NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

Balakrishna-Pawan Kalyan: తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాలకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా పండుగ చేసుకుంటారు. పైగా మల్టీ స్టార్ చిత్రాలకు సక్సెస్ రేటు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే టాప్ స్టార్స్ కూడా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తెలుగులో ఎన్నో మల్టీస్టారర్ చిత్రాలు వచ్చాయి. మరికొన్ని రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే గతంలో పలువురు హీరోల కాంబోలో కొన్ని క్రేజీ మల్టీ స్టార్లు మిస్ అయ్యాయి. నట‌సింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో కూడా ఒక సూపర్ హిట్ మల్టీస్టారర్ మిస్ అయింది. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు గోపాల గోపాల.

కిషోర్ కుమార్ పార్ధసాని దర్శకత్వంలో వ‌చ్చిన సెటైరిక‌ల్ కామెడీ డ్రామా ఇది. సురేష్ ప్రొడక్షన్స్ మరియు నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై డి.సురేష్ బాబు, శరత్ మరార్ గోపాల గోపాల చిత్రాన్ని నిర్మించారు. ఇందులో వెంక‌టేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోలుగా న‌టిస్తే.. శ్రియా శరణ్ హీరోయిన్ గా చేసింది. మిథున్ చక్రవర్తి, ఆశిష్ విద్యార్థి, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, దీక్ష పంత్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. 2012 విడుద‌లైన హిందీ చిత్రం ఓహ్ మై గాడ్! (OMG) కి రీమేక్ గా గోపాల గోపాల మూవీని రూపొందించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.

2015లో సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న‌ భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నాస్తికుడైన గోపాలరావు పాత్రలో వెంక‌టేష్ అద‌ర‌గొట్ట‌గా.. విష్ణువు అవతారమైన శ్రీ కృష్ణడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించి మెప్పించాడు. రూ. 12 కోట్ల బడ్జెట్‌తో నిర్మిత‌మైన గోపాల గోపాల సినిమా తొలి ఆట నుంచే విమ‌ర్శ‌కుల నుంచి సానుకూల సమీక్షలను అందుకుంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంది.

ఫుల్ ర‌న్ లో ఏకంగా రూ. 40 కోట్ల‌కు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ మ‌రియు రూ. 88 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. అయితే తాజాగా గోపాల గోపాల మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. డైరెక్ట‌ర్ కిషోర్ కుమార్ పార్ధసాని ఈ చిత్రాన్ని మొద‌ట బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కించాలని భావించార‌ట‌. బాల‌కృష్ణ‌తో సంప్ర‌దింప‌లు కూడా జ‌రిపార‌ట‌. అయితే స్టోరీ విన్న ఆయ‌న‌.. త‌న‌కు గోపాలరావు క్యారెక్ట‌ర్ సెట్ కాద‌ని భావించార‌ట‌. సున్నితంగా గోపాల గోపాల మూవీని తిర‌స్క‌రించార‌ట‌.

బాల‌య్య రిజెక్ట్ చేయ‌డంలో వెంక‌టేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ల‌యిక‌లో సినిమాను రూపొందించార‌ట‌. ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు గానీ.. నెట్టింట మాత్రం ఈ న్యూస్ బాగా చ‌క్క‌ర్లు కొడుతోంది. కాగా, గోపాల గోపాల చిత్రానికి సంతకం చేసే స‌మ‌యానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అధిక బరువు కలిగి ఉన్నాడు. అందువ‌ల్ల ఆయ‌న ఆ మూవీ కోసం ప్రత్యేకమైన డైట్ ను పాటించి బ‌రువు త‌గ్గాడు. అలాగే ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్క్రీన్ టైమ్ 25 నిమిషాలే ఉంటుంద‌ని డైరెక్ట‌ర్ కిషోర్ కుమార్ మొద‌ట వెల్ల‌డించారు. కానీ ఆ తర్వాత ప‌వ‌న్ స్క్రీన్ టైమ్ ను 45 నిమిషాలకు పొడిగించబడ‌టం మ‌రొక విశేషం. ఇక గోపాల గోపాల మూవీలో హీరోయిన్ క్యారెక్ట‌ర్ కోసం నయనతార, అంజలి, రాధిక ఆప్టేలను పరిశీలించిన తర్వాత శ్రియాను ఎంపిక చేశారు.

Related posts

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri