NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను ఏర్ప‌ర్చుకున్న ప్రభాస్.. రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ్ముడి కుమారుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. బ్యాక్ గ్రౌండ్ ఉంటే హీరోలు అవ్వడం సులభమే. కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నా, నటుడుగా ప్రేక్షకులకు చేరువ కావాలన్నా టాలెంట్ ఎంతో ముఖ్యం. ఆ టాలెంట్ ఉండబట్టే ప్రభాస్ బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా ఎదిగాడు. ఈశ్వర్ మూవీతో కెరీర్‌ ప్రారంభించిన ప్రభాస్.. వర్షం మూవీతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

ఛత్రపతి చిత్రంతో భారీ స్టార్డమ్ ను సొంతం చేసుకున్నాడు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి సినిమాలతో టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ చిత్రాలతో ఇంటర్నేషనల్ వైడ్‌ గా నేమ్ అంటే ఫేమ్ సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ కెరీర్ గురించి మాట్లాడుకుంటే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని ప్రస్తావించవచ్చు. అప్పటివరకు టాలీవుడ్ మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ బాహుబలి తో దేశవిదేశాలకు పాకింది.

ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రభాస్ ఫుల్ బిజీగా గ‌డుపుతున్నాడు. అయితే ప్రభాస్ సినిమాలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఫ్యామిలీకి ఇస్తాడు. ముఖ్యంగా తల్లి శివ కుమారి అంటే ప్రభాస్ కు ఎంతో ప్రేమ. తల్లి మాటకు ఎప్పుడు ఎదురుచెప్పడు. అయితే శివకుమారి గారికి ప్రభాస్ సినిమాల్లో మోస్ట్ ఫేవరెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబలి మాత్రమే కాదు. ప్రభాస్ నటించిన సినిమాల్లో మిర్చి అంటే ఆయన తల్లికి చాలా ఇష్టమట.

కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా అనుష్క శెట్టి, రిచా గంగోపాధ్యాయ్ నటించారు. సత్యరాజ్‌, నదియా కీలక పాత్రల‌ను పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై నిర్మితమైన మిర్చి మూవీ 2013లో విడుదల బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ఈ సినిమానే ప్రభాస్ తల్లిగారికి మోస్ట్ ఫేవరెట్ మూవీ అట. ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్, ఫాదర్ అండ్ స‌న్ మధ్య సాగే ఎమోషన్స్ సీన్స్‌ శివ కుమారి గారిని ఎంతగానో ఆకట్టుకున్నాయ‌ట‌. పైగా మిర్చి సినిమాను ఇప్ప‌టివ‌రకు ఆవిడ‌ ఎన్నో సార్లు చూశారట.

కాగా, ప్ర‌భాస్ సినిమాల విష‌యానికి వస్తే.. ప్ర‌స్తుతం ఆయ‌న నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో కల్కి 2898 ఏడి అనే సినిమా చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యాన‌ర్ పై పాన్ వరల్డ్ రేంజ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనె, దిశా ప‌టానీ ఈ చిత్రంలో హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. అలాగే ప్ర‌భాస్ చేతిలో ఉన్న చిత్రాల్లో రాజా సాబ్ ఒక‌టి. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ , రిద్ధి కుమార్ మరియు మాళవిక మోహనన్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇక ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో స‌లార్ 2, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే చిత్రాలు కూడా ప్ర‌భాస్ చేయాల్సి ఉంది.

Related posts

AP Exit Polls: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల .. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?

sharma somaraju

Supreme court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు

sharma somaraju

వైసీపీ ఓడితే.. అది ముగిసిన‌ట్టే.. జ‌గ‌న్ రికార్డే…?

ఏపీలో ఐదేళ్లు: ఎవ‌రు గెలిచినా నిప్పుల న‌డ‌కే.. ఎవ‌రొచ్చినా స‌వాళ్ల సంసార‌మే ..!

ప‌వ‌న్ విక్ట‌రీకి ఎందుకంత క్రేజ్‌.. ఇదీ రీజ‌న్‌!

కౌంటింగ్‌కు ముందే ఏపీ రాజ‌ధాని డిసైడ్ అయిపోయిందా..?

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Saranya Koduri

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Saranya Koduri

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Saranya Koduri

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Saranya Koduri

Most Expensive TV Show: అత్యధిక బడ్జెట్ కలిగిన టీవీ షో ఇదే.. ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు..!

Saranya Koduri

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Love Me: విడుద‌లై నెల కాకుండానే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న బేబీ హీరోయిన్ హార‌ర్ ల‌వ్ స్టోరీ.. ల‌వ్ మీ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N