Allu Arjun: అల్లు అర్జున్.. పరిచయం అవసరంలేని పేరు. ఇండస్ట్రీ ఏదైనా మొత్తం నాదే హవా అంటూ దూసుకుపోతున్నాడు బన్నీ. ఒకప్పుడు అల్లు అర్జున్‌కి అంతగా క్రేజ్ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే పుష్ప సినిమాలో నటించాడు అప్పటినుంచి ఈయన క్రేజే వేరు. కొన్ని దశాబ్దాల కాలం నుంచి సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాలకృష్ణ మరియు చిరంజీవి లకి రాణి నేషనల్ అవార్డు బన్నీ సొంతం చేసుకున్నాడు. 100 కి పైగా సినిమాల్లో నటించిన చిరు మరియు బాలయ్యకి ఈ అవార్డు రాకుండా అల్లు అర్జున్‌కి మాత్రమే ఈ అవార్డు ఎందుకు వచ్చింది అని చాలామంది అప్పట్లో తమ కోషన్స్ ను పొందుపరిచారు.
ఇక మరికొందరు అయితే అల్లు అర్జున్ కొన్ని కోట్లు చెల్లించి ఈ అవార్డును కొనుగోలు చేసినట్లు పుకార్లు రాసుకొచ్చారు. కానీ ఇది తన టాలెంట్ వల్ల వచ్చిందని బన్నీ స్పందించడంతో వీటికి అడ్డుకట్టపడింది. ఇక ఇదిలా ఉంటే సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప మూవీ ఎంత పెద్ద విజయవంతమైందో మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమా తోనే పాన్ ఇండియా హీరో అయిపోయాడు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ క్రేజ్ ముందు ఏ స్టార్ హీరో కూడా సరిపోడు అని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం పుష్ప కి సీక్వెల్ గా పుష్ప 2 షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
పుష్ప కంటే పుష్ప 2 పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా అల్లు అర్జున్ బర్తడే సందర్భంగా ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌లో పుష్ప పుష్ప పుష్ప.. అని లిరిక్స్ తప్ప ఏమీ లేవు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ గోరంగా హర్ట్ అయ్యారు. నార్మల్ గా ఒక స్టార్ హీరో సినిమా నుంచి ఏ చిన్న వీడియో రిలీజ్ అయిన అది యూట్యూబ్‌లో ట్రెండింగ్ లో ఉంటుంది. అదికూడా ఐకాన్ స్టార్ అయితే వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. ఐకాన్ స్టార్ సినిమా నుంచి ఏదైనా చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయినా అవి సోషల్ మీడియాలో తెగ చక్కెరలు కొడుతూ ఉంటాయి. కానీ ఈసారి అల్లు అర్జున్ ఇమేజ్ ని డామేజ్ చేశాయని చెప్పుకోవచ్చు.
ఈ సాంగ్ విడుదలయ్యి కొన్ని రోజులు అవుతున్నప్పటికీ యూట్యూబ్ లో ఇది టాప్ టెన్ లో కూడా ట్రెండింగ్ అవ్వడం లేదు. దీంతో బన్నీ ఫాన్స్ నిరాశకు గురయ్యారు. టాప్ వన్ లో కాకపోయినా టాప్ టెన్ లో కూడా ఈ సాంగ్ ఎక్కడా కనిపించలేదు. దీనిబట్టి చూస్తే ఈ సాంగ్ ఎంత నిరాశపరిచిందో తెలుస్తుంది. అదేవిధంగా ఈ సాంగ్ ప్రోమో విడుదలైన నాటి నుంచి నేటి వరకు నిత్యం ఏదో ఒక ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. అల్లు అర్జున్ రేంజ్‌కి ఈ సాంగ్ ప్రోమో కి అస్సలు కలెక్షన్ లేదంటూ గోరంగా ఏకేస్తున్నారు నెటిజన్స్. నిజానికి దేవి శ్రీ ప్రసాద్ ముందు పాట ఫ్లాప్ అనిపించుకునే లాగా మ్యూజిక్ ఇచ్చి అనంతరం ఫుల్ సాంగ్ తో భారీగా హైప్స్ రేపేస్తూ ఉంటా. ఇది దేవిశ్రీప్రసాద్ కి ఎప్పుడు కోమనే. మరి ఇదే తరుణంలో ఫుల్ సాంగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!