైనా ఉంటాను అని అంటుంది స్వప్న. నువ్వు చేసే బాగోతం ఎవరైనా చూస్తారు ఏమో అని కంగారు పడుతున్నావు కదా అని అంటుంది.అమ్మ దీనికి నా గురించి తెలిసినట్టుంది ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం నేను దీంతో జాగ్రత్తగా ఉండాలి అని స్వప్న కి తెలియకుండా చెక్ ని గట్టిగా దాచేస్తుంది. ఏంటి వెనకాలేదో దాచి పెడుతున్నావ్ అని అడుగుతుంది స్వప్న. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని అంటుంది అనామిక నువ్వు ఇంగ్లీష్ లోకి వస్తే నేను తెలుగులో కుస్తాను, వినితట్టుకునే శక్తి నీకు లేదు అని అంటుంది స్వప్న. నన్ను వదిలి ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంది అనామిక నేనేంటి కళ్యాణి నిన్ను వదిలేశాడు అని అంటుంది స్వప్న. నాకు నీ మీద అనుమానంగా ఉంది అందుకే నీ వెనకే ఫాలో అవుతూ నీ డిటెక్టివ్ లా నీ వెంట పడ్డాను. అదేంటో తేల్చుకునేదాకా ఇకనుంచి వెళ్ళను గా అని అంటుంది స్వప్న.

Brahmamudi Today Episode June 6 2024 Episode 428 highlights
Brahmamudi Today Episode June 6 2024 Episode 428 highlights

ఇక అనమికా కంగారుగా ఉంటుంది స్వప్న అనామిక దగ్గరికి వెళ్లి వెనకాల ఏమి దాచావో చూపించు అని అంటుంది. నామిక ఏమీ లేదు అని అంటుంది కానీ స్వప్న వదలకుండా చెయ్యి పట్టుకొని అనామిక దగ్గర లాక్కుంటుంది. ఆ చెట్ చూసి దీని మీద నీ బాబు పేరు ఉంది అంటే ఇక్కడ నుంచి నీ బాబుకి డబ్బులు చేరేస్తున్నావా ఈ డబ్బు కళ్యాణ్ ని అడిగే తీసుకున్నావా మీ అత్త మామని అడిగి తీసుకున్నావా అని అంటుంది. అనామిక ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది నువ్వు మా అమ్మని అప్పు ని కావ్య ని ఎన్ని మాటలు అన్నావో కావ్యం ఎంత ఇబ్బంది పెట్టావో నాకు తెలియదా ఎప్పుడో నీ మీద పగ తీర్చుకుందాం అనుకుంటున్నాను కరెక్ట్ గా టయానికి దొరికావే పదా నీ గురించి ఇంట్లో అందరి ముందు పంచాయతీ పెడతాను అని ఇంట్లోకి బలవంతంగా తీసుకువెళ్తుంది. అపు నీ లోపలికి తీసుకువస్తుంటే అపర్ణ అప్పుడే రూమ్ లో నుంచి బయటికి వస్తుంది అక్కడే ఇందిరాదేవి కూడా ఉంటుంది ఏంటి స్వప్న నువ్వు అలా అనామిక లాక్కొస్తున్నావ్ అని అడుగుతుంది అపర్ణ. ఇంటి దొంగని ఇలానే తీసుకొస్తారు అని అంటుంది స్వప్న ఏంటమ్మా ఇంటి కోడల్ని అంత మాట అంటున్నావు అని అంటుంది ఇందిరా దేవి. ఇది చూస్తే నేను చెప్పింది కరెక్ట్ కాదు మీకు అర్థమవుతుంది అని చెక్కును చూపిస్తుంది. అపర్ణ చెప్పింది చూసి షాక్ అవుతుంది. ఇందిరా దేవి కూడా చూసి ఆశ్చర్య పోతుంది ఇక దాంతో ఏం జరిగిందో చెప్తుంది స్వప్న. ఇన్ని రోజులు మా కావ్య అత్తారింటి నుంచి పుట్టింటికి డబ్బు చేరేస్తుంది అని ఆడిపోసుకున్నారు మరి ఇప్పుడు ఈ అనామిక చేసింది ఏంటి అని అంటుంది స్వప్న. మా కావ్య పుట్టింటికి ఏరోజు డబ్బులు పంపించలేదు బొమ్మలు చేసి ఆర్డర్ పూర్తి చేసి మా ఇంటి వాళ్లకి సహాయం చేసింది రాజు కూడా సహాయం చేస్తానంటే ఒక్క రూపాయి కూడా మాకు అవసరం లేదు అని తను ఓన్లీ ఆర్డర్ తీసుకొని వాళ్లకి హెల్ప్ చేసిందే కానీ డబ్బులు చేర వేయలేదు అలాంటిది అనామిక ఏం చేసిందో ఇప్పుడు మీకు అర్థమైంది కదా అని అంటుంది స్వప్న. మేము పేదింటి వాళ్ళం కావచ్చు కానీ ఏ రోజు కూడా మా క్యారెక్టర్ ని మాత్రం మేము మర్చిపోలేదు అని అంటుంది. ఈ అనామిక గొప్పింటి నుంచి వచ్చింది వీళ్ళ అత్త ఎంత గొప్ప చెప్పుకుంటుందో మీ అందరికీ తెలుసు కదా అలాంటిది ఈమె క్యారెక్టర్ ఏంటో మీకు ఇప్పటికీ అర్థమైంది అనుకుంటా అని అంటుంది. ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారు అని అడుగుతుంది స్వప్న.

Brahmamudi Today Episode June 6 2024 Episode 428 highlights
Brahmamudi Today Episode June 6 2024 Episode 428 highlights

ఇక ఆపన్న మాట్లాడుతూ నీకు అవసరం ఉంటే ఇంట్లో వాళ్లకి చెప్పి తీసుకోవాలి అంతేకానీ ఇలా ఎవరికి తెలియకుండా డబ్బులు మీ పుట్టింటికి చేరవేయడం ఏంటి అని అంటుంది. ఇలాంటి పని చేయడం నీకు అసలు పద్ధతేనా అని ఇందిరా దేవి అడుగుతుంది ఇది కళ్యాణ్ ముందే తెచ్చుకోవాలి అని అపర్ణ అంటుంది. అప్పుడే స్వప్న కళ్యాణి పిలుస్తుంది కళ్యాణ్ కి ఎందుకు వచ్చి ఏంటి స్వప్న పిలిచావు అని అంటే మీ పెద్దమ్మ మిమ్మల్ని పిలుస్తుంది అని అంటుంది. ఏంటి పెద్దమ్మ చెప్పండి అని అంటాడు కళ్యాణ్ ఈ చెక్కు నువ్వే ఇచ్చావా అని అడుగుతుంది. ఆ చెక్ చూసి కళ్యాణ్ షాక్ అవుతాడు ఆ చెక్కు మీద సంతకం నాదే కానీ పైన అనామిక తండ్రి పేరు ఎవరు రాశారో నాకు తెలియదు అని అంటాడు. అయితే ఈ చెక్ ని నువ్వు రాసి ఇవ్వలేదా అని అడుగుతుంది అపర్ణ ఇది అకౌంటెంట్ సంపత్రికి ఇవ్వాలని నేనే సంతకం చేసి అక్కడ పెట్టాను నీ భార్య నీకు తెలియకుండా చెక్కును దొంగతనం చేసి వాళ్ళని ఆనపైన రాసి వాళ్ళ ఇంటికి పంపిస్తుంది అని అంటుంది స్వప్న. ఆ మాటలకు కళ్యాణ్ షాక్ అవుతాడు భార్య దగ్గరికి వెళ్లి ఏంటి ఈ పని అని అడుగుతాడు. నువ్వు మనిషివి కాలేదు కదా అని నన్ను కూడా మనిషిగా గుర్తించలేదా నీకు కష్టం వస్తే నేను ఆదుకోనా ఇలా దానివి అయ్యుండి ఇలాంటి పని చేస్తావా అని అంటాడు. అప్పుడే స్వప్న అసలు అనామికని అనడం కాదు కూతురి తో ఇలా సిగ్గులేని పని చేయించిన ఆ తల్లిదండ్రులని అనాలి అని అంటుంది. అప్పుడే స్వప్న అని దానిలక్ష్మి ఎంట్రీ ఇస్తుంది. ఏం హక్కు ఉందని నా కోడలు మీద అరుస్తున్నావ్ అని అంటుంది ధాన్యం దొంగని దొంగే అంటారు పోలీస్ అని అనరు అంటుంది ధాన్యం. కోడల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది ధాన్యం. నీకేం హక్కు ఉందని నువ్వు ఎవరని దుగ్గిరాల ఇంటి కోడలు నిలదీస్తున్నావు అని అడుగుతుంది. అయితే స్వప్న అన్న మాటలు పక్కన పెట్టు ఈ ఇంటి పెద్ద ఇక్కడే ఉంది నేను అడుగుతున్నాను ఏంటి ఈ పని అంటుంది అపర్ణ. ఆమె ఎందుకు తీసుకెళ్లి పుట్టింటికి పంపించాలనుకుంటుందో చెప్పమను అని అంటుంది అపర్ణ. అయితే అందరూ కలిసి ఇంటికోడలిని దొంగలు చేస్తారా అంటుంది ఏం జరిగిందో తెలియకుండా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అంటుంది ధాన్యం. ఏం జరిగిందో నువ్వు చెప్పు అని అంటుంది ఇందిరా దేవి.

Brahmamudi Today Episode June 6 2024 Episode 428 highlights
Brahmamudi Today Episode June 6 2024 Episode 428 highlights

ఇక ధాన్యం అక్కడ అందరి ముందు అనామిక పరువు పోతుందని తన పరువు పోకుండా ఉండడానికి అబద్ధం చెప్తుంది. ఆ చెక్ అనామిక తీసుకోలేదు నేనే అనామికకి ఇచ్చాను అని చెప్తుంది దాంతో అందరూ షాక్ అవుతారు. అవును నేనే అనామిక వాళ్ళ ఇంట్లో వాళ్లకి అవసరం అని డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నారని తెలిసి నన్ను అడిగింది నేను అప్పుడే కళ్యాణ్ నాకు చెక్కించిన విషయం గుర్తుకు వచ్చి ఆ చెట్టు నేనే అనామికకు ఇచ్చాను అనామిక వాళ్ళ ఇంటికి పంపించింది ఇందులో తను తప్పేం లేదు అని అంటుంది. ఆ మాటలు అనామిక కూడా అర్థం కాదు అనామిక కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే కళ్యాణ్ అవును ఇదంతా బానే ఉంది నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కానీ నేను ఎదురుపడినప్పుడు నాతో చెప్పకుండా కంగారు కంగారుగా ఎందుకు వెళ్లిపోయిందో అని అంటాడు. ఆ మాటలకి ధాన్యం అబద్ధం చెప్తుంది అన్న విషయం అక్కడున్న వాళ్లకు కూడా అర్థమైంది. స్వప్న మీరు బాగా వెనకేసుకొస్తున్నారు రేపొద్దున మీ నగలు కూడా ఇంటికి చేరవేస్తుంది జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోతుంది. ఇక అందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు అనామిక వైపు కోపంగా చూస్తుంది ధాన్యం. అనామిక తప్పు చేశానన్న భావంతో లోపలికి వెళ్ళిపోతుంది.

Brahmamudi Today Episode June 6 2024 Episode 428 highlights
Brahmamudi Today Episode June 6 2024 Episode 428 highlights

ఇక మరోవైపు అప్పు కావ్య ఇద్దరు నిజమైన మా ఇంటికి వెళ్తారు మాయ రాలేదా అని అక్కడ ఉన్న అమ్మాయిని అడుగుతారు ఇంకా రాలేదు అని అంటుంది. మాయలోపల పెట్టి అబద్ధం చెప్తున్నావా అని అడుగుతుంది. కానీ సాహితి అసలు మాయ రాలేదు అని చెప్తున్నాను కదా అని అంటుంది అప్పుడే అప్పు సాహితీ తో గొడవ పడాలని చూస్తుంది ఇంతలో మాయ వస్తుంది. మాయని చూసి అప్పు కావ్యా ఇద్దరు ఆశ్చర్యంతో అలానే ఉండిపోతారు.కావ్య అనుమానంగా ఈ అమ్మాయే మాయ అంటావా అని అప్పుతో అంటుంది.ఏమో అక్క అని అంటుంది అప్పు అప్పుడే కావిని గుర్తుపట్టి మాయ కావ్యా అని పిలుస్తుంది నేనెవరో తెలిసిపోయింది అంటే ఇక పరిచయాల అవసరం లేదు నువ్వే మాయ అని నాకు అర్థమైంది మర్యాదగా నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు ఇక్కడ చెప్పడం కాదు మా ఇంటికి వచ్చి కూడా చెప్పాలి అని కావ్య ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేసరికి మాయా సూటికేసి వదిలేసి అక్కడ నుంచి పారిపోవాలని చూస్తుంది ఇదంతా రుద్రాణి కూడా గమనిస్తుంది ఇది కావ్యని చూసి పారిపోయింది అంటే కచ్చితంగా నిజమైన మాయ ఇదే ఇప్పుడు ఈ మాయ కావ్యకి దొరక్కుండా నేనే చేయాలి అని కంగారు గారు రుద్ర నీ కారులో బయలుదేరి నిజమైన మాయని యాక్సిడెంట్ చేస్తుంది. దాంతో మాయ అక్కడే పడిపోతుంది ఇక అప్పు కావ్య ఇద్దరు మాయని లేపుతూ ఉంటారు.

రేపటి ఎపిసోడ్ లో మాయా హాస్పిటల్ లో ఉంటుంది. అప్పు కావ్య ఇద్దరు బయట కూర్చుని బాధపడుతూ ఉంటారు. పోనీలే అక్క నీకు చేసిన అన్యాయానికి దేవుడు ఆ మాయకి సరైన శిక్ష వేశాడు అని అంటుంది అప్పు. శిక్ష వేసింది మాయకి కాదు నాకు అని అంటుంది కావ్య. ఆ మాయ లేచి నిజం చెప్పకపోతే ఆ దొంగ మామయ్యకి ఇచ్చి మా అత్త మా ఆయనతో పెళ్లి చేస్తుంది. నా దగ్గర ఉన్న ఏకైక సాక్ష్యం ఈ మాయ మాత్రమే ఇప్పుడు ఈమె కళ్ళు తెరవకపోతే నాకున్న అన్ని దారులు మూసుకుపోయినట్టే అని అంటుంది. అప్పుడే డాక్టర్ గారు బయటకు వస్తారు మాయకు ఎలా ఉంది అని అడుగుతుంది కావ్య తను కొంచెం సీరియస్ కండిషన్లోనే ఉంది ఏ విషయం చెప్పలేము అని అంటుంది డాక్టర్. చూడాలి రేపు కావ్య రాజ్ చిత్రాల పెళ్లి ఎలా ఆపుతుందో.. అసలు ఈ మాయ కోమాలో నుంచి బయటకు వస్తుందో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Krishna Mukunda Murari June 06 Episode 489: శ్రీనివాస్ ని కలిసిన కృష్ణ.. మురారిని దాచింది ముకుంద అన్న నిజం కృష్ణకి తెలియనుందా? రేపటి ట్విస్ట్ ..

bharani jella