NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

Vijay Deverakonda: జయపజయాలతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బర్త్ డే నేడు. దీంతో సోషల్ మీడియాలో విజయ్ పేరు మారుమోగిపోతుంది. అభిమానులు, సినీ తారలు విజయ్ దేవరకొండకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీస్ యొక్క అప్డేట్స్ వరుసగా వస్తున్నాయి. ఇక బర్త్ డే సందర్భంగా విజయ్ దేవరకొండ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1989 మే 9న హైదరాబాద్లో గోవర్ధన్ రావు మరియు మాధవి దంపతులకు ప్రథమ కుమారుడిగా విజయ్ దేవరకొండ జన్మించాడు. డిగ్రీ కంప్లీట్ చేసిన విజయ్ దేవరకొండ.. నటనపై ఉన్న ఆసక్తితో సినిమా రంగం వైపు అడుగులు వేశాడు. రవిబాబు దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ మూవీ నువ్విలా తో విజయ్ దేవరకొండ ఆరంగేట్రం జరిగింది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ లో చిన్న పాత్రను పోషించాడు. కానీ ఈ రెండు సినిమాలు విజయ్ కు సరైన గుర్తింపు తెచ్చి పెట్టలేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ హిట్ అయినా కూడా క్రెడిట్ మొత్తం నానికే ద‌క్కింది. ఈ సినిమాలో కీలక పాత్రను పోషించిన విజయ్ కు పెద్దగా ఒరిగిందేమీ లేదు.

దాంతో విజయ్ సోలో హీరోగా చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తానే స్వయంగా ఓ డైరెక్టర్ ను వెతుక్కున్నాడు. అతను మరెవరో కాదు తరుణ్ భాస్కర్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పెళ్లి చూపులు చిత్రం బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలిచింది. నటుడిగా పెళ్లిచూపులు మూవీతో విజయ్ మంచి మార్కులు వేయించుకున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో అర్జున్ రెడ్డి మూవీ లో నటించాడు. 2017లో విడుదలైన అర్జున్ రెడ్డి సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు చేసింది. విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ గా మార్చింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అత‌నికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడేలా చేసింది.

అర్జున్ రెడ్డి మూవీతో విజయ్ దేవరకొండ దశ తిరిగిపోయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ వెనక్కి తిరిగి చూసుకోలేదు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సినిమాలను విజయ్ దేవరకొండ ఫ్రీగా చేశాడు. ఆ సమయంలో రెమ్యునరేషన్ గురించి విజయ్ పట్టించుకోలేదు. స్క్రీన్ పై కనిపిస్తే చాలు అన్న కోరికతో ఉండేవాడు. సోలో హీరోగా చేసిన పెళ్లిచూపులు మూవీ మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి రూ.5 లక్షలు పారితోషికం అందుకున్నాడు. హీరో గా ఇదే అతని ఫస్ట్ రెమ్యూనరేషన్.

అప్పట్లో ఐదు లక్షలు పారితోషకం అందుకున్న విజయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల రేంజ్ లో ఛార్జ్ చేసే స్థాయికి ఎదిగాడు. కాగా, ప్రస్తుతం విజయ్ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ జాబితాలో `విడి12` ఒకటి. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్న‌నూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెర‌కెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా ఎంపికైంది. వైజాగ్ లో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే విజయ్ దేవరకొండ తన 13వ చిత్రాన్ని రవికిరణ్ కోలా దర్శకత్వంలో చేయబోతున్నాడు. నేడు వీరి సినిమా పోస్టర్ ను విడుదల చేశారు. ఇక విజయ్ దేవరకొండ 14వ సినిమా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఖరారు చేయబడింది.

Related posts

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

sharma somaraju

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri