Venkatesh: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి రామసహాయం రఘురాం రెడ్డి మద్దతుగా ఆయన వియ్యంకుడు, సినీ నటుడు విక్టరీ వెంకటేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం ఖమ్మం పట్టణంలో నిర్వహించిన రోడ్ షో కు వెంకటేష్ అభిమానులతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.
దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ వెంకటేశ్ ముందుకు సాగారు. రామసహాయం రఘురాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.