NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న కాజల్ అగర్వాల్.. 2020లో పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను కాజల్ అగర్వాల్ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2022 లో నీల్ కిచ్లూ అనే కుమారుడు జన్మించాడు. వివాహమై ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా కాజల్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుండటం విశేషం. గత ఏడాది భగవంత్ కేసరి చిత్రంతో బిగ్ హిట్ ను ఖాతాలో వేసుకున్న కాజల్.. త్వరలో సత్యభామ అని లేడీ ఓరియంటెడ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతోంది.

సుమన్ చిక్కాల డైరెక్ట్ చేసిన స‌త్య‌భామ మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌బోతోంది. కాజ‌ల్ కు జోడిగా న‌వీన్ చంద్ర న‌టించాడు. ప్రకాష్ రాజ్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు. శశికిరణ్ తిక్క ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే అందించారు. అవురమ్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి, బాలాజీ క‌లిసి నిర్మించిన స‌త్య‌భామ చిత్రం మే 17న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌మెడియ‌న్ అలీ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న అలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మానికి హాజ‌రు అయింది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మంలో కాజ‌ల్ వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్యక్తిగ‌త విశేషాల‌ను కూడా పంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే అలీ `వివాహం త‌ర్వాత క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల్లో క‌నిపించ‌డం లేదు. ఎక్కువ‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్నారు…అలాంటి సినిమాలే చేయ‌మ‌ని మీ భ‌ర్త కండీష‌న్ పెట్టారా..?` అంటూ ప్ర‌శ్నించాడు. అందుకు కాజ‌ల్ బదులిస్తూ.. పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో నా భ‌ర్త ఎటువంటి కండీష‌న్ పెట్ట‌లేద‌ని, న‌టిగా త‌న‌ను అత‌ను ఎంతో స‌పోర్ట్ చేశాడ‌ని వెల్ల‌డించింది.

ప‌వ‌ర్‌ఫుల్ ఫిమేల్ క్యారెక్ట‌ర్స్ చేయ‌డమంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని, తెలుగులో స‌త్య‌భామ మూవీతో ఆ కోరిక కొంత వ‌ర‌కు తీరింద‌ని కాజ‌ల్ పేర్కొంది. స‌త్య‌భామ కు సీక్వెల్ చేసే అవ‌కాశం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా కాజ‌ల్ తెలిపింది. అలాగే జ‌న‌తా గ్యారేజ్‌లో ఐటెం సాంగ్ చేయ‌డానికి మెయిన్ రీజ‌న్ ఏంటని అలీ ప్ర‌శ్నించ‌గా.. ఎన్టీఆర్ కోస‌మే ఆ సాంగ్ చేశాన‌ని కాజ‌ల్ స్ప‌ష్టం చేసింది. పెద్ద డైరెక్ట‌ర్‌, రెమ్యున‌రేష‌న్ గురించి తాను ఆలోచించి లేద‌ని.. కేవ‌లం ఎన్టీఆర్ కోస‌మే జ‌న‌తా గ్యారేజ్‌లో ఐటెం సాంగ్ చేయ‌డానికి ఒప్పుకున్నాన‌ని చెప్పుకొచ్చింది. ఇక త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. గౌత‌మ్ కిచ్లూతో త‌న‌ది పెద్ద‌లు కుదుర్చిన ప్రేమ వివాహ‌మ‌ని కాజ‌ల్ అగ‌ర్వాల్ తెలిపింది. గౌత‌మ్‌తో త‌న‌కు ప‌దేళ్లుగా ప‌రిచ‌యం ఉంద‌ని.. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇద్ద‌రం పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని కాజ‌ల్ వివ‌రించింది. దీంతో ఈ బ్యూటీ కామెంట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

Related posts

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri