NewsOrbit
5th ఎస్టేట్ తెలంగాణ‌ న్యూస్

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించబోయే బహిరంగ సభకు అమిత్ షా విచ్చేశారు. మీటింగ్ కోసం అమిత్ షా రావడం ముందే ఖరారు అయ్యింది. అది ఆయన షెడ్యుల్ లో అప్పటికప్పుడు మారుతోంది. వాస్తవానికి అమిత్ షా నేరుగా మునుగోడు వచ్చి అక్కడ నుండి వెళ్లిపోవాలి. కానీ..ఆయన షెడ్యుల్ మార్చారు. ఆయన హైదరాబాద్ లో దిగి ఆయన మహాంకాళి ఆలయాన్ని దర్శించుకుని తరువాత రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి అక్కడ రామోజీని కలిసి, ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి అప్పుడు మునుగోడు వెళ్లడం, లేదా ముందుగా మునుగోడు వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొని రోడ్డు మార్గం ద్వారా హైదారాబాద్ వచ్చి రామోజీని కలిసి ఆ తరువాత ఎన్టీఆర్ తో డిన్నర్ మీటింగ్ తరువాత ఢిల్లీకి వెళ్లడం. ఇలా షెడ్యుల్ మారుతూ వచ్చింది. ఎన్ని షెడ్యుల్ లు మారినా అమిత్ షా – రామోజీ భేటీ మాత్రం ఖాయం. అలానే అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీ కూడా కన్ఫర్మ్. ఈ రాత్రి ఈ ఇద్దరు ప్రముఖులతో అమిత్ షా భేటీ అవుతారు. అయితే అమిత్ షా అర్జంట్ గా వీరిద్దరితో కలవాల్సిన అవసరం ఏమిటి..? నరేంద్ర మోడీ ఒక దూతగా ఏమైనా పంపించారా..? అసలు ఏమి జరగబోతున్నది..? అని తెలుసుకోవాలంటే…

తెలంగాణలో టీడీపీతో పొత్తుపై అంతర్గత చర్చ..?

ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలు, బీజేపీ అవసరాలు, టీడీపీ అవసరాలు, టీఆర్ఎస్ పరిస్థితి, బీజేపీ ప్రణాళికలు అందరికీ తెలుసు. ప్రస్తుత బీజేపీ లక్ష్యం తెలంగాణలో అధికారంలోకి రావాలి. ఏపిలో వాళ్లు అనుకున్న ప్రభుత్వం ఉండాలి.మొదట తెలంగాణలో అధికారంలోకి రావాలి అంటే చిన్న చిన్న వర్గాలను కలుపుకుని వెళ్లాలి. టీడీపీ లాంటి పార్టీని కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 40కిపైగా స్థానాలు గెలిచారు అంటే హైదరాబాద్ లో సెటిలర్స్ ఓట్లు పడటమే కారణం. సెటిలర్స్ అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్ధులు గెలిచారు. సెటిలర్స్ బలం ఏమిటి అనేది బీజేపీకి తెలిసింది. టీడీపీ ఓటింగ్ బలం ఖమ్మం, హైదరాబాద్.తదితర నియోజకవర్గాల్లో ఉంది కాబట్టి టీడీపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి ఉన్న కొద్ది బలం ద్వారా అదనపు సీట్లు సాధించవచ్చు అనే భావన ఉంది. బీజేపీకి ఉన్న బలంతో టీడీపికి ఉన్న 10 – 12 శాతం ఓటింగ్ కలిస్తే కొన్ని స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉంటాయి. అందుకోసం టీడీపీని కలుపుకుపోవడానికి బీజేపీ వెళుతోంది. ఇదే సమయంలో తెలంగాణలో సపోర్టు ఇవ్వాలంటే ఏపిలో సపోర్టు ఇవ్వాలనే లెక్క కూడా ఉంటుంది. సో .. ఆ లెక్కలను సరిచేయడానికి, ఆ విషయాలు మాట్లాడటానికి రామోజీ తో భేటీ. అంతకు మించి వేరే ఏమీ ఉండదు. జరుగుతున్న పరిణామాలు చూస్తే రాజకీయ విశ్లేషకులు అందరికీ ఇది స్పష్టంగా తెలుస్తుంది.

జూనియర్ అభిమానులకు ఆకట్టుకునేందుకు ప్లాన్

ఇక జూనియర్ ఎన్టీఆర్ భేటీ విషయానికి వస్తే .. ఇది కూడా తెలంగాణలో సెటిలర్స్ ఓట్ల కోసమే. ఆయన క్రేజ్ వాడుకోవాలన్నది బీజేపీ ప్రయత్నం. ఇప్పటికే తమిళనాడులో రజనీకాంత్ కు గవర్నర్ పదవి ఇస్తామని బీజేపీ ఎర వేసింది. ప్రధాన పత్రికల్లో దీనికి సంబంధించి వార్తలు వచ్చాయి. అయితే రజనీకాంత్ గవర్నర్ పదవి తీసుకుంటారు అనేది అనుమానమే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఏదో పదవి ఇస్తారు అనేది కాదు, అంతర్గతంగా సపోర్టు కోరడం కోసమే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా యాక్టివ్ గా ఏమి లేరు. ఆయన బీజేపీ తరపున ఏమీ ప్రచారం చేయరు. అంతర్గతంగా ఆయనతో మాట్లాడటం ద్వారా ఆయనకు ఉన్న సినీ చరిష్మాను వాడుకోవాలని బీజేపీ చూస్తొంది. తెలంగాణలో పొత్తుల విషయంలో కొంత మార్పులు ఉండవచ్చు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటన బాగుంది కాబట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆయనతో సన్నిహితంగా ఉండటం వల్ల ఆయన ఫ్యాన్స్ ను బీజేపీ పట్ల ఆకర్షితులు కావచ్చేమో అన్న ఆలోచన కూడా ఉంది. ఈ మూడు నాలుగు అంశాల మేరకు అమిత్ షా .. రామోజీ, జూనియర్ లతో భేటీ జరుగుతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వారితో అమిత్ షా భేటీ తరువాత కొంత వరకూ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

author avatar
Special Bureau

Related posts

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!