NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema April 29 2024 Episode 610: విక్కీ, పద్మావతుల పెళ్లిరోజు సెలబ్రేషన్స్.. అరవింద కు ఇదే చివరి రోజు అన్న కృష్ణ.. అతిథులుగా రాజ్, కావ్య..

Nuvvu Nenu Prema Today Episode April 29 2024 Episode 610 highlights

Nuvvu Nenu Prema April 29 2024 Episode 610: విక్కీ,పద్మావతి అను ఆర్యాల, పెళ్లిరోజు కుచలకి గుర్తు లేదని శాంతాదేవి కోప్పడుతుంది. పద్మావతి విక్కీ అను ఆర్యా లను దీవించి, విక్కీ తో అరవింద కూడా ఉంటే బాగుండేది తను మీ ఫంక్షన్ ఏదైనా సరే ఉంటుంది. అలాంటిది మీ పెళ్లి రోజైతే తను లేకపోతే ఎలాగూ తనకి కాల్ చేసావా అని అడుగుతుంది శాంతాదేవి. విక్కీకి ఏం చెప్పాలో తెలియక సతమతమవుతుంటే పద్మావతి పనిలో పడి మీకు చెప్పడం మర్చిపోయారు. అరవింద్ కి కాల్ చేశారు సాయంత్రం కల్లా తన ఫంక్షన్ కి వస్తుంది అని చెప్తుంది. ఇదంతా విన్న దివ్య కృష్ణ కి కాల్ చేసి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. నువ్వు ఏదో చేస్తాను అని అన్నావు. వాళ్ళని చూస్తుంటే అదంతా ఏం కనిపించట్లేదు నీకు ఇంకొక విషయం చెప్పాలి బావా వాళ్ళు సాయంత్రం అరవింద్ అని ఫంక్షన్ కి తీసుకు వస్తానని ఇంట్లో వాళ్ళతో చెప్పారు. అంటే దీన్నిబట్టి వాళ్ళు ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నారు నువ్వు జాగ్రత్తగా ఉండు అయినా నువ్వు చేయాలనుకున్నది చెయ్యి, చేయడం చేతకాకపోతే చేతకాదు అని చెప్పు అని అంటుంది దానికి కృష్ణ కోపంగా ఏం మాట్లాడుతున్నావ్ దివ్య అని అంటాడు నిజమే మాట్లాడుతున్నాను బావ అని అంటుంది. అరవింద నీ దగ్గర ఉంటే వాళ్ళు సాయంత్రం కల్లా ఎందుకు తీసుకొస్తానని ఇంట్లో వాళ్ళతో చెప్తారు అంటే వాళ్ళకి నీ ప్లేస్ ఎక్కడో అర్థమయిపోయిందనే కదా అని అంటుంది. వాళ్ళు ఇక్కడికి రాలేరు దివ్య ఇక్కడ చుట్టూ నా మనుషులే ఉన్నారు నువ్వేం కంగారు పడొద్దు అయిన వాళ్ళకి ఫంక్షన్ లో నేను జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇస్తాను కదా అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode April 29 2024 Episode 610 highlights
Nuvvu Nenu Prema Today Episode April 29 2024 Episode 610 highlights

ఇక మరోవైపు పద్మావతి విక్కీ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన పద్మావతి విక్కి ని చూసి నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి ఇక్కడ ఉన్నారా అని అడుగుతుంది. విక్కీ కళ్ళల్లో నీళ్లు చూసి అదేంటి సారు ఈరోజు మన పెళ్లి రోజు సంతోషంగా ఉంటారు అనుకుంటే ఇలా బాధపడుతున్నారు అని అడుగుతుంది. అక్క కోసం పద్మావతి అని అంటాడు. చిన్నప్పటినుంచి మా అమ్మ లేని లోటుని నాకు తెచ్చింది మా అక్క నా ప్రతి ఫంక్షన్లో తనుంది. ఇప్పుడు తను లేకపోయేసరికి నాకు చాలా బాధగా ఉంది అని అంటాడు. నేను ఎలా ఉండాలో మా అమ్మ నేర్పితే నేను ఎలా బతకాలో మాకే నేర్పించింది నా ప్రతి కష్టంలో తోడుగా నిలిచింది. ఇప్పుడు తనే లేకపోతే, నాకు జీవితమే లేదనిపిస్తుంది పద్మావతి అని బాధపడతాడు. మా అక్క ఎక్కడ ఉందో ఎంత అవస్థ పడుతుందో తెలియట్లేదు పద్మావతి అని అంటాడు. మీరు బాధపడకండి వదిన ఇలాంటి మంచి మనిషికి ఆ దేవుడు అన్యాయం చేయడు అని అంటుంది పద్మావతి. తను ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటుంది అని అంటుంది అలా అనుకొని ఆగిపోవాల్సిన నా ఊపిరిని ఆపుకుని బతుకుతున్నాను అని అంటాడు విక్కీ. ఏ నిమిషమైనా తన గురించి ఒక శుభవార్త వింటాను తను ఏ క్షణమైనా ఇక్కడికి వస్తుందో అని ఎదురు చూస్తున్నాను. ఆ నీచుడి మనస్తత్వం తెలిసిన తర్వాత వాడు నా మీద కోపంతో అక్కకేమైనా హాని తలపెడతాడేమోనని, భయంగా ఉంది నేను అలా జరిగితే తట్టుకోలేని పద్మావతి అని అంటాడు. వదిన ఎక్కడ ఉందో కనుక్కొని ప్రయత్నం మనం చేద్దాం అని అంటుంది పద్మావతి. తను కచ్చితంగా మనకు దొరుకుతుంది మీరు ధైర్యంగా ఉండండి అని అంటుంది. అక్కని చూడకపోతే నా ప్రాణం పోయేలా ఉంది అని అంటాడు విక్కీ. ఇక నాకు ధైర్యం ఎక్కడిది పద్మావతి అని అంటాడు. నా జీవితంలో వచ్చిన ప్రతి ఆనందంలో నూతన నా వెంటే ఉంది. తీరా ఇప్పుడు నీతో కలిసి ఆనందంగా ఈ పెళ్లి రోజు జరుపుకుందాం అంటే తను లేదు. ఆ నీచుడికి ఏం కావాలని, వాడు అడిగినా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. చివరికి వాడు నా ప్రాణం అడిగినా మా అక్క కోసం నేను అది చేస్తాను అని అంటాడు. సారు అంత మాట అనకండి అని అంటుంది పద్మావతి. తల్లి కోసం బిడ్డ పడే ఆరాటంలో ఎంత ప్రేమ ఉన్నాదో అదే బిడ్డ తల్లి కోసం పడే ఆరాటంలో కూడా అంతే ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ తల్లి బిడ్డల్ని ఒకటి చేసి తీరుతుంది. నన్ను నమ్మండి అని అంటుంది పద్మావతి నమ్మాలని ఉన్న పరిస్థితులు అనుకూలించట్లేదు అని అంటాడు. ఆ నీచుడికి ఎప్పుడు ఏ బుద్ధి పుడుతుందో అని టెన్షన్ గా ఉంది అని అంటాడు. అక్క మళ్ళీ ఇక్కడికి రావాలి. ఎప్పట్లా నాతో నవ్వుతూ నన్ను అమ్మలా చూసుకోవాలి. అది తప్ప నాకు వేరే కోరిక లేదు పద్మావతి అని అంటాడు. కోరే కోరికలో న్యాయం ఉంటే తప్పకుండా తీరుతుంది వదిన ఎక్కడ ఉన్న మనకు తెలిసి తీరుతుంది అని అంటుంది పద్మావతి. ఆ దేవుడు ఏదో ఒక రూపంలో మనకు దారి చూపిస్తాడు అని అంటుంది పద్మావతి. వదిన కోసం మనకు సహాయం చేసే వాళ్ళు తప్పకుండా వస్తారు అని అంటుంది పద్మావతి. అప్పుడే రాజ్ కావ్య ఇద్దరు కారు దిగడం చూపిస్తారు. దీనిని బట్టిరాజ్ కావ్య ద్వారా అరవింద గురించి పద్మావతి వాళ్లకి నిజం తెలిసే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode April 29 2024 Episode 610 highlights
Nuvvu Nenu Prema Today Episode April 29 2024 Episode 610 highlights

ఇక రాజ్, కావ్యా ఇంట్లోకి వెళుతూ ఉంటే మనిద్దరం కలిసి వచ్చాం కదా నీపాటికి వెళ్ళిపోతున్నావేంటి ముందు అని అంటాడు. ఇద్దరం కలిసి వెళ్లాలని తెలియదా అని అంటాడు. కావ్య మాట్లాడుతూ మీరు వేరే దారిలో వెళ్లాలని ఫిక్స్ అయినప్పుడు. నా దారి నేను చూసుకోవాలి కదా అని అంటుంది. ఈ డొంక తిరుగుడు మాటలే వద్దనేది అని అంటాడు రాజ్. నిజం చెప్పకుండా తప్పించుకొని తిరగాలని మీరు చూస్తున్నారు కదా, మరి నాదిలా డొంక తిరుగుడు అవుతుంది అని అడుగుతుంది. తిరిగి తిరిగి అక్కడికే వస్తావా అని అడుగుతుంది మీరు ఎంత అడిగినా చెప్పరు కదా నేను అందుకే అడుగుతూనే ఉంటాను అని అంటే నీకు ఎప్పటికీ సమాధానం దొరకదు అని అంటాడు రాజ్. నేను కూడా అయితే అడగడం మానేయను అని అంటుంది కావ్య. మనం ఇప్పుడు వేరే చోట ఉన్నాం అది మర్చిపోతున్నావు అని అంటాడు రాజ్. మనకి ఒక సమస్య ఉంది అది ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది కదా అని అంటుంది కావ్య. మన సమస్యని మన మధ్యలోనే ఉండనివ్వు అని అంటాడు రాజ్. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చింది విక్కీ పద్మావతి యానివర్స్ డే కి, అసలే వాళ్ళిద్దరూ ఎన్నో కష్టాలు అనుభవించి, ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళ హ్యాపీ మూడ్ మనవల్ల చెడిపోకూడదు. ఒకరినొకరు అర్థం చేసుకున్న జంట, బాగుండాలి అని మీరు కోరుకుంటున్నారు. మరి మనం బాగుండాలని ఎందుకు అనుకోవట్లేదు అని అడుగుతుంది కావ్య. అర్థమైంది లేండి అని అంటుంది. ఏం అర్థమైంది అని అడుగుతాడు మనం అన్యోన్యంగా ఉన్నట్టు ఇక్కడ నటించాలి అని అంటుంది కావ్య. పరిస్థితిని అర్థం చేసుకోమని చెప్తున్నాను అని అంటాడు రాజ్. అదే మాట నేను మీతో చెప్తే అని అంటుంది కావ్య. బాబు తల్లి ఎవరో చెప్తే ఏదైనా ఉండదు కదా అని అంటుంది కావ్య. బాబు కూడా వాళ్ళ అమ్మ ప్రేమ దక్కుతుంది అని అంటుంది. తల్లి బిడ్డను వేరు చేసే పాపం మీకు ఎందుకు చెప్పండి అని అంటుంది. పాపపుణ్యాల గురించి నేను ఆలోచించట్లేదు అని అంటాడు రాజ్. వాడి భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను అని అంటాడు. వాడు నా బిడ్డ నాతోనే ఉంటాడు అని అంటాడు రాజ్. అబద్దాన్ని ఎంత నమ్మించాలని చూసినా అది నిజం కాదు కదా అని అంటుంది కావ్య. అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా వాదిస్తావు అని అడుగుతాడు. అర్థం చేసుకున్నాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను అని అంటుంది కావ్య. అలాగని నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటారేమో నేను వదలను కదా మిమ్మల్ని అని అంటుంది. రాజ్ కోపంగా చూస్తాడు. సరే సరే ప్రతిసారి అలా చూడొద్దు అని అంటుంది. మన మధ్య ఎన్ని సమస్యలు ఉన్న నేను ఇక్కడ ఎలా నటిస్తాను మీరే చూస్తారు కదా అని అంటుంది. యాక్టింగ్ లో మీ అంత సీనియర్ ని కాకపోయినా, గంత కి తగ్గ బొంతలా చేస్తాను. అని అంటుంది కావ్య సరే అని అంటాడు రాజ్ ఇద్దరు కలిసి, సెలబ్రేషన్స్ దగ్గరికి వెళ్తారు.

Nuvvu Nenu Prema Today Episode April 29 2024 Episode 610 highlights
Nuvvu Nenu Prema Today Episode April 29 2024 Episode 610 highlights

ఇక మరోవైపు విక్కీ, అరవింద ఇంట్లో ఉన్నట్టుగా ఊహించుకొని బాధపడుతూ ఉంటాడు. అతను ఎలాగైనా సరే ఇంటికి తీసుకురావాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాడు. అప్పుడే కృష్ణ కి కాల్ చేస్తాడు. కృష్ణ విక్కీ ఫోన్ చేయడం చూసి, నాపై నువ్వు ఎంత ఎగిరినా మీ అక్క నా దగ్గర ఉంది కాబట్టి నువ్వు నా కాళ్ళ బేరానికి రావాల్సిందే విక్కీ అని అంటాడు. ఫోన్ లిఫ్ట్ చేసి నేనే కాల్ చేద్దాం అనుకుంటున్నాను బామ్మర్ది నువ్వే ఫోన్ చేశావు ఎనీ హౌ నీకు నీ బెటర్ ఆఫ్ పద్మావతికి, పెళ్లిరోజు శుభాకాంక్షలు నీకేం గిఫ్ట్ కావాలో కోరుకో వెంటనే ఇచ్చేస్తాను అని అంటాడు కృష్ణ. మా అక్క కావాలి వెంటనే తిరిగి చెయ్ అని అంటాడు విక్కీ. అనుకున్నా నువ్వు ఇదే అడుగుతావని అనుకున్నా అని అంటాడు కృష్ణ. అయితే మా అక్క ఎక్కడుందో చెప్పు నేనే వెళ్లి తెచ్చుకుంటాను అని అంటాడు. కోరిక కోరమన్నారు కదా అని గొంతెమ్మ కోరికలు కోరితే ఎలా విక్కి అని అంటాడు. అది కాకుండా వేరేది అడుగు అని అంటాడు. వెంటనే విక్కీ కోపంతో మా అక్కంటే నాకు ప్రాణం లేకుండా నేను ఉండలేను అని అంటాడు. అరవింద నీ ప్రాణమే కాదు ఇప్పుడు నా ప్రాణం కూడా అని అంటాడు కృష్ణ. ఈ మాట నేను ఏదో ప్రేమతో చెప్పట్లేదు నీ నుండి నన్ను నేను కాపాడుకోవడానికి ఇలా చెప్తున్నాను అని అంటాడు. నువ్వు అరవింద్ అని అడగగానే నేను ఇచ్చేస్తే ఆ మరు క్షణం నువ్వు నన్ను చంపేస్తావ్, అందుకే అది తప్ప వేరే ఏదైనా అడుగు అని అంటాడు. వెంటనే విక్కీ అరేయ్ నీకేమ్ ద్రోహం చేశాను రా, తను ఎంతలా నమ్మింది ఇప్పటికైనా మా అక్కని వదిలేసేయ్ అని అంటాడు. ఇప్పుడు కాదు బామ్మర్ది ఇంకా నేను చేయాల్సిన పనులు పూర్తవలేదు అయ్యాక అప్పుడు చూద్దాం అని అంటాడు కృష్ణ. నువ్వేం అనుకుంటున్నావో నాకు అనవసరం మా అక్కని మర్యాదగా వదిలేయ్ అని అంటాడు విక్కీ. నాకు కోపం వస్తే నేను నిజంగానే చంపేస్తాను అని అంటాడు. మరి అదే వద్దనేది మీ అక్క ముందు నన్ను చంపుతాను అంటే, లేదు కదా అని అంటాడు కృష్ణ. నువ్వు ఎగస్ట్రాలు చేస్తే మీ అక్కని పైకి పంపిస్తాను జాగ్రత్త అని ఫోన్ పెట్టేస్తాడు కృష్ణ. మరోవైపు విక్కీ బాధపడుతూ ఎక్కడున్నావక్కా అని అనుకుంటూ ఉంటాడు.

Nuvvu Nenu Prema Today Episode April 29 2024 Episode 610 highlights
Nuvvu Nenu Prema Today Episode April 29 2024 Episode 610 highlights

ఇక అరవింద కృష్ణ దగ్గరికి వస్తుంది కృష్ణ అరవింద అని చూసి కంగారు పడతాడు. మొత్తం వినేసిందా ఏంటి అని అనుకుంటాడు. ఎందుకండీ ఇలా చేస్తున్నారు ఈరోజు వాడి పెళ్లి రోజు కదా అని అంటుంది. మరి అక్కగా నేను విషెస్ చెప్పకుండా మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అని అడుగుతుంది. మీరు ముందు ఫోన్ చేసి ఇవ్వండి నేను తనతో విషెస్ చెప్తాను అని అంటుంది. అది రాణమ్మ నీ బదులు కూడా నేనే చెప్పాను అని అంటాడు. కానీ విక్కీ మాట్లాడే మూడ్లో లేడు అని అంటాడు. ఇప్పుడు విక్కీ నీ తమ్ముడు కాదు పద్మావతి భర్త కదా అందుకే ఏ భర్త అయినా తన భార్య చెప్పిన మాట వినాలి కదా అని అంటాడు. ముందు మీరు ఫోన్ చేసి ఇవ్వండి నేను మాట్లాడుతాను అని అంటుంది అరవింద. అదే చెప్పాను అక్క మాట్లాడుతుందని కానీ వినకుండా ఫోన్ పెట్టేసాడు అని అంటాడు కృష్ణ. నువ్వేం ఫీల్ అవ్వకు రాణమ్మ, నిన్ను డైరెక్ట్గా అక్కడికే తీసుకెళ్తాను అని అంటాడు అయితే నన్ను మా ఇంటికి తీసుకెళ్తున్నారా అని అడుగుతుంది అరవింద్ డైరెక్ట్ గా మీ తమ్ముడికి నువ్వు విషెస్ చెబుదువు గాని అని అంటాడు కృష్ణ. మనం కూడా సాయంత్రం ఫంక్షన్ కి వెళ్దాం సరేనా అని అంటాడు. మీరెంత మంచివారండి అని అంటుంది అరవింద. నిన్ను పైకి సాగనంపడానికి తీసుకువెళ్తున్నాను అరవింద్ అని మనసులో అనుకుంటాడు కృష్ణ. నువ్వు వెళ్లి రెడీ అయ్యారా అని అంటాడు అరవింద సంతోషంగా వెళుతుంది. విక్కీ నీ పెళ్లి రోజు కానుకగా నేను ఇచ్చే బహుమతి మీ అక్క శవం అని అంటాడు.

ఇక మరోవైపు సెలబ్రేషన్స్ మొదలవుతాయి పద్మావతి అనుకి పార్వతి బట్టలు తీసు

Nuvvu Nenu Prema Today Episode April 29 2024 Episode 610 highlights
Nuvvu Nenu Prema Today Episode April 29 2024 Episode 610 highlights

కొచ్చి ఇస్తుంది. మీరిద్దరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అని అంటే నువ్వు కూడా సంతోషంగా ఉండాలి అని పద్మావతి అంటుంది. మీ భర్తను మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు అమ్మ నాకు అంతే చాలు అని అంటుంది పార్వతి. ఇక అక్కడ కుచల, పెత్తనం చేయాలి అనుకుంటే శాంతాదేవి వచ్చి పెత్తనం చేయడం కాదు, ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి అంటుంది. నేను పేరుకే ఇక్కడ అత్తని కానీ పెత్తనంతా ఈ ఓల్డ్ లేడీ ఇదే అని అనుకుంటుంది కుచల. వెంటనే శాంతాదేవి కుచల అని అంటుంది. నేను ఇప్పుడేమన్నాను అత్తయ్య అని అంటుంది మనసులో అనుకోవాల్సింది బయటకు అంటున్నావు అని అంటుంది. అల్లుళ్లు ఎక్కడా అని పార్వతి అడుగుతుంది అప్పుడే విక్కీ వాళ్ళు కిందకి వస్తారు ఎలా ఉన్నారు అత్తయ్య అని అడిగితే మీలాంటి అల్లుళ్ళు వచ్చిన తర్వాత నాకేంటి బాబు అని అంటుంది. ఇదంతా చూసి దివ్య వీరి నిజంగానే అరవింద్ తీసుకువచ్చేలా ఉన్నారే అని అనుకుంటుంది. నేను బావకు చెప్పాను కదా ఏమన్నా జాగ్రత్త పడ్డాడో లేదో అని అనుకుంటుంది. ఇక ఆర్య మామయ్య రాలేదా అని పార్వతిని అడుగుతాడు భోజనం టయానికి వస్తాడులే అని కుచల అంటుంది. ఇక అప్పుడే నారాయణ రాజ్ కావ్యాల్ని రమ్మన్నావు కదా ఇంకా రాలేదా అని అడుగుతాడు. బయల్దేరి కూడా చాలా సేపు అయింది అని ఆర్య అంటాడు. రాజ్ అంటే టైం టైం అంటే రాజ్ అని అంటాడు విక్కీ. అదిగో వచ్చేసారు అని అంటాడు. ఇక రాజ్ కావ్య డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇస్తారు. అందరూ కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక రాజ్ కావ్య ఇద్దరు డాన్స్ చేసిన తర్వాత పద్మావతికి, విక్కీకి పెళ్లిరోజు శుభాకాంక్షలు అని చెబుతారు. ఆర్య అనులకి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తారు. వీళ్ళ సంబరాలు చూస్తుంటే అమరాన్ అంటే ఎలా ఉన్నాయని దివ్య కుళ్ళుకుంటుంది. పార్వతి కావ్య తో బాగున్నారా అని అడిగితే వాళ్లకేంటమ్మ నిజమైన ప్రేమకి అసలైన భార్యాభర్తలకి చిహ్నం వాళ్లే అని నారాయణ అంటాడు. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కుచల కూడా అంటుంది. మనం ఒకరికి ఒకరు అని అందరూ అనుకుంటున్నారు మనం వేరు వేరు అని తెలిస్తే ఏంటి పరిస్థితి అని రాజ్ కి వినపడేలా కావ్య అంటుంది. వాళ్లకేం తెలీదు నువ్వే చెప్పేలా ఉన్నావు అని అంటాడు. అయినా ఒక క్షణం కూడా నేను వదిలి ఉండలేడు కదా రాజ్ అని అడుగుతుంది శాంతాదేవి. వెంటనే కావ్య,సందు దొరికితే ఈ క్షణమే నన్ను వదిలేసి వెళ్లిపోయేలా ఉన్నారు. అని కావ్య అంటే ఒసేయ్ నువ్వు ఆపుతావా అని అంటాడు రాజ్. అవును దివ్య ఎక్కడ అని అడుగుతాడు విక్కీ. ఇక్కడే ఉన్నాను అన్నయ్య అని అంటుంది దివ్య. రాజ్,కావ్య శాంతాదేవి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే పిల్లాపాపలతో సంతోషంగా ఉండండి అని అంటుంది. సంతోషంగా ఉండాలంటే బాబు అడ్డుస్తున్నాడు అని అంటుంది కావ్య దాంతో రాజ్ కంగారు పడతాడు. బాబు ఏంటి అని అడుగుతుంది శాంతాదేవి. ఏం లేదు నానమ్మ తనకి బాబు కావాలని అనుకుంటుంది అని కవర్ చేస్తాడు రాజ్. నాకు ఏదోలా అనిపిస్తుందే అని నారాయణ అంటే అదంతా సెకండరీ, ఈరోజు మనకు ఇంపార్టెంట్ విక్కీ పద్మావతి లు అను ఆర్యాల పెళ్లిరోజు, సందడి అంతా ఈ రోజే చేసేయాలి అని అంటాడు రాజ్. ఇంక సందడి మొదలు పెడదామా అని అంటే విక్కీ డల్లుగా కనిపిస్తాడు. రాజ్ విక్కీ పక్కకు తీసుకొని వెళ్తాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.

రేపటి ఎపిసోడ్ లో, నీ మనసులో ఉన్న ఆనందం నీ కళ్ళల్లో కనిపించట్లేదు అని విక్కీని అడుగుతాడు రాజ్. మా బావ దేవుడు కాదు బ్రో రాక్షసుడు. అక్క ని ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టాడు. అని నిజాన్ని రాజ్ చెప్తాడు విక్కీ. మరోవైపు కృష్ణతో అరవింద ఇంటికి వెళ్దాం అండి అని అడుగుతుంది. ఫంక్షన్లో పద్మావతి విక్కీ గురించి గొప్పగా చెప్తుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella