NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

ఏపీలో కొన్నాళ్లుగా క‌ల‌క‌లం రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌.. రాజ‌కీయంగా పెనుదుమారం రేపుతు న్న విష‌యం తెలిసిందే. ఈ చ‌ట్టం ద్వారా ప్ర‌జ‌ల ఆస్తులను, భూముల‌ను జ‌గ‌న్ దోచుకుంటార‌ని.. ప్ర‌జ‌ల ఆస్తుల‌కు భ‌ద్ర‌త లేకుండా పోతుంద‌ని ప్ర‌తి పక్షాలు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఇక‌, ప్ర‌ధాన మీడియా కూడా ఇదే త‌ర‌హా వివ‌ర‌ణ‌ల‌తో క‌థ‌నాలు వండి వారుస్తోంది.

దీంతో ఒక‌ర‌కంగా.. ప్ర‌జ‌ల్లో అత్యంత వేగంగా దీనిపై చ‌ర్చ జ‌రుగుతోంది. నిజానికి ఈ విష‌యం తెర‌మీదికి రాక‌ముందు వ‌ర‌కు కూడా.. వైసీపీ మేనిఫెస్టో.. టీడీపీకూట‌మి మేనిఫెస్టోల‌పై చ‌ర్చ సాగింది. కానీ, ఎప్పుడైతే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెర‌మీదికి వ‌చ్చిందో.. అనేక విష‌యాలను ఇది డామినేట్ చేసే సింది. ప్ర‌త్యేకంగా.. వైసీపీకి అప్ప‌టి వ‌ర‌కు ఉన్న `హోప్స్‌`ను కూడా.. ఈ వాద‌న తెర‌మ‌రుగు చేసింద‌నే చెప్పాలి.

ఇలాంటి స‌మ‌యంలో ఎన్నో ఆత్మ‌ర‌క్ష‌ణ‌లు చేప‌ట్టింది. గ‌తంలో టీడీపీ ఎమ్మెల్యేలే.. దీనిని స‌మ‌ర్థించారంటూ.. వైసీపీ అనుకూల మీడియాలోనూ ప్ర‌చారం చేశారు. ఇది నిజ‌మే కావొచ్చు. కానీ, దీనికి మించిన బ‌ల‌మైన ఆరోప‌ణ‌ల‌తో మాజీ ఐఏఎస్ ఒక‌రు మీడియా ముందుకు వ‌చ్చారు. ఇది మ‌రింత‌గా వైసీపీకి సెగ పెడుతోంది. `ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు నేనే ప్ర‌త్య‌క్ష బాధితుడిని` అంటూ.. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ ర‌మేష్ చేసిన సంచ‌ల‌న ట్వీట్‌.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజ‌కీయ వివాదాన్ని మ‌రింత రాజేసింది.

పీవీ ర‌మేష్ కొన్నాళ్లుగా వైసీపీకి దూరంగా ఉన్నారు. గ‌తంలో ఈయ‌న స‌ల‌హాదారుగా జ‌గ‌న్‌కు ప‌నిచేశారు. అయితే.. కొన్ని కార‌ణాల‌తో ఆయ‌న‌ను త‌ప్పించారు. ఈ క్ర‌మంలో అప్ప‌టి నుంచి ఆయ‌న వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. ఇక‌, తాజాగా ఆయ‌న చెప్పిన వ్య‌వ‌హారం మ‌రింత‌గా వైసీపీకి ఇబ్బందిగా మారింది. ఇది సాధార‌ణ‌, సామాన్య ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలా ప్ర‌తిప‌క్షాలు ప్ర‌య‌త్నిస్తుంటే.. వెళ్ల‌కుండా చూసేందుకు వైసీపీ నానా తంటాలు ప‌డుతోంది. ఎలా చూసుకున్న ఈ వ్య‌వ‌హారం.. ఎన్నిక‌ల్లో కీల‌క పాత్ర పోషిస్తే.. అంటే ప్ర‌తిప‌క్షాలు న‌మ్మితే వైసీపీకి డ్యామేజీకావడం త‌థ్య‌మే. అలా కాకుండా… ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ప్ర‌చారం క‌నుక బూమ‌రాంగ్ అయితే మాత్రం.. అది ప్ర‌తిప‌క్షాల‌కే నష్టం చేకూర్చ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Related posts

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N