NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari April 29 2024 Episode 457: పిల్లల కోసం కృష్ణ ఆరాటం.. ముకుంద ప్లాన్ తో అడ్డం తిరిగిన కథ

Krishna Mukunda Murari Today Episode  April 29 2024 Episode 457 highlights

Krishna Mukunda Murari April 29 2024 Episode 457: కృష్ణ హాస్పిటల్ కి రావడంతో నిజం తెలిసిపోతుంది. మురారి కి నర్స్ ఫోన్ చేసి కృష్ణ కి హాస్పటల్ లో కడుపులో నొప్పి వచ్చిందని మీరు తొందరగా రండి అని ఫోన్ చేసి చెప్తుంది దాంతో మురారి కంగారుగా హాస్పిటల్ కి వస్తాడు అప్పటికే కృష్ణకు నిజం తెలిసిపోయి బాధపడుతూ ఉంటుంది ఏమైంది కృష్ణ అని అడిగితే నాకు ఇక జీవితంలో పిల్లలు పుట్టరు ఎ సి పి సార్ నా గర్భసంచి తీసేస్తున్నారు. నేను పెద్ద అత్తకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అని బాధపడుతుంది. మురారి ఓదారుస్తాడు అదంతా ముకుంద కూడా చూస్తూ ఉంటుంది.ముకుంద హాస్పిటల్ లో మురారిని కలుస్తుంది ముకుంద కూడా నిజం తెలిసిపోయిందన్న విషయం మురారి కి తెలుస్తుంది ఎవరికీ చెప్పొద్దని ముకుంద దగ్గర మాట తీసుకుంటాడు. కృష్ణ ఇకనుంచి మనం వెళ్ళిపోదాం ఎసిపి సర్ హాస్పిటల్ లో ఉండలేకపోతున్నాను. మీరు నేను మాత్రమే కూర్చుని ఏకాంతంగా మాట్లాడుకోవాలి అని అంటుంది. ఇక పక్కనే ఉన్న నర్సు ఆమెకి జ్యూస్ తీసుకొచ్చి తీసుకెళ్లండి అని అంటుంది. దాంతో మురారి జ్యూస్ తీసుకొచ్చి కృష్ణకిస్తాడు.

Krishna Mukunda Murari Today Episode  April 29 2024 Episode 457 highlights
Krishna Mukunda Murari Today Episode  April 29 2024 Episode 457 highlights

ఇక కృష్ణ ఏసీబీ సార్ మీకు పిల్లలు లేరని బాధగా లేదా అని అడుగుతుంది. బాధించు కృష్ణ నిన్ను సంతోషంగా ఉంచగలిగితే చాలు నాకు, అయినా ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది దాని గురించి ఆలోచించాలి గాని ఇలా బాధపడితే ఎలాగో అని అంటాడు. మన సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుందని నాకనిపిస్తుంది కృష్ణ నువ్వు బాధపడొద్దు అని అంటాడు. సరే బయటికి వెళ్దాం అన్నావ్ కదా పదా వెళ్దాం అని అంటాడు ఇక కృష్ణ మురారి ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు.

Krishna Mukunda Murari Today Episode  April 29 2024 Episode 457 highlights
Krishna Mukunda Murari Today Episode  April 29 2024 Episode 457 highlights

ఇక ముకుందా తన ఫ్రెండ్ వైదేహి డాక్టర్ దగ్గరికి వెళ్లి నాకు చాలా సంతోషంగా ఉందని తనని గట్టిగా హగ్ చేసుకుని నువ్వు ముందు ఈ స్వీట్ తిను అని అంటుంది వైదేహి ఏమైందో చెప్పు అని అంటే ముందు నువ్వు స్వీట్ తిను నీకు ఒక మంచి వార్త చెప్తాను అని అంటుంది. చాలా థాంక్స్ వైదేహి ఇప్పటివరకు నాకు చాలా మంది హెల్ప్ చేశారు వాటి వలన నాకు ఒక్క రవ్వ కూడా సంతోషం లేదు కానీ నువ్వు చేసిన చిన్న హెల్ప్ నాకు జీవితాన్ని మార్చేసింది చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పుడు చెప్తున్నాను విను నాకు పుట్టబోయే బాబుకి నీ పేరే పెట్టుకుంటాను అని అంటుంది. త్వరలోనే నీకు పాప పుట్టబోతుందా ఏం మాట్లాడుతున్నావ్ ముకుందా అని అడుగుతుంది. నేను ఊరికే ఏదీ చెప్పను అది నీకు తెలుసు కదా అని అంటుంది ముకుంద, అవసరం లేకుండా నేను ఏ పని చేయను, కృష్ణ కడుపులో బిడ్డ పెరగదు అంటే నా కడుపులో పెరిగినట్టే అని అంటుంది. మురారి ఇక నా వాడే అని, దీనికి అసలు కారణం నువ్వే కదా అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode  April 29 2024 Episode 457 highlights
Krishna Mukunda Murari Today Episode  April 29 2024 Episode 457 highlights

అందుకే పుట్టబోయే పాపకి నీ పేరు పెట్టుకుందామని డిసైడ్ అయిపోయాను అని అంటుంది. వైదేహి ముకుందని అలానే చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావ్ అని అడిగితే నీలో ఉన్న విలన్ని చూడాలా లేదంటే నీలో ప్రేమికురాలిని చూడాలా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది. ప్రేమ ఎక్కువ పెంచుకున్నాను క్రిమినల్స్ లానే కనిపిస్తారు వైదేహి నేను అంతే అని అంటుంది ముకుంద. మీరంతా ఏమనుకుంటారు ప్రేమించే వాళ్ళు శాంతంగా ఉంటారు ప్రేమ కోసం త్యాగాలు చేస్తారని అనుకుంటారు. దక్కకపోతే ప్రాణాలు కూడా వదిలేస్తారు అని అందరూ అనుకుంటారు. అలా చేసే వాళ్ళు ఎవరో నా దృష్టిలో ప్రేమికులు కాదు, ప్రేమ కోసం ఏదైనా చేయాలి ఎంతకైనాతెగించాలి, అందరి దృష్టిలో క్రిమినల్ అని అనిపించుకున్న పర్వాలేదు. మనం ప్రేమించిన ప్రేమ మనకు దక్కితే చాలు. ఏంటి నేను ఇంత చెప్తున్నా నీకు అర్థం కావట్లేదా అని అంటుంది ముకుంద. నేను ప్రేమించిన వాడికి నా ప్రేమ అర్థం కాలేదు. ఇంక నా ప్రేమ నీకు ఎలా అర్థం అవుతుందిలే కానీ ఎనీ హౌ నాకు నువ్వు హెల్ప్ చేసినందుకు చాలా థాంక్స్ అని అంటుంది. నువ్వు సరోగసి డాక్టర్ వే కదా అని అడుగుతుంది అవును అని అంటుంది వైదేహి అయితే నీతో నాకు ఇంకా చాలా పని ఉంది అయినా ఇప్పుడు ప్రస్తుతం నేను కృష్ణ మురళి దగ్గరికి వెళ్లి మళ్లీ నీ దగ్గరికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari Today Episode  April 29 2024 Episode 457 highlights
Krishna Mukunda Murari Today Episode  April 29 2024 Episode 457 highlights

మరోవైపు కృష్ణ మురారి ఇద్దరు ఒంటరిగా ఒక ప్లేస్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కృష్ణ భవాని దేవి చెప్పిన మాటలను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. కృష్ణ నవ్వుతుంది ఎందుకు నవ్వుతున్నావ్ కృష్ణ అని అడుగుతాడు మురారి. ఏం లేదు ఎసిపి సర్ ఏ ముహూర్తాన నేను మిమ్మల్ని ఏబిసిడిలు అబ్బాయి అని పిలిచానో, అదే నిజమైంది అని అంటుంది ఏం నిజమైంది అని అంటాడు మిమ్మల్ని అబ్బాయి అని పిలిచాను కదా, ఈ పిల్లకి అబ్బాయి ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఇక పిల్లల అవసరం లేదని దేవుడు అనుకున్నాడు. అందుకే నాకు పిల్లలు లేకుండా చేశాడు అని అంటుంది. అయినా మీరు ఉండగా నాకు పిల్లలు ఎందుకు ఏ సి పి సార్. నేను బాధ పెడతానని మీరు మీరు బాధపడతారు అని నేను, బాధ లేనట్టు నటిస్తున్నాం కానీ ఇద్దరికీ చాలా బాధ ఉంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ముకుంద దూరం నుంచి వింటూ ఉంటుంది. ఇక కృష్ణ ఇప్పుడు ఇంటికి వెళ్లాలంటే నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. పెద్ద అత్తయ్యని చూడగానే నిజం చెప్తానేమోనని భయంగా ఉంది మీరు కూడా నిజం చెప్పానని నాకు మాట ఇవ్వండి అని అడుగుతుంది. మురారి కి ఏం చేయాలో తెలియదు. ఎన్నాళ్ అని చెప్పకుండా దాచిపెట్టమంటావ్ కృష్ణ అని అడుగుతాడు. ఎన్నాళ్ళు పిల్లలు పుడతారని మభ్యపెడతాము ఇంట్లో వాళ్ళని అని అడుగుతాడు. సరోగసి గురించి చెప్పమంటే చెప్పకుండా ఏదో సోది మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అని అనుకుంటుంది ముకుంద. కృష్ణ దీనికి ఒప్పుకుంటే నా ప్లాన్ సక్సెస్ అయినట్టే అని అనుకుంటూ ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode  April 29 2024 Episode 457 highlights
Krishna Mukunda Murari Today Episode  April 29 2024 Episode 457 highlights

ఇక మురారి మాట్లాడుతూ ఇంట్లో వాళ్లకి మనం విషయం చెప్తే, బాధగా ఉన్న తర్వాత అర్థం చేసుకుంటారు. అబద్ధం చెప్తే ప్రతిక్షణం వాళ్ళని మోసం చేయలేము. మురారికేమైంది ప్లానంత చెడగొట్టేలా ఉన్నాడే అని ముకుందా అనుకుంటూ ఉంటుంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందని మీరే కదా చెప్పింది అని అంటుంది కృష్ణ. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఉందా అని ఆలోచిస్తే, నాకు ఒక పరిష్కారం దొరికింది అని అంటుంది. అదేంటో చెప్పమంటాడు మురారి ముకుందా ఏం చెప్తుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటుంది. పెద్ద అత్తయ్య కి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్న, మనకి పిల్లలు పుట్టాలన్న, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది అని అడుగుతాడు మురారి సరోగసి అని అంటుంది దానికి మురారి ఆశ్చర్యపోతాడు. సంతోషిస్తుంది. మీరు కూడా దీని గురించి వినే ఉంటారు కదా ఎసిపి సార్ అని అడుగుతుంది. సరోగసి అంటే గర్భాన్ని అద్దెకు తీసుకోవడం. ఏంటి ఏ సి పి సార్ ఈ మాట చెప్పగానే సైలెంట్ అయిపోయారు అని అడుగుతుంది. కృష్ణకి ముకుంద కూడా ఇదే మాట చెప్పడం గుర్తుకు వచ్చి సైలెంట్ అయిపోతాడు. ఏం ఆలోచిస్తున్నారు వద్దని మాత్రం చెప్పొద్దు అని అంటుంది కృష్ణ. నీకు ఓకేనా అని అడుగుతాడు మురారి నాకు ఓకే సార్ అని అంటుంది. ఇప్పుడు మనమనే పరిస్థితుల్లో వేరే దారి లేదు కదా అని అంటుంది కృష్ణ. చచ్చిన వేరే దారి మీకు దొరకదులే అనుకుంటుంది ముకుంద. అయినా ఇందులో తప్పేం లేదు, నా గర్భాశయంలో పిల్లల్ని మోసే ఇది లేదు కాబట్టి, వేరే గర్భాన్ని అద్దెకి తీసుకుంటాం జంతికలుగా అన్ని విధాల ఆ బిడ్డ నా బిడ్డ అవుతుంది అని అంటుంది. చాలామంది ఇప్పుడు ఈ ప్రాసెస్ ని ఫాలో అయ్యి పిల్లల్ని కంటున్నారు ఏసీబీ సార్ అని అంటుంది. కాకపోతే తొమ్మిది నెలలు మోసాము అన్న అనుభూతికి దూరం అవుతాము. కానీ పెద్ద అత్తయ్య ఆశలు మాత్రం మన నిజం చేసిన వాళ్ళం అవుతాం. ఏమంటారు అని అడుగుతుంది మురారిని నాకు ఈ ఆలోచన వచ్చింది కృష్ణ. నువ్వేమంటావో దీనికి నువ్వు ఒప్పుకుంటావో లేదో అని ఆలోచిస్తున్నాను. సమస్య ఉన్నప్పుడే కదా పరిష్కారం గురించి కూడా ఆలోచించాలి. అసలు ఈ ఆలోచన రాగానే నాకు ఎంత రిలీఫ్ గా ఉందో తెలుసా అని అంటుంది కృష్ణ. ఒక మంచి అమ్మాయిని చూసి సరోగసి కి వెళ్లిపోదాం ఏ సిటీ సార్ అని అంటుంది. సరే అయితే నీ మాట నేనెప్పుడూ కాదన్నాను కృష్ణ అని అంటారు. నువ్వు కోరుకున్నట్టే చేద్దాం అని అంటాడు. డాక్టర్ మహేశ్వరి దగ్గరికి ఇప్పుడే వెళ్లి మనం సరోగసి గురించి మాట్లాడి ఇంటికి వెళ్దామని అంటుంది సరే అంటాడు మురారి ఇద్దరు కలిసి హాస్పిటల్ కి బయలుదేరుతారు. ఇక ముకుంద వాళ్ళిద్దరు వెళ్లిన తర్వాత చాలా సంతోషిస్తుంది ఇక మురారి నా వాడు కాకుండా ఎవరూ ఆపలేరు నాకు చాలా సంతోషంగా ఉంది అని నవ్వుతూ ఉంటుంది.

ఇక మరో వైపు రేవతి మధు తో కృష్ణ గుడికి వెళ్లి చాలాసేపు అయింది రా ఇంతవరకు రాలేదు ఒకసారి మురారి కి కాల్ చెయ్ అని అంటుంది. కృష్ణ గుడికి వెళ్ళింది మురారి బయటికి వెళ్ళాడు మీరా కూడా కనిపించట్లేదు అని అంటాడు మధు. ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్లారో ఏంటో అని అంటాడు. ఆ మాటలు ఆదర్శ్ వింటాడు మురారి మీరా కలిసి వెళ్లారన్న మాటలు విని కోపంతో మధు దగ్గరికి వెళ్తాడు. ఏమన్నావో మళ్లీ చెప్పు అని అంటాడు. మురారి మీరా కలిసి ఎక్కడికైనా వెళ్లారేమో అని అన్నాను అని అంటాడు మధు. ఫస్ట్ తన పేరు మార్చాను ఆ విషయం గుర్తులేదు నీకు తన పేరు ముకుందా అని అంటాడు. అసలు పేరు మీరానే బ్రో ముకుందా అని నువ్వు పెట్టావు. పెట్టాను తెలిసింది కదా మరి నువ్వు కూడా అలానే పిలువు అని అంటాడు ఆదర్శ్. ముకుంద మురారితో కలిసి వెళ్లలేదు అయినా తను ఎందుకు కలిసి వెళుతుంది అని అంటాడు. అర్థం లేకుండా ఏదేదో మాట్లాడుతావు నువ్వు అని అంటాడు ఆదర్శ్. ఇద్దరు ఇంట్లో కనిపించలేదు కాబట్టి కలిసి వెళ్లారేమో అని అన్నాను. వెళ్తే ఏమవుతుంది నువ్వు ఎందుకు అంత లా రియాక్ట్ అవుతున్నావ్ అని అడుగుతాడు మధు. అది నీకు అనవసరం నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటాడు ఆదర్శ్. నువ్వు ఫస్ట్ ఎవరి పేర్లతో వాళ్ళని పిలవడం నేర్చుకో అని అంటాడు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. మధు రేవతి తో ఏంటి పెద్దమ్మ వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని అడిగితే వాడి గురించి తెలిసింది కదరా వదిలేసేయ్ అని అంటుంది. మురారి కి ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పు. వాడి కృష్ణ దగ్గరికి వెళ్ళాడు నేనే పంపించాను ఫోన్ చెయ్ అని అంటుంది.

ఇక మరోవైపు కృష్ణ మురారి ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అయితే సరోగసికి వెళ్దామని డిసైడ్ అయ్యారు అన్నమాట అని అంటుంది డాక్టర్. ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో నాకున్న దారి ఇదొక్కటే అని అంటుంది కృష్ణ మంచి నిర్ణయం తీసుకున్నారు అని అంటుంది డాక్టర్. పిల్లలు పుట్టారని బాధపడుతూ కూర్చోకుండా తొందరగా ఒక నిర్ణయం తీసుకున్నారు అని అంటుంది. మీరు పర్సనల్గా తీసుకొని ఈ ప్రాసెస్ అంతా బాగా జరిగేలాగ చేయాలి అని అంటుంది కృష్ణ. ఈ సరోగసి కేసు నేను డీల్ చేయట్లేదు కృష్ణ. తెలుసు మేడం పరిమళ మేడమ్ ఉన్నట్లయితే, అప్రూచ్ అయే వాళ్ళం ఇప్పుడు అవిడ లేరు కాబట్టి మిమ్మల్ని తప్పితే వేరే వాళ్ళని నమ్మలేము అని అంటుంది. ఇందులో నమ్మేదేముంది కృష్ణ నువ్వు డాక్టర్ వే కదా ప్రాసెస్ అంతా నీకు తెలుసు కదా అని అంటుంది మహేశ్వరి డాక్టర్. ఏ జాగర్త లు తీసుకోవాలి కూడా నీకు తెలుసు కదా కృష్ణ అని అంటుంది. నమ్మడం అంటే ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా చేయాలి అని అంటాడు మురారి. ఈ విషయం గురించి మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఏ డాక్టర్ అయినా కానీ ఈ విషయాన్ని బయటికి చెప్పదు. మీరు అంతగా ఆలోచిస్తున్నారు కాబట్టి నాకు తెలిసిన డాక్టర్ని సజెస్ట్ చేస్తాను ఆవిడ పేరు వైదేహి అని అంటుంది. ఆవిడ సరోగసి చేయడంలో చాలా ఎక్స్పెక్ట్, ఇలాంటి కేసులు ఆవిడ చాలా చేశారు. ఆల్మోస్ట్ అన్ని సక్సెస్ నేను ఆవిడకి చెప్తాను మీరు వెళ్ళండి అని అంటుంది. పరిమళా ఉన్నట్టయితే ఈ టెన్షన్ అన్ని మాకు తప్పేమీ అని అంటాడు మురారి. ఇంతకీ ఆవిడ ఎప్పుడు వస్తుంది అని అడిగితే మీ ఫ్రెండే కదా మీరే కనుక్కోండి అని అంటుంది మహేశ్వరి. ఆవిడ అర్జెంట్ పని ఉండి వెళ్లాల్సి వచ్చింది లేదంటే వెళ్లే వాళ్ళు కాదు అని అంటుంది. నాకు తెలిసి రావడానికి ఇంకా టూ మంత్స్ పైనే పడుతుంది. ఇట్స్ ఓకే మేం ఏదో క్యాజువల్ గా అడిగాము అని అంటుంది కృష్ణ. రేపు డాక్టర్ వైదేహి మేము కలుస్తాం అని అంటుంది. నేను ఇప్పుడే కాల్ చేసి చెప్తాను అని అంటుంది మహేశ్వరి.

ఇక ముకుందా ఇప్పటివరకు అంతా నేను అనుకున్నట్లే జరిగింది. కృష్ణ పిల్లల్ని కనియోగం ఉండకూడదు అనుకున్నాను జరిగింది. సరోగసి నిర్ణయం తీసుకోవాలి అనుకున్న అదే తీసుకున్నారు. దానికోసం వాళ్ళు డాక్టర్ వైదేహి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నా వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. ఇక మురారి నా దగ్గరికి రాకుండా ఎవరూ ఆపలేరు నా రూపం మరి నా మనసు మాత్రం మురారి కోసమే, నీ మీద ప్రేమ నాకు కొంచెం కూడా తగ్గలేదు మురారి అని అనుకుంటుంది. ఆ ముకుందా నీ వెనకాల పడితే ఈ ముకుంద వెనకాల నువ్వు పెడతావు నా కొంగు పట్టుకుని తిరిగేలా చేసుకుంటాను అని అంటుంది. ఇక కృష్ణ మురారి ఇద్దరు వైదేహి దగ్గరికి వెళ్తారు. కృష్ణ మురారి మీ కోసం వచ్చారు అని చెప్తుంది నర్స్. అప్పుడే ముకుందా వైదేహి కి కాల్ చేసి కృష్ణ మురారి నీ దగ్గరికి వచ్చారా అని అడుగుతుంది ఆ వచ్చారు ఇప్పుడే నర్స్ చెప్తుంది అని అంటుంది వైదేహి. అయితే వాళ్ళని కాసేపు వెయిట్ చేయమని చెప్పు నీతో నేను కొంచెం మాట్లాడాలి అని అంటుంది. నర్స్ కి కాసేపు వాళ్ళని ఎదురు చూడమని చెప్పు డాక్టర్ గారు అర్జెంటు పనిలో ఉన్నారని చెప్పు అని పంపించేస్తుంది. ఇప్పుడు చెప్పు ముకుందా అని అంటుంది వైదేహి. నేను చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి నువ్వు అని ముకుందా తన ప్లాన్ మొత్తాన్ని వైదేహి కి చెప్తుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో కృష్ణ మురారి ఇద్దరు ఇంటికి వచ్చేసరికి భవానీ దేవి ఇంట్లో అందరూ కలిసి పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. భవాని దేవి కృష్ణని హగ్ చేసుకుని నువ్వు చెప్పకపోయినా నాకు అంతా తెలుసులే అని అంటుంది. ఏం తెలుసు అత్తయ్య అని అడుగుతుంది కృష్ణ నువ్వు తెచ్చుకున్న మామిడికాయలే నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్తున్నా అని అంటుంది. అందుకోసమే ఈ పార్టీ అంతా అరేంజ్ చేశాను అని అంటుంది దాంతో కృష్ణ మురారి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు.

Related posts

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N