NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri April 29 2024 Episode 217: సామ్రాజ్యం పెట్టిన పరీక్షలు జగదాత్రి నెగ్గుతుందా లేదా..

Jagadhatri Today Episode April 29 2024 Episode 217 highlights

Jagadhatri April 29 2024 Episode 217: తనని ఒక ఫ్రెండ్లా తప్ప  ఇంకోలా చూడలేదు బావ అని చరణ్ అంటాడు. వాళ్ళ ఇల్లు ఎక్కడ అని జగదాత్రి అడుగుతుంది. వాళ్లది ఇకనుంచి ఐదు నిమిషాల దూరమే అక్క అని చరణ్ చెబుతాడు. ఇన్స్పెక్టర్ గారు చరణ్ ఇచ్చిన అడ్రస్ పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్లి ఎంక్వయిరీ చేసి రండి అని జగదాత్రి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, చరణ్ చెప్పింది నిజమే అంటావా మొదట్లో యాక్సిడెంట్ అన్నాడు ఇప్పుడేమో ఫ్రెండ్ చావు అంటున్నాడు ఇవన్నీ చూస్తుంటే మాధురి జీవితం ఏమైపోతుందో అని కేదార్ అంటాడు. చరణ్ అంత ధైర్యంగా ఆ అమ్మాయిని వెళ్లి అడగమంటున్నాడు అంటే నిజమే చెప్తున్నాడు అనుకుంటా అని జగదాత్రి అంటుంది. అయితే ఈ మర్డర్ ఎవరు చేశారంటావు అని కేదార్ అంటాడు. అది చెప్పాల్సింది కళ్యాణ్ అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 29 2024 Episode 217 highlights
Jagadhatri Today Episode April 29 2024 Episode 217 highlights

వైజయంతి ఏంటి ఆకలి చంపేస్తుంది అందరూ రండి అని సామ్రాజ్యం పిలుస్తుంది. సామ్రాజ్యం నాయనమ్మ రావడం వల్లే జగదాత్రికి పెళ్లి కాలేదు అని తెలిసింది కాబట్టి మీ అందరికీ నేనే వంట చేసి పెడుతున్నాను అని నిషిక అంటుంది. అత్తయ్య నిషిక వంట చేస్తే అందరం చచ్చిపోతాం ఇప్పుడు ఎలా అని బూచి అంటాడు. నిషిక ఇంత ప్రేమగా చేసి పెడితే తినకుండా ఎలాగా రండి పట్టు పడదం అని సామ్రాజ్యం తింటూ ఉంటుంది. అందరూ షాకే చూస్తూ ఉంటారు. ఏంటి అందరూ బిగుసుకుపోయి అలా చూస్తున్నారు తినడానికేగా వచ్చారు అని సుధాకర్ అంటాడు. సామ్రాజ్యం పిన్ని మీద హత్య ప్రయత్నం జరుగుతుంది అని వైజయంతి అంటుంది. అమ్మమ్మ ఆ సాంబార్ ఎలా తింటున్నారు అని బూచి అంటాడు. కాస్త నీళ్లు ఎక్కువయ్యాయి అంతే దీంట్లో  తినండి అని సామ్రాజ్యం తీటూ ఆపేస్తుంది. ఏంటది నాయనమ్మ బాగాలేదా అని నిషిక అంటుంది.

Jagadhatri Today Episode April 29 2024 Episode 217 highlights
Jagadhatri Today Episode April 29 2024 Episode 217 highlights

ప్లీజ్ ఇకనుంచి జరగవే నిన్ను చూస్తుంటే నన్ను చంపేస్తావనిపిస్తుంది ఇప్పుడు ఈ వంట తప్ప ఇంకేమీ లేదా ఇది సాంబార్ అన్నం అంటారా అని సామ్రాజ్యం అంటుంది. ఉంది నాయనమ్మ అని జగదాత్రి వంట తెచ్చి అక్కడ పెడుతుంది. జగదాత్రి వంట చేయగానే అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. మీరందరూ తినడానికి కూర్చున్నారు ఏంటి ఈ రోజు శ్రావణ శుక్రవారం భర్తలు తిన్నాక భార్యలు వాళ్ళ ప్లేట్లు తినాలి అందరు లేవండి అని సామ్రాజ్యం అంటుంది. అందరూ లేస్తారు కేదార్ని కూడా కూర్చోమంటారు. అమ్మమ్మ గారు ఇప్పుడు జగదాత్రి కూడా నా  ప్లేట్లో తినాలా అని కేదార్ అంటాడు. మీ ఇద్దరికీ పెళ్లి అయింది కదా తింటే తప్పేంటి అబ్బాయి అని సామ్రాజ్యం అంటుంది. అంటే ఎంగిలి కాదా అమ్మమ్మ అని కేదార్ అంటాడు. ఇద్దరి కి పెళ్లయినప్పుడు పాలుపంచుకున్నారు ఎంగిలి తింటే తప్పేముంది

Jagadhatri Today Episode April 29 2024 Episode 217 highlights
Jagadhatri Today Episode April 29 2024 Episode 217 highlights

అబ్బాయి నీకు ఇష్టం లేకపోతే వద్దులే అయినా మీ ఆవిడకి నువ్వు తాళి కట్టలేదు కదా సరే నువ్వు కూడా కూర్చొని తినమ్మాయి అని సామ్రాజ్యం అంటుంది.  వద్దమ్మమ్మ గారు నేను కేదార్ తిన్న ప్లేట్లోనే తింటాను అని జగదాత్రి వైజయంతి అందరికీ వడ్డిస్తారు. వైజయంతి ప్లేట్లో అన్నం ఎక్కువ మిగిలాలని సాంబార్ పోసి కేదార్ కి అన్నం ఎక్కువ పెడుతుంది. కేదార్ తలవంక చూస్తాడు.పర్వాలేదు తిను అని సైగ చేస్తుంది జగదాత్రి. అందరు తిని వెళ్ళిపోతారు. కేదార్ వెళ్లిపోతూ జగదాత్రి వంక చూస్తాడు. నువ్వు వెళ్ళు నేను తింటాను అన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తుంది జగదాత్రి. అయ్యంగిలి ప్లేట్లలో తినలేక కాచి నిషిక పారిపోతారు. జగదాత్రి కేదార్ తిన్న ప్లేట్లో అన్నం కళ్ళకు హద్దుకొని మరి తింటుంది. అది చూసి సామ్రాజ్యం వైజయంతి కౌశికి షాక్ అయిపోతారు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 29 2024 Episode 217 highlights
Jagadhatri Today Episode April 29 2024 Episode 217 highlights

అసలు నేను చూసింది నిజమో కాదో తెలియడం లేదు కాచి ఏమో తన మొగుడి ప్లేట్లో చెయ్యి పెట్టలేక పోయింది నిషిక అసలు వాంటింగ్ చేసుకోబోయింది అలాంటిది ఆ అమ్మాయి ఎలా తినింది పిన్ని అని వైజయంతి అంటుంది.మనమే పొరపడి ఉంటాం అమ్మమ్మ నువ్వు చూసింది వాళ్ళనేనా అని కౌశికి అంటుంది. అక్క ఈ ఒక్క దానితో వాళ్ళిద్దరు భార్యాభర్తలని ఎలా నమ్మగలం అని కాచి అంటుంది. సాక్ష్యాలు ఉండుంటే నా అనుమానం కూడా తొలగిపోతుంది అని కౌశికి వెళ్లిపోతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా తినింది ఆ ప్లేట్లో అని వైజయంతి అంటుంది.అత్తయ్య అదేమి ప్రేమానురాగాలతో పెరగలేదు మా అమ్మ నేను తిట్టి ఏదో పెడితే అదేమహా ప్రసాదంగా తినేది అని నిషిక అంటుంది. అందుకు కాదు ఆ అమ్మాయి అలా తినేసింది అందుకే నేను పెట్టిన పరీక్షలో నెగ్గింది అని సామ్రాజ్యం అంటుంది. ఇప్పుడు ఎలాగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదో తెలిసేది అని వైజయంతి అంటుంది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని నిషిక అంటుంది. ఎలా అని కాచి అంటుంది. జగదాత్రి కేదార్ పడుకున్నక వాళ్ళ గదిలోకి వెళ్లి తాళిని కట్ చేస్తే ఆ తాళిని మళ్లీ కేదారే కట్టాలి కాబట్టి కేదార్ కడితే నిజంగా వాళ్లకు పెళ్లయినట్టు అని నిషిక అంటుంది. ఈ ప్లాను వాళ్లకు పెళ్లయిందా కాదా అని తెలుసుకునేలా లేదు వాళ్ళకి పెళ్లి చేస్తున్నట్టుంది అని కాచి అంటుంది.భర్త బ్రతికుండగానే చేస్తే తన ప్రాణానికి ప్రమాదం అయితే ఎలా అని వైజయంతి అంటుంది.అత్తయ్య ఏదో వాళ్ళిద్దరిని మనం వేరు చేయడానికి కాదు కదా వాళ్ళు భార్యాభర్తల కాదా తెలుసుకోవడానికి అని నిషిక అంటుంది. సరే ఇప్పుడు ఆ తాలిని ఎవరు కట్ చేస్తారు అని వైజయంతి అంటుంది. నేను కట్ చేస్తాను అని కాచి అంటుంది. ఆపరేషన్ సక్సెస్ చేయాలి అని నిషిక అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 29 2024 Episode 217 highlights
Jagadhatri Today Episode April 29 2024 Episode 217 highlights

కేదార్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది కేదార్ ఏం ఆలోచిస్తున్నావ్ అని జగదాత్రి అడుగుతుంది. నాకు భయం వేస్తుంది జగదాత్రి అని కేదార్ అంటాడు ఎందుకు కేదార్ అమ్మమ్మ మనకు పెళ్లి కాలేదని నిరూపిస్తుందన అని జగదాత్రి అంటుంది. నా స్నేహితురాలుగా నాకు సహాయం చేయడానికి వచ్చావు అలాంటిది నీకు ఇన్ని కష్టాలు నామీద నాకే కోపం వేస్తుంది అని కేదార్ అంటాడు..

Related posts

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N