NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari June 06 Episode 489: శ్రీనివాస్ ని కలిసిన కృష్ణ.. మురారిని దాచింది ముకుంద అన్న నిజం కృష్ణకి తెలియనుందా? రేపటి ట్విస్ట్ ..

Krishna Mukunda Murari Today Episode June 6 2024 Episode 489 highlights

Krishna Mukunda Murari June 06 Episode 489: భవానీ దేవి మీరా మీరా అనుమానంతో మీరావణ బస్తీకి వెళ్లి తను ఎలాంటిదో కనుక్కోవాలి అని అనుకుంటుంది. కానీ అప్పటికే బస్తీలో మీరా అంతకు ముందు ఉన్న ఇంట్లోనే ఒక మనిషిని మీరా సెట్ చేసి పెడుతుంది సరోజా అన్న పేరుతో అక్కడ ఒక ఆవిడ ఉంటుంది మీరా గురించి భవానీ దేవి అడగ్గానే సరోజ చాలా మంచిదని అనాధాశ్రమం నుంచి వచ్చినా మమ్మల్ని చాలా బాగా చూసుకునేదని మీరా గురించి చాలా మంచిగా చెప్తుంది. ఆ మాటలన్నీ విని భావా నీకు ఏమీ అర్థం కాదు అప్పుడే అక్కడికి మీరా వచ్చి భవాని దేవిని చూసి కంగారుగా పక్కన దాక్కుంటుంది. ఈ భవానీ దేవి ఇక్కడికి ఎందుకు వచ్చింది ఈవిడ గనుక నిజం రాబట్టింది అంటే నా పని అంతే అని అనుకుంటుంది మీరా మనసులో, భవాని దేవి సరోజితో మాట్లాడి సరే నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే మీరా మురారిని అదే బస్తీలో అదే ఇంట్లో ఉంచుతుంది కరెక్ట్ గా భవానీ దేవి మురారిని చూసే టైం కి సరోజ భవాని ని పిలుస్తుంది. భవానీ మురారి లోపల ఉన్న విషయం చూడదు, సరోజా తో మాట్లాడి వెళ్ళిపోతుంది. భవాని వెళ్ళిపోయిన తర్వాత మీరా సరోజ దగ్గరికి వచ్చి ఆవిడ మురారిని చూసిందా అని అంటుంది లేదు మేడం కొంచెం ఉంటే చూసేది అని అంటుంది సరోజ జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా అంటుంది. జాగ్రత్తగా ఉన్నాను అని అంటుంది సరోజ. ఇక భవానీ దేవి ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode June 6 2024 Episode 489 highlights
Krishna Mukunda Murari Today Episode June 6 2024 Episode 489 highlights

భవాని దేవి ఇంట్లో కనిపించకపోయేసరికి రేవతి కంగారుపడుతుంది భవానిని చూసి కిందకి వచ్చి అక్క ఎక్కడికి వెళ్లావు నువ్వు ఎక్కడికి వెళ్లావు తెలియదు కృష్ణ ఎక్కడికి వెళ్ళిందో తెలియక నేను ఎంత కంగారు పడుతున్నాను అని అంటుంది. భవాని ఆ మీరా గురించి కనుక్కోడానికి వెళ్లాను ఆమె చాలా మంచిదని అక్కడ వాళ్ళు చెప్తున్నారు అని అంటుంది. అప్పుడే అక్కడికి ఆదర్శ్ వచ్చి వాళ్ళు చెప్తుంది నిజమే కదా అని అంటాడు. మీరా అబద్ధం చెప్పడం లేదు మురారి తప్పు చేశాడు అందుకే ఇంట్లో నుంచి పారిపోయాడు ఆ మురారిని కాపాడుకోవడం కోసం ఈ కృష్ణ కూడా అబద్ధం చెప్తుంది అని అంటాడు. కానీ రేవతి మాత్రం అలా ఏం జరగదు నా కొడుకు ఏ తప్పు చేయలేదు అలా చేస్తే కృష్ణమురారి కి సపోర్ట్ చెయ్యదు మురారి గురించి నాకు బాగా తెలుసు అని అంటుంది మధు కూడా ముకుందదే తప్పు అని మాట్లాడుతాడు దీంతో ఇక భవాని అవును నాకు మురారి తప్పు చేయలేదని అనిపిస్తుంది కానీ మీరే చెప్తుంది అబద్ధమని మాత్రం అనిపించట్లేదు కృష్ణ చెప్పినట్లు ఆ బిడ్డ మురారి కృష్ణుల బిడ్డ అయితే, మరి ఆ నిజాన్ని ఒప్పుకోవాలి కదా మురారి ఎందుకు పారిపోయాడు లేదు ముకుంద చెప్పిందే నిజం అనుకుంటే మరి అలాంటప్పుడు మురారి తప్పు చేసినట్లే కదా కృష్ణ ఎందుకు వెనకేసుకొస్తుంది నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అని అంటుంది భవాని, ఏది ఏమైనా ముకుంద కడుపులో పెరుగుతుంది మాత్రం మురారి బిడ్డే ఈ ఇంటి వారసుడే, అంత వరికి అందరికీ నిజమని అర్థమైంది కదా అని అంటుంది. ఆ మాటలకి ఆదర్శ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari Today Episode June 6 2024 Episode 489 highlights
Krishna Mukunda Murari Today Episode June 6 2024 Episode 489 highlights

ఇక మరోవైపు కృష్ణ శ్రీనివాస్ ఇంటికి వెళ్తుంది. ముకుంద ఫోటో నీ కింద పడేస్తుంది అది చూచి శ్రీనివాస్ ఏమైంది కృష్ణ నువ్వేనా ఇలా చేస్తుంది అని అడుగుతాడు అవును నేనే అని కోపంగా అంటుంది కృష్ణ. చనిపోయిన వాళ్ల మీద ఎందుకు అమ్మ నీకు ఇంత కోపం అని అంటాడు చనిపోయిన వాళ్ళ అంటే మీ అమ్మాయి నిజంగా చనిపోయిందా అని అడుగుతుంది. చెప్పండి బాబాయ్ అడుగుతున్నాను కదా మీ కూతురు నిజంగానే చనిపోయిందా అని అంటుంది. వెంటనే శ్రీనివాస్ కి విషయం మొత్తం అర్థం అయిపోతుంది మీర నే ముకుందా అన్న నిజం తెలిసిపోయినట్టుంది. అని మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే కృష్ణ మీ అమ్మాయి చనిపోలేదన్న విషయం మీకు తెలుసు కదా తన అక్కడ ఏం చేస్తుందో మీకు తెలుసా అసలు అని అంటుంది కృష్ణ. తను రూపం మార్చుకుని మా ఇంటికి వచ్చి నన్ను ఎంత ఇబ్బంది పెడుతుందో తెలుసా ఇప్పుడు దాన్ని చేస్తున్న పని గురించి మీకు అసలు ఏమైనా తెలుసా అని అంటుంది. తన కడుపులో నా బిడ్డను పెంచుకుంటూ తన బిడ్డ అని చెప్తుంది ఇప్పుడు మురారి మీద నింద వేసి ఇంట్లో గందరగోళం సృష్టించింది ఇంత తప్పులు చేస్తున్నా కానీ మీరు సైలెంట్ గా ఉంటే ఎలా బాబాయ్ అని అడుగుతుంది. మీకు నిజం ఏంటో తెలుసు ఆ నిజాన్ని మీరు నాతో చెప్పడం కాదు ఇంటికి వచ్చి మా ఇంట్లో అందరి ముందు చెప్పండి అని అడుగుతుంది. మీరు అసలు ఏం తండ్రి బాబాయ్ మిమ్మల్ని చూస్తుంటేనే నాకు కోపంగా ఉంది మీకు అసలు పిల్లల్ని పెంచడం రాదు. ఎవరైనా కూతురు తప్పు చేస్తే చూసి ఊరుకుంటారా ఇదేనా మీ పద్ధతి నా జీవితాన్ని తలకిందులు చేసింది ఆ ముకుందా అని కృష్ణ ఏడుస్తూ శ్రీనివాస్ ముందు బాధపడుతుంది.

Krishna Mukunda Murari Today Episode June 6 2024 Episode 489 highlights
Krishna Mukunda Murari Today Episode June 6 2024 Episode 489 highlights

ఇక శ్రీనివాస్ మాట్లాడుతూ అవును నా కూతురు తప్పు చేస్తుందని నాకు తెలుసు కానీ నేనేం చేయలేను నీలాగా చెప్తే మాట వినే రకం కాదు నా కూతురు తను ఏది అనుకుంటే అదే చేస్తుంది నన్ను కూడా లెక్క చేయదు ఆ విషయం నీకు తెలుసు కదా కృష్ణ అని అంటాడు. అయితే మీరు మా ఇంటికి వచ్చి మా అత్తయ్య దగ్గర నిజం చెప్పండి చాలు అని అంటుంది కానీ శ్రీనివాస్ మాత్రం నేను అలా చెప్పను అని అంటాడు. అదేంటి బాబాయ్ ఎందుకు చెప్పరు అని అడుగుతుంది కృష్ణ ఎందుకు చెప్పాలి చెప్పు నీ కన్నా ఎక్కువ నా కూతురే మురారి అని ప్రేమించింది. నువ్వు కొంతకాలం మురారితో అగ్రిమెంట్ చేసుకుని ఉన్నావు ఆ తర్వాత మీ ఇంటికి వెళ్లిపోయి కొన్ని రోజులు ఉన్నావు కానీ నా బిడ్డ మాత్రం మీ ఇంట్లో ఎన్ని అవమానాలు జరిగినా ఎంత గొడవలు జరిగినా ఎంత మంది ఎన్ని మాటలు అన్నా కూడా మురారి కోసం అదే ఇంట్లో ఉన్నది. ఇప్పుడు నా కూతురు నేనేం చెప్పి ఆపమంటావు? నా కూతురు అలాగే అయితే అసలు ఇలా రూపం మార్చుకుని మీ ముందుకు వచ్చేదే కాదు, ఇప్పుడు నా కూతుర్ని నేను ఆపలేను నీకు ఆల్రెడీ అంతా నిజం తెలిసిపోయింది నువ్వేం చేసుకుంటావో చేసుకో నాకు సంబంధం లేదు, ఇకనుంచి మాత్రం దయచేసి వెళ్ళిపో నన్ను మాత్రం మా ఇంటికి వచ్చి నిజం చెప్పమని అడగద్దు అని అంటాడు దానితో కృష్ణ ఏం చేయలేక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari Today Episode June 6 2024 Episode 489 highlights
Krishna Mukunda Murari Today Episode June 6 2024 Episode 489 highlights

ఇక మరోవైపు మురారి దగ్గరికి ముకుంద వెళుతుంది. ఇప్పటికే మురారి కృష్ణను తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఏంటి మురారి బాధపడుతున్నావా కళ్లనిండా నీళ్లు వస్తున్నాయి అని అడుగుతుంది. ఏమైనా బాధగా ఉందా అని అడిగి ఇది మనసులో ఉన్న బాధ ఉంటుంది అందుకే కన్నీళ్లు ఆగకుండా వస్తున్నాయి అని అంటుంది. అర్థమైంది నువ్వు ఆ కృష్ణ గురించి బాధపడుతున్నావా అని అంటుంది. నీకు చెప్పాను కదా మురారి ఆ కృష్ణ ని మర్చిపోమని అని అంటుంది అది ఈ జన్మలో జరగదు అని అంటాడు. ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు అని అడుగుతాడు నేను నిన్ను హింసిస్తున్నానా? ఎంత మాట మాట్లాడావు మురారి నేను నీ ప్రాణాన్ని కాపాడాను. నేను ఇంట్లో గర్భవతి అని తెలియగానే నువ్వు రోడ్డు మీద పడ్డావు అప్పుడు నీకు యాక్సిడెంట్ అయ్యి నువ్వు కదలలేని పరిస్థితిలో ఉంటే నేనే కదా కాపాడి తీసుకొచ్చింది. అప్పుడే ప్రాణం పోయి ఉంటే బాగుండేది అని, నా కథలేని స్థితిలో నీ దగ్గరికి రావడం నాకు అసలు ఇష్టం లేదు అని అంటాడు కానీ నాకు అవసరం మురారి అని అంటుంది ముకుంద. నువ్వు ఇలా మాట్లాడితే నేను ఏమైపోవాలి నువ్వు త్వరగా కోలుకోవాలి నాతో కలిసి అడుగులు వేయాలి. అదే నా కోరిక నువ్వు నా ప్రాణం అంటూ మాట్లాడుతుంది. కానీ మురారి మాత్రం చాలా కోపంగా ఉంటాడు. ఎందుకు అంత కోపంగా ఉన్నావు మురారి నువ్వు నా సొంతం కావాలనే కదా నేను ఇదంతా చేసింది అందుకే నా కడుపులో పెరిగే బిడ్డకు నువ్వే తండ్రివని ఇంట్లో అందరికీ చెప్పేశాను ఇక కృష్ణ నొక్కదాన్ని నమ్మిస్తే చాలు అని అంటుంది. కానీ కృష్ణను నమ్మించడం నాకు పెద్ద పని ఏం కాదు అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode June 6 2024 Episode 489 highlights
Krishna Mukunda Murari Today Episode June 6 2024 Episode 489 highlights

కానీ నువ్వు మాత్రం కృష్ణుని మర్చిపోవాలి లేదంటే కృష్ణకి ప్రాణానికి ప్రమాదం ఆలోచించుకో అని అంటుంది. ఇంట్లో ఎంతమంది ఎన్ని చెప్పినా కృష్ణా మాత్రం నా గురించి నువ్వు ఎంత చెప్పినా నమ్మదు అని అంటాడు. ఎందుకు నమ్మకుండా ఉంటుంది మురారి ఒకసారి ఆలోచించు నేను చెప్పే రీతిలో చెప్తే ఒక ఆడదాని మనసులో అనుమానాన్ని రగిలించలేనా, నా గురించి నీకు తెలుసు కదా అని అంటుంది. ఒకసారి నేను కృష్ణని చూడాలి అని మురారి అడుగుతాడు సరే చూపిస్తాను ఒకసారి నువ్వు కృష్ణ ని చూస్తే అదే ఆఖరి చూపు అవ్వాలి ఇకమీదట కృష్ణుని మళ్లీ చూడకూడదు అలా అంటే చెప్పు చూపిస్తాను. అని అంటుంది. మురారి బాధపడుతూ ఉంటాడు. మీరా అలియాస్ ముకుందా మురారి నీ మాటలతో హింసిస్తూ ఉంటుంది. నువ్వు ఇక నుంచి తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో నువ్వు నా దారిలోకి వచ్చేంతవరకు ఇలా బెడ్ మీద ఉండేటట్లు నేను ఏర్పాటు చేశాను నువ్వు వేసుకునే టాబ్లెట్ల వల్ల నీకు ఉపయోగం ఉండదు. నువ్వు నామీద ప్రేమను పెంచుకుంటే నువ్వు ఇకనుంచి లేవగలుగుతావు నేను ఎలా ప్లాన్ చేశాను అని అంటుంది. నువ్వు లేచి కృష్ణ దగ్గరికి వెళ్లే కన్నా ఇలా బెట్టు మీద ఉంటే నేను నీ పక్కన వచ్చి కూర్చోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. మురారి ఆలోచనలో పడతాడు ఏంటి మురారి ఆలోచిస్తున్నావు ఆ కృష్ణ వచ్చి నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావా అలా ఎప్పటికీ జరగదు. నేను నిన్ను ఇక్కడ ఉంచిన విషయం ఎవరికీ తెలియదు నేను అలా జాగ్రత్త పడ్డాను అని అంటుంది. కృష్ణ కాదు కదా ఇక్కడికి ఎవరూ రాలేరు నేను తప్ప అని అంటుంది. నువ్వే మనసు మార్చుకోవాలి అంతకన్నా వేరే దారి లేదు అని అంటుంది ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్లో ముకుంద వెనకాలే కృష్ణా మధు కూడా మురారి ఉన్న ప్లేస్ కి వెళ్తారు. మురారి దగ్గరికి వెళ్లి ముకుందా కృష్ణ కూడా నేను నీ వల్లే ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్తే నమ్మేసింది అని అంటుంది. మురారి ఆశ్చర్యంగా చూస్తాడు. ప్రాణం పోయినా కృష్ణ నా గురించి నువ్వు ఎంత చెప్పినా నమ్మదు అని అంటాడు. ఆ మాట విని కృష్ణ ఎ సి పి సార్ అని అంటుంది. మధు కృష్ణ ని ముకుందా అక్కడ చూసి షాక్ అవుతుంది. ఒకసారిగా కృష్ణ అని అంటాడు మురారి. మరి నిజంగానే ముకుందా దగ్గర మురారి వున్నా విషయం కృష్ణ తెలుసుకుంటుందో లేద,ఇది కలో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella