NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

త్రిబుల్ ఆర్ అంటూ గత ఐదు సంవత్సరాలుగా సోషల్ మీడియాలో నరసాపురం మాజీ ఎంపీ కనుమూరు రఘురాం కృష్ణంరాజు ఏ స్థాయిలో హల్చల్ చేశారు ? ఎలా వైరల్ అయ్యారు చూశాం. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న రఘురామ ఎన్నికల ముందు చివరి క్షణంలో వైసీపీ కండువా కప్పుకుని నరసాపురం పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు ఎంపీగా గెలిచిన ఏడాది వరకు రఘురామ వైసీపీ అధిష్టానంతో సన్నిహితంగా ఉన్నారు. అయితే ఏడాదికే ఆయన జగన్‌ను విభేదించి పార్టీకి దూరం అయ్యారు. ఆ తర్వాత పార్టీ కూడా రఘురామును పట్టించుకోవడం మానేసింది.

earth on the seat of Raghurama.
earth on the seat of Raghurama.

నాలుగేళ్ల పాటు ఢిల్లీలో ఉంటూ రచ్చబండ పేరుతో జగన్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ నానా రచ్చ రచ్చ చేశారు. ఆ తర్వాత ఆయన టిడిపి – జనసేనకు బాగా దగ్గరయ్యారు. ప్రతిపక్షానికి అధికార పార్టీ ఎంపీ విమర్శలు చేయడం కూడా రాజకీయంగా లాభంగా మారింది. దీంతో ఆయనకు విప‌క్ష కూటమి నుంచి మంచి ప్రోత్సాహం దక్కింది. చివరకు రఘురామ అరెస్టు తదనంతర పరిణామాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి పెంచేలా చేశాయి. ఇప్పుడు రఘురామ టిడిపి – జనసేనతో పాటు బిజెపికి కూడా సహితంగా ఉంటున్నారు. మూడు పార్టీలతోనూ సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. రఘురామ‌ కూడా తాను వచ్చే ఎన్నికలలో నరసాపురం ఎంపీగానే పోటీ చేస్తాను అని.. అది కూడా కూటమి తరపున పోటీ చేస్తాను అంటున్నా అది ఏ పార్టీ అన్నది క్లారిటీ ఇవ్వటం లేదు.

టిడిపి అధినేత చంద్రబాబు ఆయనకు నరసాపురం టికెట్ ఇస్తారు అని నిన్నటి వరకు ప్రచారం జరిగింది. దానికి జనసేన కూడా ఓకే చెప్పింది అని చెప్పుకున్నారు. ఇటీవల తాడేపల్లిగూడెం సభలో కూడా రఘురామ తాను మళ్ళీ నరసాపురం ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. పొత్తులో బిజెపికి నరసాపురం ఎంపీ టికెట్ ఇస్తే ఆయన బిజెపి తరఫున పోటీ చేయవచ్చని అంటున్నారు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. మెగా బ్రదర్ నాగబాబు గత ఎన్నికలలో నరసాపురం నుంచి పార్లమెంటుకు పోటీచేసి ఓడిపోయినా ఏకంగా 2,70,000 ఓట్లు తెచ్చుకున్నారు. ఈసారి పొత్తులో భాగంగా నాగబాబు ఎలాగైనా ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్లాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

పవన్ కూడా తన అన్న పార్టీ కోసం చేసిన సేవలు.. ఐదేళ్లపాటు పడిన కష్టం గుర్తించి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. తొలి జాబితాలో అనకాపల్లి అసెంబ్లీ టిక్కెట్ జనసేనకు ఇచ్చారు. నాగబాబు ముందుగా అనకాపల్లి నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని అనుకున్నారు. అయితే అక్కడ తెలుగుదేశం నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. అనకాపల్లి అసెంబ్లీతో పాటు పార్లమెంటు సీటు రెండు జనసేనకు ఎలా ? ఇస్తారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.

అనకాపల్లి ఎంపీ టికెట్ ని టిడిపికి ఇచ్చేసి నరసాపురం నుంచి పోటీ చేసేందుకు జనసేన సిద్ధపడుతుందని అంటున్నారు. పొత్తులో భాగంగా నరసాపురం నుంచి నాగబాబు పోటీ చేస్తే భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయం. వాస్తవానికి ఇక్కడ జనసేనకు సంస్థగతంగా మంచి బలం ఉంది. మరి నాగబాబు నరసాపురం నుంచి పార్లమెంటుకి పోటీ చేస్తే అప్పుడు రఘురామ పరిస్థితి ఏంటి ?అన్నది అంతు పట్టటం లేదు. ఒకవేళ నరసాపురం చేసే ఛాన్స్‌ రఘురామకు దక్కకపోతే ఆయన మాజీ ఎంపీగానే ఉండాల్సింది అంటున్నారు. ఏది ఏమైనా నాగబాబు అనకాపల్లి నుంచి నరసాపురం కు షిఫ్ట్ అయితే రాజు గారి పొలిటికల్ కెరీర్ గందరగోళం లో పడినట్టే అవుతుంది.

Related posts

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!