NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలోనే… మరో ఉప ఎన్నిక తెరపైకి వచ్చింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పోయి ఎన్నికకు ఇటీవల నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ఎన్నికల సంఘం. మే రెండవ తేదీన ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బరిలో ఉన్నారు.

అటు గులాబీ పార్టీ తరఫున ఏనుగుల రాకేష్ రెడ్డిని కేసీఆర్ కన్ఫామ్ చేశారు. దీంతో ఈ ఉప ఎన్నికలు రసవత్తర పోరు జరగనున్నట్లు తెలుస్తోంది. పళ్ళ రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఈ ఉపనిక ఖరారు అయింది. గతంలో కూడా పళ్ళ రాజేశ్వర్ రెడ్డి చేతిలో తీన్మార్ మల్లన్న ఓడిపోయాడు. ఓటర్లందరూ అల్లా రాజేశ్వర్ రెడ్డి వైపు మగ్గడంతో… చిత్తుచిత్తుగా తీన్మార్ మల్లన్న ఓడిపోయారు.

అయితే ఇప్పుడు కూడా తీన్మార్ మల్లన్న ఓడించేందుకు కేసీఆర్… చాలా వ్యూహాత్మకంగా ఏనుగుల రాకేష్ రెడ్డిని బరిలోకి దింపారు. మొన్నటివరకు బిజెపి పార్టీలో చాలా కీలక లీడర్ గా రాకేష్ రెడ్డి కొనసాగారు. అయితే తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసి బిజెపి నుంచి బయటకు వచ్చి గులాబీ పార్టీలో చేరారు రాకేష్ రెడ్డి. వాస్తవానికి రాకేష్ రెడ్డి మంచి యంగ్ లీడర్. వరంగల్లో బిజెపి పార్టీ ఏమాత్రం లేదు. కానీ రాకేష్ రెడ్డి బిజెపిలో చేరిన తర్వాత వరంగల్లో బిజెపి పార్టీలో చేరిన వారు చాలామంది ఉన్నారు.

ప్రతి గ్రామంలో బిజెపి కార్యకర్తలను సృష్టించాడు రాకేష్ రెడ్డి. పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. కానీ చివరికి రాకేష్ రెడ్డికి ఎగనామం పెట్టింది బిజెపి అధిష్టానం. దీంతో గులాబీ పార్టీలోకి వచ్చేసాడు. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే కేసీఆర్… రాకేష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు. యూత్ లో రాకేష్ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే పాత బిజెపి క్యాడర్ మొత్తం రాకేష్ రెడ్డికి సపోర్ట్ గా ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ 4 నెలల పాలనపై నిరుద్యోగులు అలాగే ప్రజలు, పట్టబద్రులు అందరూ తీవ్ర కోపంతో ఉన్నారు.

ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రేవంత్ రెడ్డి… వాటి జోలికి వెళ్లడం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇటు తీన్మార్ మల్లన్న… కూడా నిరుద్యోగుల కోసం పోరాడుతానని చెప్పి… ఇప్పటికి కూడా కేసీఆర్ను తిడుతూ తన యూట్యూబ్ ఛానల్ ను నడుపుతున్నాడు. దీంతో తీన్మార్ మల్లన్న వార్తలను కూడా ఎవరూ చూసే ప్రయత్నం చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీని జోకడం తప్ప దీన్ని తీన్మార్ మల్లన్న జనాల కోసం ఏం చేసింది లేదని.. అందరూ అంటున్నారు. ఈ లెక్కలన్నీ పరిశీలిస్తే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి మైలేజ్ వస్తుందని తెలుస్తోంది. మరి పట్టభద్రులు ఎటువైపు ఉంటారో చూడాలి. కాగా ఈ ఎన్నిక మే 27వ తేదీన జరుగునుంది. ఈ నియోజకవర్గంలో 4.61 లక్షల మంది పట్టభద్రులు ఉన్నారు.

Related posts

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట..షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు

sharma somaraju

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju

Kajal Aggarwal-Payal Rajput: కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పోటీకి సై అంటున్న‌ పాయ‌ల్‌.. పెద్ద రిస్కే ఇది..!

kavya N

NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

sharma somaraju

Indigo Flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ..అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణీకుల దించివేత

sharma somaraju

వైవీ. సుబ్బారెడ్డి VS బొత్స‌.. ఇలా జ‌రిగితే పేద్ద ర‌చ్చ రంబోలానే..?

‘ పిన్నెల్లి ‘ ఎపిసోడ్ వైసీపీకి ఎంత దెబ్బ కొట్టిందంటే…?

బాబుకు-జ‌గ‌న్‌, జ‌గ‌న్‌కు-ష‌ర్మిల మామూలు దెబ్బ కొట్ట‌లేదుగా…?