NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే దాని కంటే… అసలు పిఠాపురం నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందనే… దానిపైన అందరూ చర్చ జరుగుతోంది. పొద్దున లేస్తే చాలు అందరూ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుంటున్నారు. దీనంతటికీ ముఖ్య కారణం పిఠాపురం నియోజకవర్గ నుంచి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయడం.

దీంతో అందరికన్న పిఠాపురం నియోజకవర్గం పైన పడింది. అయితే పిఠాపురం నియోజకవర్గంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి వ్యూహ రచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే… వంగ గీతాను బరిలోకి దింపి… పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా ముద్రగడ పద్మనాభంలో తమ పార్టీలో చేర్చుకొని… కాపు ఓట్లు జనసేనకు పడకుండా స్కెచ్ వేశారు.

అయితే ఇలాంటి నేపథ్యంలోనే వైసీపీ ఎత్తు గోడలకు అదిరిపోయే స్కెచ్ వేసింది జనసేన. ముద్రగడ పద్మనాభం కు వ్యతిరేకంగా ఆయన కూతురు క్రాంతిని బరిలోకి దింపిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే అభిమానమో… లేక ఆమె వెనుక ఎవరైనా ఉండి ఇలా చెప్పిస్తున్నారో తెలియదు కానీ… ముద్రగడ అలాగే వైసిపి పార్టీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ముద్రగడ కూతురు క్రాంతి.

గత నాలుగు రోజులకు… పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించిన ముద్రగడ కూతురు క్రాంతి… ఇప్పుడు మరోసారి కొత్త వీడియోతో తెరపైకి వచ్చారు. తన తండ్రి ముద్రగడకు రాజకీయ పరిజ్ఞానం, రాజకీయ అనుభవం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలుబొమ్మగా మారాడని ఫైర్ అయ్యారు క్రాంతి. అంతేకాకుండా ఒక బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ నడిపే ఓ జోకర్ చేతిలో తన అన్నదమ్ములు కూడా ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది.

తన సోదరుడు గిరికి నామినేటెడ్ పదవి ఎరవేశారని మండిపడ్డారు. ఈనెల 13వ తేదీ తర్వాత ముద్రగడ కుటుంబ రాజకీయ భవిష్యత్తుకు ముగింపు పడుతుందని హెచ్చరించారు. దీంతో ముద్రగడ కూతురు క్రాంతి రిలీజ్ చేసిన వీడియో మరోసారి వైరల్ గా మారింది. అయితే గత నాలుగు రోజులుగా… పిఠాపురం నియోజకవర్గం నుంచి నిత్యం వార్తలు వస్తున్నాయి. ముద్రగడ కూతురు వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తుంటే… అటు టిడిపి పిఠాపురం ఇన్చార్జి వర్మ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ కు ఓటు వేయొద్దని టిడిపి పిఠాపురం ఇన్చార్జి వర్మ ఓ సమావేశంలో చెప్పిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక ఇటు ముద్రగడ కూతురు వైసిపికి ఓటు వేయకూడదని వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తుంది. దీంతో పిఠాపురం నియోజకవర్గ ఓటర్లు పూర్తిగా గందరగోలానికి గురవుతున్నారు. అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ? ఏ పార్టీకి ఓటు వేయాలి ? ఏ పార్టీకి బుద్ధి చెప్పాలి ? అనే దానిపై నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఇప్పుడు ఓటర్లు ఉన్నారు. ఎన్నికలకు నాలుగు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Related posts

Vistara Bomb Threat: శ్రీనగర్ వెళ్తున్న విస్తారా విమానానికి బూటకపు బాంబు బెదిరింపు .. ఎయిర్ పోర్టు కార్యకలాపాలపై ప్రభావం

sharma somaraju

Sheep Scam: గొర్రెల పంపిణీ కుంభకోణంలో మరో ఇద్దరు ఉన్నతాధికారులు అరెస్ట్

sharma somaraju

AB Venkateswararao: పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు .. చివరి రోజు సంచలన వ్యాఖ్యలు

sharma somaraju

ఎయిరిండియాకు నోటీసులు జారీ చేసిన డీజీసీఏ

sharma somaraju

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Buchi Babu Sana: ఉప్పెన డైరెక్ట‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక‌సంద్రంలో బుచ్చిబాబు!

kavya N

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Amit Shah: తిరుమల శ్రీవారి అభిషేక సేవలో అమిత్ షా దంపతులు

sharma somaraju

IPS AB Venkateswararao: ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన ఏపీ సర్కార్ .. అయిదేళ్లుగా న్యాయపోరాటం

sharma somaraju

ఫ‌స్ట్ టైం నంద‌మూరి కుటుంబం ఇలా చేసిందా…?

చివ‌రి కోరిక తీరుతుందా.. ఏపీలో కురువృద్ధుల‌కు టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌..!

టీడీపీ ఆశ‌ల‌న్నీ… ఈ ఓట్ల‌పైనే.. ఏం జ‌రుగుతుందో..!

YSRCP: ‘సజ్జల’పై కేసు నమోదు

sharma somaraju

ఆ మంత్రి గెలుపు ఆశ‌లు వ‌దులుకున్నారా… వైసీపీలో ఒక్క‌టే చ‌ర్చ‌..!