NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi April 29 2024 Episode 396: అనామికని కొట్టడానికి వచ్చిన కనకం.. కేసు వాపస్ తీసుకోవడానికి దారి వెతికిన కావ్య.. బిడ్డ రహస్యం తో పూల బొకే కి లింక్..

Brahmamudi Today Episode April 29 2024 Episode 396 highlights

Brahmamudi April 29 2024 Episode 396:  ఈరోజు ఎపిసోడ్ లో, కళ్యాణ్ పోలీసులతో పాటు వెళ్లిపోతాడు దానితో ప్రకాశం ఆవేశంగా, నేను నిన్ను చేసుకొని బాధపడుతున్నాను వాడు ఆ పిల్లని చేసుకొని అనుభవిస్తున్నాడు. కోడలు అని వెనకేసుకొచ్చినందుకు బాగా చేసింది అని అంటాడు. అపర్ణ కూడా అనామికదే తప్పన్నట్లు మాట్లాడుతుంది ఇక అనామిక అందరూ నాదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు అప్పుతో తిరుగుతున్నప్పుడు ఏం చేశారు మీరంతా అని అడుగుతుంది. వెంటనే స్వప్న మాట్లాడుతూ అప్పు కల్యాణే పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు కాదు నీ బాబు దిగి వచ్చినా సరే, కళ్యాణి అదే లేపకపోయి పెళ్లి చేసుకునేది తెలుసా నీకు అని అంటుంది. ఇంట్లో అక్కడ నిద్ర ఉన్నాం కాబట్టి, నువ్వు నింద వేసిన భరిస్తుంది. లేదంటే నల్లిని నలిపినట్టు నలిపి పరేస్తుంది అని అంటుంది స్వప్న. వెంటనే ధాన్యం చాలు ఆపు నీ చెల్లిని అదుపులో పెట్టుకోవడం చేతకాక ఇలా మాట్లాడుతున్నావా అని అంటుంది. అనామికతో ధాన్యం ఎవరో దారిని పోయే, దానికోసం నా కొడుకు మీద కేసు పెడతావా నేను నీకు ఏ తక్కువ చేశాను అని అడుగుతుంది ధాన్యం. నేను నీకు ఎన్ని విషయాలు సపోర్ట్ చేశాను అని బాధపడుతూ అడుగుతుంది. చివరికి నువ్వు నాకు ఇచ్చే గౌరవం ఇదేనా అని అడుగుతుంది. నేనేం చేయమంటారు అత్తయ్య, ఈ కావ్య అక్క లా అని అనమిక అంటూ ఉంటే వెంటనే స్వప్న ఏ నోరు ముయ్ అసలు కావ్య గురించి మాట్లాడితే మొహం పగిలిపోతుంది అని అంటుంది. ఇందాకే పిచ్చిది అన్నావు, అది పిచ్చిది అయి ఓపిక పట్టట్లేదు కాపురం నిలబెట్టుకోవడానికి కష్టపడుతుంది. ఇంత జరిగినా సరే, నీలాగా పోలీస్ కేసు పెట్టిందా, దాని గురించి మాట్లాడే హక్కు నీకు లేదు అని వార్నింగ్ ఇస్తుంది స్వప్న. ఇంకొకసారి దాని జోలికి వెళ్ళావంటే, నిన్ను నీకు సపోర్ట్ చేసే వారిని కుర్చీ మడత పెట్టి అని తిట్టబోతుంటే వెంటనే కావ్య ఆపుతుంది ఏంటక్కా ఆ మాటలు అని స్వప్నని ఆపి పైకి తీసుకు వెళుతుంది కావ్య.

Brahmamudi Today Episode April 29 2024 Episode 396 highlights
Brahmamudi Today Episode April 29 2024 Episode 396 highlights

ఇక ధాన్యం బాధపడుతూ నీకు అసలు బుద్ధుందా ఇంతదాకా తీసుకొస్తావా నా కొడుకు దేవుడు లాంటి వాడు, వాడికి సద్ది చెప్పుకోవాలి కానీ ఇలా చేస్తావా అని అడుగుతుంది అనామికతో ధాన్యం. ఇంత దారుణంగా వాని అవమానిస్తావని అనుకోలేదు అని అంటుంది. ఇక రుద్రాన్ని ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్లి, తొందరపడకు ఇప్పుడు అరిచి లాభం లేదు, ఏం చేయాలో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఆలోచిస్తారు అని అంటుంది. నువ్వు ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే నీకూడా నీ మీద కూడా కేసు పెడుతుందేమో కదా అని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది ధాన్యాన్ని రుద్రాణి. అనామిక కోపంగా పైకి వెళ్ళిపోతుంది. రుద్రాణిని ధాన్యం ఎందుకు ఇక్కడకి తీసుకొచ్చావు అని అడుగుతుంది. నీ కోపం నాకు అర్థం అవుతుంది అని అంటుంది రుద్రాణి. కొడుకు అరెస్టు అయితే ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా అని అంటుంది ధాన్యం. ఇప్పుడు నా కొడుకుని అరెస్ట్ చేయించి నీ బాధ ఎలా ఉంటుందో తెలుసుకోమంటావా అని అంటుంది రుద్రాణి.నువ్వు ఆవేశం లో ఉన్నావు కాబట్టి నీ కోపంగా ఉంది. ఆలోచిస్తే జరుగుతున్న మంచి ఏంటో నీకు అర్థం అవుతుంది అని అంటుంది. కళ్యాణి అరెస్ట్ చేయించడం ఆనందమా అని అంటుంది. అబ్బాయి ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అనామికాకి ఏమన్నా కళ్యాణ్ అంటే ఇష్టం లేదా ప్రేమించి పెళ్లి చేసుకుంది అలాంటప్పుడు కళ్యాణ్ అరెస్టు అయితే ఆ అమ్మాయి బాధపడదా అని అంటుంది. మరి అలాంటప్పుడు ఎందుకు అరెస్ట్ చేయించింది అని అడుగుతుంది ధాన్యం నువ్వు అదే ఆలోచించమని చెప్తున్నాను అని అంటుంది. అనామిక చేసింది మంచి పని అని అంటే అదేంటి అని అడుగుతుంది ధాన్యం అవును ఇంట్లో ఎవరు చెప్పినా విన్నాడా చివరికి అనామిక చెప్పిన విన్నాడా అని అడుగుతుంది రుద్రాణి. అదే పనిగా నువ్వు కనకం ఇంటికి వెళ్లి మరీ ఆ వార్నింగ్ ఇచ్చావు అయినా ఏమన్నా ఆగారా అని అడుగుతుంది రుద్రాణి. ఒకరైన విన్నారా అని అడుగుతుంది. ఇప్పుడు ఇంత గొడవ జరగడానికి కారణం కూడా అదే కదా అని అంటుంది ధాన్యం. ఇప్పుడు కరెక్ట్ గా ఆలోచించావు అని అంటుంది. ఇంత కూడా జరిగింది కాబట్టి కళ్యాణ్ అప్పు కలవడానికి ఆలోచిస్తాడు. ఇక అప్పు సంగతి సరే సరే, దానికున్న పొగరు కి ఇలా జరిగింది కాబట్టి కళ్యాణ్ మొహం కూడా చూడదు అని అంటుంది. నువ్వు చెప్పింది నిజమే రుద్రాణి కొంచెం బాధ అనిపించినా కళ్యాణ్ మారడమే కదా కావాల్సింది అని అంటుంది ధాన్యం.

Brahmamudi Today Episode April 29 2024 Episode 396 highlights
Brahmamudi Today Episode April 29 2024 Episode 396 highlights

ఇక పోలీస్ స్టేషన్లో అప్పుకి సారి చెప్తాడు కళ్యాణ్. నువ్వెందుకు సారీ చెప్తున్నావు అని అడుగుతుంది అప్పు. నావల్లే కదా నువ్వు పోలీస్ స్టేషన్ కి వచ్చావు అని అంటే నువ్వు ఏమైనా కేసు పెట్టావా నీ వల్లే మన జరిగిందా అని అంటుంది. నీ భార్య మీద చేయి చేసుకున్నావు అది తప్పే కదా అని అంటుంది. నీ క్యారెక్టర్ గురించి చెడుగా మాట్లాడితే ఏం చేయమంటావు అని అడుగుతాడు కళ్యాణ్. అది నా ప్రాబ్లం అది నేనే చూసుకునే దాన్ని అని అంటుంది అప్పు. నేనేంటో నీకు తెలుసు నువ్వేంటో నాకు తెలుసు మనం తప్పు చేయలేదు అన్నప్పుడు ఇంకొకళ్ళు ఏమనుకుంటే మనకేంటి అని అంటుంది అప్పు. అనామిక నామీద మాత్రమే కేసి పెట్టి ఉంటే బాగుండేది అని అంటాడు కళ్యాణ్. అనవసరంగా నేను ఇందులో ఇన్వాల్వ్ చేసింది అని అంటాడు. దీనివల్ల నీ పోలీస్ జాబ్ ఏమవుతుంది అని అడుగుతాడు. నీ ఫ్యూచర్ గురించి ఆలోచించావా అని అంటాడు. అప్పుడే అక్కడికి రాజ్ కావ్య ఇద్దరు వస్తారు. బావ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతుంది అప్పు వదిన మీరు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అని అంటాడు కళ్యాణ్. పోలీస్ స్టేషన్ కి తప్పు చేసిన వాళ్ళు రావాలని రూల్ ఏమి లేదు అని అంటుంది కావ్య, అందుకు మీరిద్దరే ఎగ్జామ్పుల్స్ అని అంటుంది. మీరేం కంగారు పడొద్దు నేనున్నాను ఏదో ఒక రకంగా మిమ్మల్ని విడిపించుకుంటాను అని అంటాడు రాజ్. ఎస్ఐ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు రాజ్. సారీ సార్ నేను అమ్మాయికి చాలా నచ్చి చెప్పాను కానీ అమ్మాయి వినట్లేదు అని అంటాడు ఎస్ఐ. ఆ అమ్మాయికి మా తమ్ముడు మీద ఓవర్పోసివ్నెస్ అని అంటాడు రాజ్. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి మీపై అధికారులతో మాట్లాడమంటారా అని అంటే, ఆ అమ్మాయి పెట్టింది మామూలు కేసులు కాదు అని అంటాడు ఎస్ఐ. పైగా తను ఉండగానే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అని, కేసు పెట్టింది అని అంటాడు ఎస్ఐ. ఈ కేసు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి సార్ అని అంటాడు. చాలామంది ఇలాగే మిస్ యూస్ చేసుకుంటున్నారు చిన్న చిన్న విషయాలకు, వరకట్నం కేసు గృహహింసాకేసు పెడుతున్నారు ఇది అలాంటిదే అని అంటాడు. రేపు వీళ్ళని కోర్ట్ లో హాజరు పరిచాల్సిందే అని అంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం అండి అప్పు పోలీస్ జాబ్ కోసం ట్రైనింగ్ తీసుకుంటుంది. ఈ కేసులో తను నిర్దోషిగా బయటికి రాకపోతే తన కెరీర్ పాడైపోతుంది అని అంటుంది కావ్య. ఇన్స్పెక్టర్ అనామిక ఆరోపించినట్టు, వాళ్ళిద్దరూ అలాంటి ఉద్దేశం లేరు మంచి ఫ్రెండ్స్ అని అంటాడు రాజ్. దుగ్గిరాల పరువు పోకుండా మీరే ఏదో ఒక మార్గం చెప్పండి అని అంటాడు. ఇప్పుడు ఒకే ఒక అవకాశం ఉంది సార్ అని అంటాడు ఎస్ఐ. ఇది చాలా కాన్ఫిడెన్షియల్, మీ ఫ్యామిలీ మీద రెస్పెక్ట్ అని చెప్తున్నాను అని అంటాడు. ఇంకా నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. మీరు ఎలాగైనా అన మీకు నేను ఒప్పించి కేసు విత్ డ్రా చేసుకుని ఇలా చేయండి అని అంటాడు. కానీ అనామిక చాలా మొండి పట్టు పట్టింది అని అంటాడు రాజ్. వింటుంది అనామిక కేసు విత్ డ్రా చేసుకునేలా నేను చేస్తాను అని అంటుంది కావ్య. ఎవరు చెప్తే వింటుందో నాకు బాగా తెలుసు అని అంటుంది కావ్య. మీరు ఒకసారి బయటికి రండి అని రాజ్ ని కావ్య బయటికి తీసుకువెళ్తుంది.

Brahmamudi Today Episode April 29 2024 Episode 396 highlights
Brahmamudi Today Episode April 29 2024 Episode 396 highlights

ఇక మరోవైపు దుగ్గిరాల కుటుంబం మొత్తం డల్లుగా కూర్చుని ఉంటుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన రాజ్ ఇంకా ఫోన్ చేయలేదు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని అంటుందిరాదేవి అప్పుడే కుండీ పగిలిన సౌండ్ వస్తుంది. అందరూ అటు వైపు చూస్తే అక్కడ కనకం ఉంటుంది. అనామిక కూడా కంగారుగా కిందకి వస్తుంది. కనకం కోపంగా అనామిక దగ్గరికి వెళ్లి దిగవే అని అంటుంది. రావే ముందు కిందకి అని అంటుంది. అనామిక ఏంటి దౌర్జన్యం చేయడానికి వచ్చావా అని అడుగుతుంది. నీ సంగతి ఏంటో తేల్చుకోడానికి వచ్చాను అంటుంది. కనకం అని అరుస్తుంది ధాన్యం. ఏయ్ నువ్వు మాట్లాడకు అని అంటుంది. కొడుక్కి పెళ్లి చేసి చేతు దులిపేసుకోవడం కాదు, కోడలు వీధినేక్కి ఎలాంటి దరిద్రాన్ని తెస్తుందో తెలుసుకోవాలి అని అంటుంది. అన్ని తెలిసిందానివి నీ కూతుర్ని ఎందుకు కంట్రోల్ లో పెట్టుకోలేదు అని అంటే ఏయ్ మాటలు మర్యాదగా రా నువ్వు అని అంటుంది కనకం. ఏం చేసింది నా కూతురు నీ కోడలు చేసిన బాగోతాల్ని మా ఇంటికి వచ్చి చెప్పుకోమని చెప్పిందా లేదంటే నా ఇంటి చుట్టూ నీ కొడుకుని తిరగమని చెప్పిందా? ఏం చెప్పింది నా కూతురు అని అడుగుతుంది. లేదంటే ఈ జానాబెత్తడు లేని దాన్ని జుట్టు పట్టుకొని, బయటికి ఇచ్చి ఆ స్థానంలో కూర్చుంటానని చెప్పిందా నేను చేసింది నా కూతురు చెప్పు అని గట్టిగా అడుగుతుంది కనకంధాన్యాన్ని నీకు ఇలా మాట్లాడ్డానికి సిగ్గుగా లేదు , నీ కూతురు నా భర్త తిరుగుతుందని ఎన్నిసార్లు చెప్పినా, తిరగమని వదిలేసిన నీకే అంత పౌరుషం వస్తే, అని అనామిక అంటే పళ్ళు రాలుతాయి అని అంటుంది కనకము. నా సంగతి నీకు పూర్తిగా తెలియదు బయట పూల కుండీ పగిలినట్టు నీ తలకాయ పగులుతుంది అని అంటుంది. ఏమంటున్నావే సిగ్గుందా అని అడుగుతున్నావా, నువ్వు అసలు చదువుకున్నావా ఆడదానిగా పుట్టావా అని అడుగుతుంది. ఒక మగవాడితో ఒక ఆడపిల్ల మాట్లాడితే అంటగడతావా అని అడుగుతుంది. నీకే కనక సిగ్గు ఉంటే కళ్యాణ్ బాబుకి ఉత్తరాలు రాసి, ఫోన్ చేసి నీ చుట్టూ తిప్పుకునేదానివి కాదు, ఒక అబ్బాయి చుట్టూ తిరగమని చెప్పిన నీ తల్లిదండ్రులకు ఉందా సిగ్గు అని అడుగుతుంది. చూసారా అత్తయ్య ఎలా మాట్లాడుతుందో అని అంటుంది అనామిక. స్వప్న మాట్లాడుతూ ఇందులో అబద్ధం ఏముంది అని అడుగుతుంది. దుగ్గిరాల వాళ్లకి ఆస్తి ఉందనే కదా కోటీశ్వరుల కొడుకుని కదా మీ అమ్మానాన్నలతో కలిసి కళ్యాణ్ కి వలెవేసి పెళ్లి చేసుకున్నావు అని అడుగుతుంది. నువ్వన్న మాట కదా నీకు గుర్తు చేసింది అని అడుగుతుంది స్వప్న. షటప్ స్వప్న మీ అక్క చెల్లెలు పని చేసిన పని ఏంటి అని అంటుంది అనామిక అప్పుడే కనకం కోపం తో పూల కుండీ అనామిక పైకి ఎత్తుతుంది. నా కూతుర్ల గురించి ఇంకొక మాట మాట్లాడావంటే, నేను ఇక్కడే చంపేసి జైల్లో కెళ్ళి కూర్చుంటాను అని అంటుంది. వెంటనే ఇందిరా దేవి కనకం అని అరుస్తుంది. ఏమిటి వెర్రి ఆవేశం అన్ని పూల కుండీ తీసుకుంటుంది. కాస్త ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచించు అని అంటుంది.

Brahmamudi Today Episode April 29 2024 Episode 396 highlights
Brahmamudi Today Episode April 29 2024 Episode 396 highlights

ఇక కనకం మాట్లాడుతూ బాధగా, ఏం ఆలోచించమంటావమ్మా, ఆడపిల్లని కనీ మీ ఇంటికి పంపించిన అప్పటినుంచి మేము సైలెంట్ గానే ఉన్నాము. మా కన్నా మీరు ఇందులో ఎక్కువ మీ కన్నా మేము ఇందులో తక్కువ అని అడుగుతుంది. ఇవాళ జరిగింది ఏంటో మీకు తెలుసు, ఇది అన్యాయం అని ఎవరు అడగరా అని అంటుంది. ఇది అమానుషమని ఎవరు నిలదీయరా అని అంటుంది. మీ ఇంటి వారసుని పోలీసులకు అప్పచెప్పిన ఈ బరితెగించిన ఆడది, ఒక మహారాణిలా పై నుంచి దిగి వచ్చినట్టు, ఒక్కో మెట్టు దిగి వస్తుంటే ఇదేంటి అని ఎవరు ప్రశ్నించరా అని అంటుంది. ఎవరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు తెలుసా అని అంటుంది అనామిక, ఎందుకంటే నేను ఎన్నిసార్లు చెప్పినా కళ్యాణ్ నీ కూతురుతో తిరగడం మానేయలేదు కాబట్టి, వెంటనే కనకం ఆవేశంగా ఏయ్ అని అరుస్తుంది. నా కూతురు కళ్యాణ్తో తిరుగుతుంది అన్నమాట మాట్లాడావో, నాలుక చీరేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. నా కూతురు బంగారం ఒకవేళ అదే కానీ కళ్యాణ్ చేసుకోవాలి అని అనుకుంటే, నిన్ను కళ్యాణి కలపడానికి అది ఎందుకు కష్టపడేది అని అంటుంది నిన్ను కళ్యాణ్ ఒకటి చేయడానికి మధ్యవర్తిత్వం ఎందుకు చేసింది. అవన్నీ మర్చిపోయావా తలకాయ లేదా నీకు అందులో మెదడు లేదా, నిన్ను కన్న వాళ్ళు ఎవరో ఒకరిని చూసుకొని, వాడి కోటీశ్వరుడు అయితే చాలు అనుకొని నిన్ను పంపించలేదా, నువ్వు చేసింది ఏంటి ఇందులో నా కూతురు తప్పేంటి అని అడుగుతుంది. కలిసి మాట్లాడితేనే కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇద్దరికి కలిసి సంబంధం అంట కడతావా, అని అంటుంది కనకం. ఎందుకు అంత ఆవేశంగా మాట్లాడుతున్నావ్ అని అంటుంది రుద్రాణి. ఇది పంపు సెట్ కాదు, దుగ్గిరాల ఇంటి కుటుంబం అని రుద్రాణి. దుగ్గిరాల వంశం అయితే ఏంటి అని అంటుంది కనకం మీలాంటి వాళ్ళకి ఇక్కడ అడుగు పెట్టారు అర్హత కూడా లేదు అని అంటుంది రుద్రాణి. మరి నువ్వు ఎందుకు మొగుణ్ణి వదిలేసి ఇక్కడ ఉంటున్నావు అని అంటుంది. వెంటనే ధాన్యం కనకం అని అరుస్తుంది. నోరు ముయ్ రేపొద్దున నీ కొడుకు, పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి అనామికని ఎగిరితే అది కూడా వెళ్లి పుట్టింట్లో పడాల్సిందే అప్పుడు నువ్వు కూడా ఇలానే బాధపడతావు అని అంటుంది. మీరందరూ ఇక్కడ నోరు ఎత్తదు అంటే నేను వీధిలోకి వెళ్లి అరవాల్సి ఉంటుంది అని అంటుంది. మీరందరూ దుగ్గిరాల ఏంటి సభ్యులు బతికిపోయారు. నేను ఇంటికి ఎలాంటి మచ్చా రాకూడదని వీధిలోకి వెళ్లి గొడవ చేయట్లేదు. మీ వంతు ఏదైనా మిగిలి ఉంటే మా వీధి కులాయి దగ్గరికి రండి బిందెలతో సన్మానం చేస్తాను అని అంటుంది. అపర్ణ కనకం ఒక ఆడపిల్ల, మీద అనవసరంగా నిందలు వేసి, ఆ పిల్ల భవిష్యత్తు పాడు చేయాలనుకోవడం తప్పే అని అంటుంది. మీ అమ్మాయి మీద నిందలు వేసిన అది మా కళ్యాణ్ కి మచ్చ లాంటిదే అని అంటుంది. మీ అమ్మ ఎలాంటిదో మాకు తెలుసు అని అంటుంది. వీళ్లకు తెలీదు అని అంటుంది. నువ్విలా ఇంటి మీదగా దండ ఎత్తి రావటం,ఇక్కడ పెద్ద వాళ్ళు ఉన్నారని మర్చిపోవడం, ఇదేం బాలేదు అని అంటుంది అపర్ణ. కడుపులో మంటమ్మ దానికి ఇంకా పెళ్లి కాలేదు, ఈ అత్తా కోడలు దానిమీద నిందలు వేసి అరెస్ట్ చేయించారు. పెళ్లి కావాల్సిన ఒక ఆడపిల్లని పోలీసులు ఇలా తీసుకెళ్లారని తెలిస్తే దానికి పెళ్లి అవుతుందా అని అడుగుతుంది. రేపు దాని జీవితం ఏమవుతుంది దాని భవిష్యత్తు, ఏమవుతుంది. జైలు కెళ్తే నా బిడ్డ ఏమవుతుంది. ఇది ఆవేశం కాదు ఒక కన్నతల్లి ఆర్తనాదాలు అని అంటుంది. అది నువ్వు ఇక్కడికి వచ్చి అరిస్తే ఏం లాభం అని అంటుంది రుద్రాణి. మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి మీ అమ్మాయితో కళ్యాణి ఇంకెప్పటికీ కలవడం మీ అమ్మాయి కూడా కళ్యాణి కలవదని పేపర్ రాసి ఇవ్వండి వాళ్ళు దయతలిసి వదిలిపెడితే వదిలిపెడతారు అని అంటుంది అనామిక. వెంటనే నేను రాసివ్వను అలా రాసిస్తే నా కూతురు తప్పు చేసిందని నేనే ఒప్పుకున్నట్లు అని అంటుంది. నాకు కావాల్సింది న్యాయం కానీ నేను మాత్రం ఎక్కడా తగ్గను అని అంటుంది కనకం. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Brahmamudi Today Episode April 29 2024 Episode 396 highlights
Brahmamudi Today Episode April 29 2024 Episode 396 highlights

రేపటి ఎపిసోడ్ లో, కావ్య ఇంటి ముందు ఎవరో బొకే తీసుకొచ్చి పడేస్తారు. దానిమీద మై డియర్ కళావతి హ్యాపీ అనివేర్స్ డే అని రాసి ఉంటుంది. అయితే ఈ ఒకే మా ఆయన నా పెళ్ళి రోజు నాకు ఇవ్వడానికి కొన్ని బొకేనా అయితే ఆయన ప్రేమతో నాకు ఈ బొకే ఇద్దామనుకుంటే, నాకు ఇచ్చేలోపు బిడ్డను తీసుకొని ఎందుకు వచ్చారు. అంటే ఇది కొనడానికి ఆ బిడ్డను తీసుకొని రావడానికి ఈ మధ్య ఏదో జరిగింది. అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది కావ్య.

Related posts

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

Brahmamudi May 15 Episode 410: సుభాష్ నుంచి నిజం రాబట్టిన కావ్య.. మాయ కోసం భార్యాభర్తల వేట..కావ్య కిడ్నాప్.. ఊహించని ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema May 15 Episode 624: కుటుంబ సభ్యుల ఆకలి తీర్చిన అక్క చెల్లెలు.. అరవింద, విక్కీ ల బాధ.. ఉద్యోగం కోసం విక్కీ ప్రయత్నం..

bharani jella

Karthika Deepam 2 May 15th 2024 Episode: దీపని ఇమిటేట్ చేస్తూ నవ్వులు పూయించిన కార్తీక్.. జ్యోత్స్నని పూర్తిగా మార్చేసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 15 Episode 470: ముకుంద ప్లాన్ సక్సెస్.. టెన్షన్లో కృష్ణ మురారి.. మీరా పుట్టినరోజుకి గిఫ్టుగా ఆదర్శని ఇచ్చిన భవాని.. పెళ్లి ఆపాలన్న ముకుంద..

bharani jella