NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani April 29 2024 Episode 1225: కళ్ళు మూసుకొని గాయత్రీ దేవి రావాలంటున్న తిలోత్తమ, గాయత్రీ దేవి వస్తుందా లేదా..

Trinayani Today Episode April 29 2024 Episode 1225 highlights

Trinayani April 29 2024 Episode 1225: గుర్రం నా పైకి వస్తుంది రా అని భయపడుతుంది తిలోత్తమ. వల్లభ నీళ్లు తెచ్చి తన మొహం మీద చల్లుతాడు. తిలోత్తమ కళ్ళు తెరిచి చూస్తుంది. మమ్మీ నువ్వు ఇలా సైలెంట్ గా ఉంటే నా గుండెలో దడగా ఉంది అని వల్లభ అంటాడు. వల్లభ చాలా ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొస్తుంది ఆ గుర్రం నా మీద కక్ష కట్టినట్టు వస్తుంది అని తిలోతమ అంటుంది. ఎక్కడినుంచి వస్తుంది మమ్మీ అని వల్లభ అంటాడు. స్వర్గం నుండి రావాలి ఎందుకంటే ఆ గుర్రం చచ్చిపోయింది అని తిలోత్తమ అంటుంది. ఇంతలో లైట్లు ఆఫ్ అయిపోతాయి. కట్ చేస్తే, నైని చీకట్లో కూర్చొని ఏం చేస్తున్నావ్ అని విశాల్ అంటాడు. కొబ్బరికాయ పగిలిపోవడం తిలోత్తమ అత్తయ్య గుండెల్లో గుర్రం శకలించడం ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది అని నైని అంటుంది. నైని గతంలో జరిగినవి తిలోత్తమ అమ్మకి గుర్తుకొస్తున్నట్లున్నాయి అని విశాల్ అంటాడు.

Trinayani Today Episode April 29 2024 Episode 1225 highlights
Trinayani Today Episode April 29 2024 Episode 1225 highlights

అంటే అత్తయ్యకి జరిగే సంఘటనకి సంబంధం ఉందంటారా అని నైని అంటుంది. గతంలో అమ్మ తిలోత్తమ అమ్మ ఇద్దరు కలిసి బిజినెస్ చేయడానికి ఎస్టేట్ కి వెళ్లేవారు అక్కడ ఏం జరిగిందో తెలియదు అని విశాల్ అంటాడు. ఎస్టేట్ కి వెళ్లి అక్కడ ఏం చేసేవారు ఏదో కారణం ఉండాలి కదా అని నైని అడుగుతుంది. మా అమ్మ అపురూపంగా చూసుకున్న గుర్రం తన కళ్ళ ముందే ప్రాణం విడిచింది చంపేశారు అని విశాల్ అంటాడు. ఎవరు అని నైని అడుగుతుంది. వాయువుని ఎవరు చంపారో తెలియదు అని విశాల్ అంటాడు. వాయువు ఈ పేరు ఎక్కడో విన్నట్టు బాబు గారు అని నైని అంటుంది. ఆవాయువు చనిపోయిన తర్వాత అమ్మ ఆఫీస్ కి వెళ్లడం మానేసింది అప్పుడు తిలోత్తమ అమ్మే అన్ని చూసుకునేది అని విశాల్ అంటాడు. అయితే తిలోత్తమ అత్తయ్యకు సంబంధం ఉంది అని నైని అంటుంది. అర్ధ ఆయుష్షు తోటే చనిపోయింది అని విశాల్ అంటాడు.

Trinayani Today Episode April 29 2024 Episode 1225 highlights
Trinayani Today Episode April 29 2024 Episode 1225 highlights

మళ్లీ పుట్టాడు కదా బాబు గారు మన దగ్గరికి వచ్చేదాకా వెయిట్ చేయండి అని నైని అంటుంది. కట్ చేస్తే. ఏంటమ్మా నువ్వు నన్ను భయపెడుతున్నావు అని పావను మూర్తి అంటాడు. చూసుకొని నడవాలి కదా కళ్ళు లేవా అని అంటుంది.నైని మళ్లీ అదే మూట తీసుకొని అక్కడికి వస్తుంది. మళ్లీ ఆ మూట తీసుకొచ్చారేంటి అని తిలోత్తమ అంటుంది. మూట తెచ్చారంటే గురువుగారు వస్తారా బావగారు అని సుమన అంటుంది.గురువుగారు కూడా అక్కడికి వచ్చేస్తారు. మీరు వచ్చినట్టే మా గాయత్రి అక్క కూడా వస్తే వస్తుందా అని తిలోతమ అంటుంది. తలుచుకో తిలోత్తమ అని గురువుగారు అంటారు. స్వామి ఏంటి అలా మాట్లాడతారు వీళ్ళు తలుచుకుంటే అమ్మ కనపడుతుందా అని విశాల్ అంటాడు. ప్రయత్నం చేయని అని గురువుగారు అంటారు. తిలోత్తమ కళ్ళు మూసుకొని గాయత్రి అక్క రావాలి అని కోరుకుంటుంది. కళ్ళు తెరిచి చూడు తిలోత్తమ అని గురువుగారు అంటారు. కళ్ళు తెరిచిన తిలోత్తమ అక్క అని పిలుస్తుంది.

Trinayani Today Episode April 29 2024 Episode 1225 highlights
Trinayani Today Episode April 29 2024 Episode 1225 highlights

గుమ్మం వైపు అందరూ చూసి షాక్ అయిపోతారు. పెద్దమ్మ వచ్చింది అని విక్రాంత్ అంటాడు. పెద్దమ్మ గారు అక్కడే నిలబడ్డారేంటి లోపలికి రండి అని నైని పిలుస్తుంది. తిలోత్తమ కోరిక నెరవేర్చడానికి ఈరోజు గాయత్రి దేవి వస్తుందని చెప్పడానికి వచ్చాను అని లలితా దేవి అంటుంది. పెద్దమ్మ ఎలా ఉన్నావ్ అని విశాల్ అంటాడు. చాలా సంతోషంగా ఉన్నాను అని లలితా దేవి అంటుంది. మీ సంతోషానికి కారణం ఏంటో అని సుమన అడుగుతుంది. చైత్ర పౌర్ణమి నాడు మా చెల్లిని చూపెడతానని గతంలో చెప్పాను అని లలితా దేవి అంటుంది. నిజంగా అమ్మగారు వచ్చారా అమ్మగారు అని కళ్ళల్లో సంతోషంతో అంటుంది నైని . మొత్తానికి మీ చెల్లిని తీసుకొచ్చారు పెద్ద అత్తయ్య గారు అని సుమన అంటుంది. పెద్దమ్మ అమ్మ వచ్చిందా అని విశాల్ అంటాడు. అమ్మే వచ్చింది విశాల్ అని లలితా దేవి అంటుంది. అమ్మ ఇక్కడుంటే పెద్దమ్మ ఎవరిని తీసుకొచ్చింది అని విశాల్ కంగారు పడతాడు. లలితా దేవి గాయత్రీ దేవి లోపలికి రాని పిలుస్తుంది. లలితా దేవి అలా పిలవగానే గాలివీచి కర్టన్స్ ఊగుతూ ఉంటాయి.లోపలికి రామ్మా అని లలితా దేవి మళ్లీ పిలుస్తుంది. నువ్వు పిలుస్తున్నావు కానీ రావట్లేదు అని తిలోత్తమ అంటుంది. కళ్ళు మూసుకొని పిలవడం కాదు కళ్ళు తెరిచి చూడు అని లలితాదేవి అంటుంది.

Trinayani Today Episode April 29 2024 Episode 1225 highlights
Trinayani Today Episode April 29 2024 Episode 1225 highlights

అమ్మగారు మీరు పిలుస్తున్నారు కానీ పెద్దమ్మ గారు రావట్లేదే అని నైని అంటుంది. ఇంట్లోకి ఎలా అడుగు పెట్టాలని ఆలోచిస్తున్నట్టుంది అని లలితా దేవి అంటుంది. మొహమాటమా అని వల్లభ అంటాడు. లోపలికి రావాలంటే పాదం నేల మీద పెట్టాలి కదా వల్లభ అని గురువుగారు అంటారు. ఆ మాట వినగానే సుమన పగలబడి నవ్వుతుంది. చిట్టి ఎందుకలా నవ్వుతున్నావ్ అని హాసిని అంటుంది. నేల మీద అడుగు పెట్టాలా అంటే పాపం పాపకి కాళ్లు లేవా ఏంటి అక్క అని సుమన నవ్వుతుంది. లేవు అని గురువుగారు అంటారు. అంటే ఏంటి గురువుగారు అని తిలోత్తమ అంటుంది. ఇంకా అర్థం కాలేదా అత్తయ్య గారు ఆ పాప పుట్టి ఏడాదిన్నర అయింది పాపం అనాధగా పెరిగి కాళ్ళు పోగొట్టుకున్నట్టు ఉంది అని సుమన అంటుంది. నోరు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు వాగితే పళ్ళు రాలుతాయి అని లలితాదేవి అంటుంది.

Trinayani Today Episode April 29 2024 Episode 1225 highlights
Trinayani Today Episode April 29 2024 Episode 1225 highlights

గురువుగారు అనేసరికి అలా అన్నాను అత్తయ్య గారు అని సుమన అంటుంది. లోపలికి రామ్మా నీకోసం ఇంతమంది ఎదురు చూస్తున్నాము అని లలితాదేవి పిలుస్తుంది. లలితా దేవి అలా పిలవగానే విశాలాక్షి వస్తుంది. ఇది టూ మార్చ్ అమ్మ అంటే విశాల్ ని కన్నా తల్లి వస్తుంది అనుకున్నాం ఈ గారడి పిల్ల వచ్చింది అని వల్లభ అంటాడు. బావగారు నిన్ననే డమ్మక్క చెప్పింది కదా అమ్మ వస్తుందని అని నైని అంటుంది. చైత్ర పౌర్ణమి నాడు గాయత్రీ దేవి ఛాయలు తెలుస్తాయి అని విశాలాక్షి చెబుతుంది. మేము గాయత్రి అక్క రావాలని కోరుకున్నాం అని తిలోతమ అంటుంది.నేనే గాయత్రిని త్రినాయినినేనే విశాలాక్షిని అని అంటుంది.జి తెలుగులో వచ్చే సీరియల్ అన్ని చెప్పేసేయ్ అని వల్లభ అంటాడు. అమ్మతో అలాగేనా మాట్లాడేది అని లలితాదేవి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri