NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

Ramya Krishnan: సీనియర్ స్టార్ బ్యూటీ రమ్యకృష్ణ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. 90వ దశకంలో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తార‌ల్లో రమ్యకృష్ణ ఒక‌రు. దశాబ్దం కాలం పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కథానాయికగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ర‌మ్య‌కృష్ణ త‌న కెరీర్ ను పరుగులు పెట్టించారు. అగ్ర హీరోలంద‌రితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. హీరోయిన్‌ గా ఫేడ్ అవుట్ అయిన తర్వాత సహాయక పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

అయితే నటిగా దాదాపు మూడు దశాబ్దాల నుంచి రాణిస్తూ చిత్ర పరిశ్రమంలో తనదైన ముద్ర వేసిన రమ్యకృష్ణ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్ చేశారు. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది అతిపెద్ద సమస్య. సినిమా అవ‌కాశాల పేరుతో హీరోయిన్ల‌ను ప‌డ‌క‌గ‌దికి పిలిపించుకునే ప్ర‌క్రియ‌నే క్యాస్టింగ్ కౌచ్ అంటారు. ఇప్పటికే ఎంద‌రో హీరోయిన్లు, నటీమణులు తాము కాస్టింగ్ కౌచ్ బాధితులమే అంటూ గళం విప్పారు. ఇండస్ట్రీలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను నిర్భ‌యంగా బయటపెట్టారు.

తాజాగా కాస్టింగ్ కౌచ్ పై సీనియ‌ర్ న‌టీమ‌ణి రమ్యకృష్ణ కూడా మాట్లాడారు. `సినీ పరిశ్రమలోనే కాదు అన్ని రంగాల్లోనూ కాస్టింగ్ సమస్య ఉంది. అయితే సెలబ్రిటీలే ఎక్కువగా తెరపైకి రావడంతో అందరూ సినిమా ఇండస్ట్రీ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అయినా సినిమాల్లో స్టార్ గా ఎద‌గాలంటే హీరోయిన్లు కొన్ని సార్లు సర్దుకుపోవాల్సిందే` అంటూ ర‌మ్య‌కృష్ణ చెప్పుకొచ్చారు. దర్శక-నిర్మాతలు లేదా హీరోల కోరిక హీరోయిన్లు తీర్చాల్సిందే.. లేదంటే కెరీర్ ఉండ‌ద‌ని ర‌మ్య‌కృష్న ప‌రోక్షంగా చెప్ప‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. నిజంగా సినీ ప‌రిశ్ర‌మలో అటువంటి గ‌డ్డు ప‌రిస్థితులు ఉన్నాయా అంటూ నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా చ‌ర్చ‌లు మొద‌లు పెట్టారు. కాస్టింగ్ కౌచ్ గురించి ర‌మ్య‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కంగా స్పందిస్తున్నారు.

కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ర‌మ్య‌కృష్ణ గ‌త కొన్నేళ్ల నుంచి బ‌ల‌మైన స‌హాయ‌క పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు. ఇటీవ‌ల తెలుగులో ర‌మ్య‌కృష్ణ గుంటూరు కారం మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించాడు. యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల‌, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారం యావరేజ్ టాక్ ను తెచ్చుకుంది. అయితే ఫెస్టివల్ అడ్వాంటేజ్ తో గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో మహేష్ బాబుకు తల్లిగా వైరా వసుంధర పాత్రలో రమ్యకృష్ణ అలరించారు. అలాగే గ‌త తేడాది సూపర్ స్టార్‌ రజనీకాంత్ కు భార్యగా జైలర్ మూవీలో న‌టించి బిగ్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం రమ్యకృష్ణ తెలుగు తమిళ భాషల్లో పలు క్రేజీ ప్రాజెక్ట్ ల‌లో భాగం అయ్యారు. అలాగే బుల్లితెరపై టీవీ షోలు మరియు సీరియల్స్ చేస్తూ బిజీ న‌టిగా సత్తా చాటుతున్నారు.

Related posts

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju