NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతకు జైల్ అధికారులు షాక్ .. ములాఖత్‌కు అనుమతి నిరాకరణ..! ఎందుకంటే..?

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్ లో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం ఆయనను కలిసి (ములాఖత్) మాట్లాడేందుకు సీఎం సతీమణి సునీత అనుమతి కోరారు. అయితే ఇందుకు జైల్ అధికారులు అంగీకరించలేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆప్ నేత అతిశీ ములాఖత్ కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సునీత అభ్యర్ధనను తిరస్కరించామని జైల్ అధికారులు చెప్పారని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

ఢిల్లీ మంత్రి అతిశీ సోమవారం జైల్ లో సీఎం కేజ్రీవాల్ తో ములాఖత్ అవ్వనున్నారు. ఇక పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం తీహార్ జైల్ కు వెళ్లి కేజ్రీవాల్ ను కలవనున్నారు. దీంతో మంగళవారం తర్వాతనే సునీతను అనుమతించనున్నట్లు జైల్ అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే నిబంధనల ప్రకారం వారంలో రెండు సార్లు మాత్రమే ములాఖత్ కు అనుమతి ఉంది. దీంతో భర్తను చూసేందుకు సునీత కేజ్రీవాల్ కు వచ్చే వారమే అనుమతి లభించనుంది.

అయితే, జైల్ లో ఉన్న వ్యక్తితో ఒకే సారి ఇద్దరు వ్యక్తులు మాట్లాడే వీలుందని, అయినప్పటికీ తీహార్ జైల్ అధికారులు సునీతను అనుమతించడం లేదని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. రీసెంట్ గా .. భగవంత్ మాన్.. కేజ్రీవాల్ ను కలిసినప్పుడు ఆయన వెంట ఆప్ జనరల్ సెక్రటరీ సందీప్ పాథక్ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఉద్దేశపూర్వకంగానే సునీతను జైల్ అధికారులు అనుమతించడం లేదని ఆప్ నేతలు అంటున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింగ్ కేజ్రీవాల్ ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కస్టడీ విచారణ అనంతరం ఏప్రిల్ 1 నుండి ఆయన తీహార్ జైల్ లోనే ఉన్నారు. లోక్ సభ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ పరిణామాలు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. భర్త అరెస్టు నేపథ్యంలో సునీత కేజ్రీవాల్ ప్రచారంలోకి దిగారు. ఢిల్లీలో ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొంటున్నారు.

YS Sharmila: వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?

Related posts

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N