NewsOrbit
జాతీయం న్యూస్

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

Manipur: మణిపూర్ లో మరో సారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని నారసేన ప్రాంతంలో భద్రతా బలగాలపై సాయుధ మిలిటెంట్లు దాడులకు తెగబడ్డారు. సీఆర్పీఎఫ్ 128 బెటాలియన్ అవుట్ పోస్టు లక్ష్యంగా బాంబులు విసిరారు. ఈ ఘటన శనివారం వేకువజామున చోటుచేసుకుంది. మిలిటెంట్లు విసిరిన ఒక బాంబు అవుట్ పోస్ట్ కు సమీపంలో పేలడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ సైనికులు మృతి చెందారు. మరో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.

లోక్ సభ ఎన్నికల రెండో విడతలో భాగంగా అవుటర్ మణిపూర్ స్థానానికి శుక్రవారం పోలింగ్ జరిగింది. నరన్ సైనా ప్రాంతంలో ఓటింగ్ విధుల్లో పాల్గొన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది నిన్న రాత్రి ఇక్కడి ఇండియా రిజర్వ్ బెటాలియన్ క్యాంప్ వద్ద బస చేశారు. అయితే అర్థరాత్రి దాటిన తర్వాత వీరిపై మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. భద్రతా సిబ్బంది శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని కొండల ప్రాంతం నుండి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

అర్థరాత్రి దాటిన తర్వాత మొదలైన కాల్పులు దాదాపు రెండున్నర గంటల వరకూ సాగాయి. కాల్పులతో పాటు మిలిటెంట్లు బాంబులు కూడా విసిరారు. అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ బలగాలు మిలిటెంట్లపై ఎదురుకాల్పులు జరపడంతో వారు పరారయ్యారు. ఈ ఘటనలో  సీఆర్పీఎఫ్ సబ్ ఇన్స్ పెక్టర్ శంకర్, హెడ్ కానిస్టేబుల్ అనుప్ సైనీ మరణించినట్లుగా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. దాడికి పాల్పడిన మిలిటెంట్ల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N