NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

Tenth Results: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలైయ్యాయి. మంగళవారం బషీర్ భాగ్ లోని ఎస్‌సీఈఆర్‌టీ లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఎస్ఎస్‌సీ ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 91.31 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణులైయ్యారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఈ సారి కూడా బాలికలదే పై చేయి. బాలికలు 92.23 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత పొందారు.

ఫెయిల్ అయి విద్యార్ధులు ఎవరు ఆందోళన చెందవద్దని, వారు సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చని ఆయన సూచించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఫలితాల్లో 99.05 శాతంతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 91,31 శాతం తో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. 3927 పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఆరు ప్రైవేటు పాఠశాలలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత. జిల్లా పరిషత్ గవర్నమెంట్ పాఠశాలల్లో 91.31 శాతం ఉత్తీర్ణత సాధించగా, తెలంగాణ గురుకులాల్లో 98.71 శాతం ఉత్తీర్ణత సాధించారు.

జూన్ 2 నుండి జూలై 13వ తేదీ వరకూ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. మార్కులపై విద్యార్ధులకు సందేహాలు ఉంటే రీ వాల్యూయేషన్, రీ వెరిఫికేషన్ కోసం 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

కాగా, రాష్ట్రంలో మార్చి 18వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకూ టెన్త్ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాశారు. వీరిలో రెగ్యులర్ విద్యార్ధులు 4,94,207 మంది, ప్రైవేటు గా 11,606 మంది హజరైయ్యారు. వీరిలో బాలురు 2,07,952 మంది, బాలికలు 2,50,433 మంది పరీక్షలు రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.

ఫలితాల కొరకు ఈ కింద లింక్ లను క్లిక్ చేసి చూడవచ్చు

http://results.bse.telangana.gov.in

http://results.bsetelangana.org

Related posts

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N