Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. కృతి శెట్టి, శ్రీలీల, సంయుక్త మీనన్ వంటి కొత్త భామలు ఎంత మంది వచ్చినా కూడా రష్మిక జోరుకు ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గత ఏడాది యానిమల్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్ హిట్ ను ఖాతాలో వేసుకున్న రష్మిక.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జోడిగా `పుష్ప 2 ది రూల్` చేస్తోంది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదల కాబోతోంది.
అలాగే శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న కుబేర చిత్రంలో ధనుష్ సరసన రష్మిక నటిస్తోంది. మరోవైపు రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ తో సహా మరికొన్ని చిత్రాల్లో భాగమైంది. అయితే తాజాగా రష్మిక చెంతకు మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చిందట. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, ప్రముఖ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 31` వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే వీరి కాంబో ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం రష్మిక మందన్నాను తీసుకోవాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. ఇందులో భాగంగానే ఆమెతో సంప్రదింపులు కూడా జరపారట. స్టోరీ విన్న రష్మిక ఎన్టీఆర్ తో నటించేందుకు వెంటనే ఓకే చెప్పిందట. కానీ చివర్లో రెండు షాపింగ్ కండిషన్స్ పెట్టిందని ఇండస్ట్రీ వర్గల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
మొదట కండిషన్ ఏంటంటే.. ఎన్టీఆర్ 31 చిత్రంలో తాను డీగ్లామర్ రోల్ అయితే చేయనని చెప్పిందట. ఆల్రెడీ సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప సినిమాలో రష్మిక డీ గ్లామర్ పాత్రలోనే నటించింది. మరోసారి అటువంటి రోల్ లో కనిపిస్తే ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతారని రష్మిక భావిస్తుందట. అందుకే డీ గ్లామర్ పాత్ర అయితే తాను చేయనని చెప్పిందట. ఇక మరొక కండిషన్ ఏంటంటే.. ఎన్టీఆర్ మూవీ కోసం అక్షరాల రూ. 7 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.
ఏడు కోట్ల రూపాయిలు ఇస్తేనే ప్రాజెక్ట్ పై సైన్ చేస్తానని చెప్పిందట. నిజానికి ఇప్పటివరకు రష్మిక రెమ్యునరేషన్ రూ. 5 కోట్ల కంటే లోపే ఉంది. కానీ ఒక్కసారిగా అంత భారీ రెమ్యునరేషన్ అడగడంతో నిర్మాతలు ఆలోచనలు పడ్డారట. ఇక ఈ విషయం తాజాగా బయటకు రావడంతో సినీ ప్రియులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా అని రష్మికపై సెటైర్లు పేలుస్తున్నారు.