NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema June 01 Episode 639: విక్కీ ని ఇష్టపడుతున్న గాయత్రి.. పాప కుచల కి దగ్గర కానుందా? పద్దు విక్కీ ల మీద మూర్తి అనుమానం..

Nuvvu Nenu Prema Today Episode June 1st 2024 Episode 639 highlights

Nuvvu Nenu Prema:పద్మావతి తనకి జాబు వచ్చిందన్న విషయాన్ని విక్కీతో చెప్తుంది. నీలాంటి వాళ్లకి జాబ్ ఇచ్చిన ఆ తలక మాసినోడు ఎవడో అని అనుకుంటాడు. ఆయన మీలాగా టెంపర్ ఏం కాదు చాలా మంచివాడు అని అంటుంది. అబ్బో అప్పుడే మంచివాడని సర్టిఫికెట్ కూడా ఇచ్చేస్తున్నావే అని అంటాడు విక్కి. మీరు కూడా ఒకప్పుడు నన్ను ఆఫీసులో జాయిన్ చేసుకున్నారు ఆ విషయం మర్చిపోయారు అని అంటుంది పద్మావతి. అయినా నా సంగతి పక్కన పెట్టండి మీరు కూడా ఇంటర్వ్యూ కి వెళ్లారు కదా ఏమైంది అని అడుగుతుంది. నా వెనకాల బానే ఫాలో అవుతున్నావే అని అంటాడు నేనేం ఫాలో అవ్వట్లేదు మామయ్య చెప్పాడు అని అంటుంది పద్మావతి. నీలాంటి వాళ్లకే ఉద్యోగం వచ్చినప్పుడు నాకు ఉద్యోగం రాదా? నాకు కూడా వచ్చింది అని అంటాడు. అవునా అయితే కంగ్రాట్యులేషన్స్ అని అంటుంది విక్కీ కావాలనే పద్మావతికి షేకెండ్ ఇవ్వడు. కనీసం మీరు ఏ ఆఫీస్ లో ఉద్యోగం వచ్చిందో అయినా చెప్తారా అని అడుగుతుంది చెప్పను అని అంటాడు. కావాలనే విక్కీ పద్మావతికి తను వీడియో ఆఫీస్ లో పనిచేస్తుంది చెప్పకుండా ఉంటాడు. దానికి పద్మావతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Nuvvu Nenu Prema Today Episode June 1st 2024 Episode 639 highlights
Nuvvu Nenu Prema Today Episode June 1st 2024 Episode 639 highlights

మరోవైపు కుచల పాప ఏడుస్తుంటే దగ్గరికి తీసుకోకుండా చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన నారాయణ నీ మనసు అసలు ఏమైంది అంత చిన్న పిల్ల ఏడుస్తుంటే దగ్గరికి తీసుకోవట్లేదు అని అరుస్తాడు. అది కాదు నారు అని అంటుంది, చిన్నపిల్లల కానీ ఏడుస్తుంటే అని నారాయణ కావాలని పాపను తీసుకొచ్చి కుచల చేతిలో పెడతాడు. చిన్నప్పుడు ఆర్యా ఏడిస్తే నువ్వే తనతో పాటు ఏడ్చే దానివి అంత సున్నితమైన మనసు ఇప్పుడు ఏమైంది ఈ పాప నీకేమవుతుంది అని అడిగితే నాకేం కాదు అని అంటుంది పాపని ఎత్తుకోగానే పాప ఏడుపు ఆపేస్తుంది చూసావా నువ్వు తన నానమ్మ కాబట్టే నువ్వు వెతుకోగానే ఆ పాప ఏడుపాపేసింది అని అంటాడు నారాయణ నువ్వు లేనిపోని వరుసలు కలపద్దు అని అంటుంది నిజం చెప్తే ఎప్పుడు నమ్మావు కావాలంటే చూడు ఈ పాప ఆర్య కి ఏమవుతుంది ఆర్య నీకేమవుతాడు అని కన్ఫ్యూజ్ చేసి ఈ పాప నామ నవరాలే అని కుచల అనేలా చేస్తాడు దాంతో ఒక్కసారిగా నువ్వు కావాలని నాతో ఈ పాపని మనవరాలు అని అనిపిస్తున్నావు అని అంటే కాదు ఆ భగవంతుడే మనల్ని ఈ పాపతో కలిపాడు అని నారాయణ అంటాడు. ఇక పాప ఏడుస్తుంటే కుజుల ఆడిస్తుంది అది చూసి ఆర్య చూశావా మా అమ్మ పైకి అలా కనిపిస్తుంది కానీ చాలా మంచి మనసు అందుకే పాపతో అలా ఆడుకుంటుంది నువ్వు పాప ఏడవగానే ఎత్తుకోకుండా ఉంటే మా అమ్మే తీసుకొని తనని దగ్గరికి తీసుకొని ఆడిస్తుంది అప్పుడే పాప మా అమ్మకి దగ్గర అవుతుంది అని చెప్తాడు సరే అంటుంది అను. కుచల పాపని ఆడిస్తూ ఉంటుంది.

Nuvvu Nenu Prema Today Episode June 1st 2024 Episode 639 highlights
Nuvvu Nenu Prema Today Episode June 1st 2024 Episode 639 highlights

ఇక మరోవైపు ఆఫీసులో గాయత్రి అటూ ఇటూ చూస్తూ ఉంటుంది పద్మావతి ఎవరి కోసం వెతుకుతున్నావు ఏంటి ఆ పని చేయకుండా దిక్కులు చూస్తున్నావు అని అడిగితే మన ఆఫీసులో ప్రభాస్ లాంటి హైట్ ఉన్న మహేష్ బాబు లాంటి కలర్ ఉన్న ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు తను మళ్ళీ నిన్న వెంటనే వెళ్ళిపోయాడు ఈరోజు అతను ఆఫీస్ కి వచ్చాడా లేదా అని చూస్తున్నాను అని అంటుంది. మన ఆఫీసులో రూల్స్ గురించి నీకు తెలియదా నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే ఆఫీసులో నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది కదా అంటే తొక్కలో ఉద్యోగం పోతున్న పర్వాలేదు నాకు అబ్బాయి కావాలి నేను అబ్బాయిని బాయ్ ఫ్రెండ్ గా చేసుకోవాలనుకుంటున్నాను ఆ అబ్బాయి ఈరోజు ఇక్కడికి వస్తాడు నేను చూస్తాను నువ్వు మాత్రం పోటీకి రావద్దు అని అంటుంది గాయత్రి. నాకు అలాంటి ఉద్దేశ్యాలు ఏం లేవు అని అంటుంది పద్దు అసలు నువ్వు ఏ కాలంలో ఉన్నావు అని అడుగుతుంది గాయత్రి. నేను సాంప్రదాయంగా పెరిగిన పిల్లని నేను ఇలానే ఉంటాను అని అంటుంది పద్దు. గాయత్రి నేను ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చేదాకా వర్క్ చెయ్యను ఆ అబ్బాయి ఇప్పుడు వచ్చేస్తాడు అని విక్కీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది గాయత్రి. యశోదర్ కొంతమంది పనిచేయడానికి ఆఫీస్కి వస్తారు కొంతమంది వాళ్ళ పొగరుని చూపించడానికి ఆఫీసుకు వస్తారు. పద్మావతి లాగా పని చేసే వాళ్ళు ఎంతో తక్కువ మంది ఉంటారు అని పద్మావతి గురించి ఆలోచిస్తూ మరో వైపు విక్కీ గురించి కూడా ఆలోచిస్తాడు ఇక మూర్తి పిలిచి ఆ వర్షంలో తడిసిన అమ్మాయిని ఒకసారి రమ్మను అని అంటాడు ఎమ్ఐ అని అడుగుతాడు మూర్తి కావాలని యశోదర్, ఆ అమ్మాయి పేరు గుర్తు లేనట్టు యాక్టింగ్ చేస్తాడు మూర్తికి ఆ విషయం అర్థమవుతుంది సర్ అమ్మగారినిగా మీరు పిలవమనేది అని అంటాడు. అమ్మగారు ఏంటి పద్మావతి నే కదా అని అంటాడు. అవును పద్మావతిని మరి అమ్మగారు అని ఎందుకు అన్నావు అంటే ఇవాళ కాకపోతే రేపైనా అమ్మగారు అవుతారు కదా నాకు అని అంటాడు నీ మాటల్లో ఏదో ద్వందర్థం కనిపిస్తుంది అని అంటాడు యశోదర్. సరే ముందు వెళ్లి ఆ అమ్మాయిని పిలుసుకొస్తాను అని అంటాడు మూర్తి. ఆ అమ్మాయితో పాటు ఆ రెక్లెస్ ఫెలో ఉన్నాడు కదా వాణ్ణి కూడా పిలవండి అని అంటే మూర్తి సరే అని వెళ్తాడు.

Nuvvu Nenu Prema Today Episode June 1st 2024 Episode 639 highlights
Nuvvu Nenu Prema Today Episode June 1st 2024 Episode 639 highlights

ఇక పద్మావతి యశోదర్ పిలిచాడని లోపలికి వస్తుంది. పద్మావతిని అలానే చూస్తూ ఉండిపోతాడు బాస్. సార్ నన్ను పిలిచారంట అని అంటే అవును పద్మావతి నీకు ఆఫీసులో ప్రాజెక్టు వర్క్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిలిచాను. దాంతోపాటు నీకు హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ కూడా నేనే అపాయింట్ చేస్తున్నాను ఆ పర్సన్ ని నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అని అంటాడు. వాడు నీ దగ్గర పని చేయడానికి వస్తున్నాడు ఏదైనా వేషాలు వేస్తే తోక జాడిస్తే తొక్కిపెట్టి నార తీసేయ్ అని అంటాడు. అతని ఫుల్లుగా నీ కంట్రోల్లో పెట్టుకో అని అంటాడు యశోదర్. ఇప్పుడే అతను వస్తాడు చూడు అని అంటాడు అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు. విక్కీ ని చూసి పద్మావతి ఆశ్చర్య పోతుంది పద్మావతిని చూసి విక్కీ ఆశ్చర్యపోతాడు ఒకరికి ఒకరు నువ్వా నువ్వా అని అనుకుంటారు. వెంటనే మూర్తి మీ ఇద్దరికీ ఇదివరకే పరిచయం ఉందా అని అడుగుతాడు ఇద్దరు లేదు అని అంటారు మరి ఎందుకు అలా ఆశ్చర్యపోయారు అంటే నాతో పాటు కలిసి పని చేసేవాళ్ళు కదా అని అంటుంది పద్మావతి వెంటనే బాస్ నీలో ఉన్న ఈ టాలెంట్ చూసే నీకు ఉద్యోగం ఇచ్చింది కొంతమంది నేను చూసి చాలా నేర్చుకోవాలి అని విక్కిని ఉద్దేశించి అంటాడు. విక్కీ తో తను పద్మావతి నువ్వు తనతో కలిసి వర్క్ చేయాలి అని అంటాడు. అంటే పద్మావతి నా కింద పని చేస్తుందా అని అంటాడు వెంటనే మూర్తి అంత స్పీడ్ వద్దమ్మా చెప్పేది విను అని అంటాడు. పద్మావతి కిందే నువ్వు పని చేయాలి ప్రతిదీ తనకి టైం టు టైం అప్డేట్ ఇవ్వాలి తను ఏది చెప్తే అది చేయాలి అని అంటాడు యశోదర్. చెప్పింది వినపడలేదా అని అంటాడు విక్కీ వైపు చూసి వినపడింది సార్ అని అంటాడు మండుతున్నట్టు ఉంది అని అనుకుంటుంది పద్మావతి. భలే దొరికాడు నాకు ఇప్పుడు చూడు ఎలా ఆడుకుంటాను మీతో అని అనుకుంటుంది పద్మావతి. నవ్వుకుంటున్నావు కదా అర్థం అవుతుంది నీ ఫేస్ చూస్తుంటేనే, సముద్రాలన్నీ ఈదిన వాడు పిల్ల కాలువలో పడి చచ్చినట్టు, అయింది నా పరిస్థితి అని మనసులో అనుకుంటాడు విక్కి. ఏంటి ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు ఇక్కడ ఏం పెళ్లిచూపులు జరగట్లేదు అని అంటాడు మూర్తి. చూసిన తప్పేనా అని అంటాడు విక్కీ. యశోదర్ ఇక పని మొదలు పెట్టండి ఆల్ ది బెస్ట్ అని పద్మావతికి షేకెండ్ ఇస్తాడు. విక్కీ కోపంగా చూస్తాడు పద్మావతి వైపు, కావాలనే పద్మావతి యశోద చెయ్యి వదలకుండా షేకండీస్తూనే ఉంటుంది వెంటనే విక్కీ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పరా అని అడుగుతాడు మూర్తిగారు ఆ అబ్బాయి ఏదో అడుగుతున్నాడు చూడండి అని అంటాడు యశోదర్. ఇక ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

Nuvvu Nenu Prema Today Episode June 1st 2024 Episode 639 highlights
Nuvvu Nenu Prema Today Episode June 1st 2024 Episode 639 highlights

విక్కీ పద్మావతి ఇద్దరు ఆఫీసులో గొడవ పడుతూ ఉంటారు. నిజాలు దాచడంలో నువ్వు తిట్టా అని ఇప్పుడే అర్థమైంది నాకు అని అంటాడు విక్కి నిజాలు తాగడం గురించి మీ గురించి మాట్లాడుకోవాలి అని అంటుంది పద్మావతి. నేనెప్పుడూ అబద్ధం ఆడను నేను అలా ఆడాల్సి వస్తే దాని వెనుక ఒక పెద్ద కారణం ఉంటుంది. అని అంటుంది పద్దు. మీరు ఆఫీసులో బాస్ ముందు నేను తెలుసా అని అడిగినప్పుడు నేను తెలుసు అని చెప్పాను మీరే తెలియదని చెప్పారు. మీరు ఎందుకు మరి బాస్ దగ్గర అబద్ధం చెప్పింది నిజం చెప్పి ఉండొచ్చు కదా అప్పుడు అన్ని తేలిపోయేవి అని అంటుంది. నేను ఎందుకు అబద్దం చెప్పానో నీకు తెలియదా మన ఇంట్లో ఉండే సిచువేషన్ కి నేను ఉద్యోగం చేయడం చాలా అవసరం అలాంటప్పుడు ఇక్కడ ఇలానే మాట్లాడాలి అని అంటాడు. నేను కూడా అందుకే మరి నిజం దాచింది అని అంటుంది పద్మావతి. మీరు చేసే తప్పు కాదు నేను చేస్తే తప్ప అని అంటుంది పద్మావతి. నేను ఎదురు మాట్లాడటం లేదు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నాను అని అంటుంది పద్దు అప్పుడే మూర్తి గారు దూరం నుంచి వాళ్ళిద్దర్నీ చూస్తారు ఏంటి వీళ్లిద్దరూ ఏదో పరిచయం ఉన్నట్లు మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటాడు. ఇదంతా నా కర్మ నేను నీ కింద పని చేయాల్సి వచ్చింది అని విక్కీ అంటాడు. ఇంతకుముందే వీళ్ళిద్దరికీ పరిచయం ఉన్నట్లు నాకు బాగా అనిపిస్తుంది వీళ్ళు గొడవ పడుతున్నట్లు ఉన్నారు వీళ్ళ గురించి ఒకసారి కనుక్కోవాలి అని అనుకుంటాడు మూర్తి. జాబ్ అంటే ఒకరి కింద పని చేస్తున్నట్టు కాదు కలిసి పని చేయడం అని అంటుంది పద్దు. మీకు అంతగా జాబ్ చేయడం ఇష్టం లేకపోతే వెళ్లి బాస్ దగ్గరికి నాకు ఇష్టం లేదని చెప్పేయండి అని అంటుంది పెద్ద శాడిస్ట్ ఆడవాళ్లకు మాత్రమే ఇస్తాడు అందుకే వాడి గురించి తెలుసుకోవడానికి ఇందాక చేయకండి ఇవ్వమని అడిగాను చూసావుగా నాకు ఇవ్వలేదు అని అంటాడు. మూర్తి దూర నుంచి వీళ్ళని చూసి ఇక్కడ ఉంటే ఏమీ అర్థం కావట్లేదు నేను అక్కడికి వెళ్తే అన్ని అర్థమవుతాయి అని దగ్గరికి వెళ్తాడు. అప్పటికే ఇద్దరు బాగా కొట్టుకొని నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని ఒకరికి ఒకరు వెళ్లిపోతారు. ఇప్పుడైతే తప్పించుకున్నారు ఈసారి వదలకూడదు అని అనుకుంటాడు మూర్తి.

Nuvvu Nenu Prema Today Episode June 1st 2024 Episode 639 highlights
Nuvvu Nenu Prema Today Episode June 1st 2024 Episode 639 highlights

ఇది మన వైపు పాప బాగా ఏడుస్తూ ఉంటుంది అని వచ్చి పాపని ఎత్తుకుంటుంది నారాయణ ఇంట్లో అందరూ ఎందుకు ఏడుస్తుంది అని అడిగితే తెలియట్లేదు అని చెప్తుంది అని ఇక కుచల వచ్చి నాకు బాగా తలకాయ నొప్పిగా ఉంది. కాఫీ తీసుకురా అని అంటుంది ఒకవైపు పాప ఏడుస్తుంటే కాఫీ తీసుకురమ్మని ఎలా అడుగుతావు అని అంటాడు నారాయణ. ముందు వచ్చినా చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ములు ఇష్టమని మీ అందరికీ ఆ పాప ఎక్కువ అయిపోయిందా ఒకవైపు నాకు తలనొప్పిగా ఉంది అంటే ఎవరు పట్టించుకోరు ఆ పాప ఏడుస్తుందంటే మాత్రం ఓ తెగ ఫీల్ అయిపోతున్నారు అని అంటుంది. వెంటనే నారాయణ కోపంగా అసలు నువ్వు మనిషివే కాదు అని తిడతాడు. అక్కడే ఉన్న దివ్య ఈ సిచువేషన్ ని మనం వాడుకోవాలి అని అనుకుంటుంది ఇక పాప ఏడుస్తుంది నువ్వు లోపలికి వెళ్ళి పాలు పట్టించు అని అంటాడు నారాయణ వెంటనే అణువు పాపను లోపలికి తీసుకువెళ్తుంది. ఇక అందరూ వెళ్లిపోయిన తర్వాత దివ్య కుచల దగ్గరికి వచ్చి నీకు ఇలాంటి పరిస్థితి రాకూడదు పిన్ని అని అంటుంది. అవును కదా అని అంటుంది కుచ్చుల అవును ఇదంతా పద్మావతి చేయిస్తుంది అను ఈమధ్య చాలా మారిపోయింది పద్మావతి అను ఇద్దరూ కలిసి ఇలా చేస్తున్నారు అని కావాలనే వాళ్ళ గురించి చెబుతుంది దివ్య. అవునా ఇదంతా పద్దు చేయిస్తుందా చెప్తా వీళ్ళిద్దరి సంగతి అని అంటుంది కుచల. మరోవైపు ఆఫీస్ నుంచి విక్కి బయటికి వస్తాడు పద్మావతి కూడా ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతుంది కానీ పద్మావతి బండి గరుడ పని చేయదు. ఎంతసేపటికి స్టార్ట్ అవ్వక పోతుంటే ఏమైంది అని అడుగుతుంది గరుడని పద్దు. నాకు బాగా జ్వరంగా ఉందా మీ నిన్న వాన్లో తడిచాను కదా అందుకే స్టార్ట్ అవ్వట్లేదు రేపు ఉదయం చూద్దాము నువ్వు ఈరోజు ఆటోలో వెళ్ళు అని చెప్తాడు. అదంతా చూసి దీనికి పిచ్చి అని అనుకుంటాడు వికే ఇక పద్మావతి దగ్గరికి గాయత్రి వచ్చి ఏమైంది అని అడిగితే గరుడకి జ్వరం వచ్చింది అని చెప్తుంది గరుడెంటి జ్వరం ఏంటి అని అంటుంది గాయత్రి. అదంతా నీకు చెప్పిన అర్థం కావట్లేదు లే నా బండి స్టార్ట్ అవ్వట్లేదు అని అంటే సరే ఆటోలో వెళ్లి రేపు వచ్చి తీసుకో అని అంటుంది. గాయత్రి సరే అంటుంది పద్దు ఇక అప్పుడే విక్కిని చూసి గాయత్రి విక్కీ గారు అని పిలుస్తుంది వెంటనే పద్మావతి ఆశ్చర్య పోతుంది ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella